7 రోజుల్లో 26,689 మంది హాజరు
కొత్తగూడెం: ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో నిర్వహిస్తున్న ఆర్మీ రిక్రూట్మెంట్ ప్రక్రియలో భాగంగా బుధవారం నాటికి దేహదారుఢ్య పరీక్షలు ముగిశాయి. ఈ నెల 4న సింగరేణి సంస్థ, రెవెన్యూ, పోలీస్ శాఖల సహకారంతో కొత్తగూడెంలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ప్రారంభమైంది. సోల్జర్ ట్రేడ్స్‌మన్, సోల్జర్ క్లర్క్, సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్, సోల్జర్ జనరల్ డ్యూటీ, సోల్జర్ ట్రేడ్స్‌మన్, రిలీజియన్ టీచర్, డీఎస్సీ విభాగాల్లో ఎంపిక ప్రక్రియలు కొనసాగాయి. అన్ని విభాగాలకు తెలంగాణలోని 10 జిల్లాల నుంచి మొత్తం 36,051 మంది అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. వారంపాటు ఒక్కో విభాగానికి సంబంధించి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొనసాగింది.
చివరిరోజైన బుధవారం సోల్జర్ ట్రేడ్స్‌మన్, రిలీజియన్ టీచర్, డీఎస్సీ విభాగాలకు 1,976 మంది దరఖాస్తు చేసుకోగా 1,220 మంది హాజరయ్యారు. వీరిలో పరుగుపందెంలో 343 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. మొత్తం వారంరోజుల్లో 36,051 మంది అభ్యర్థులకుగాను 26,689 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో 22,519 మంది సర్టిఫికెట్ వెరిఫికేషన్‌లో ఎంపిక కాగా, 4,154 మంది అభ్యర్థులు పరుగుపందెంలో ఎంపికయ్యారు. ఇప్పటివరకు దేహధారుడ్య పరీక్షల్లో ఎంపికైన అభ్యర్థులకు ఈనెల 14వ తేదీ వరకు కొత్తగూడెం పట్టణంలో మెడికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. మెడికల్ అనంతరం ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 28వ తేదీన సికింద్రాబాద్‌లో రాత పరీక్ష నిర్వహించి ఆర్మీకి ఎంపిక చేస్తారు.
ముగిసిన ఆర్మీ పరుగు
Published Thu, Feb 11 2016 3:59 AM
Advertisement
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్‌కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్‌గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్‌లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
బెంగళూరులో నయా స్కాం.. ఫేక్ స్క్రాచ్ కార్డ్‌తో రూ.18 లక్షలు దోపిడీ
విధుల్లో చేరిన ఎయిర్ ఇండియా సిబ్బంది
పుట్టినరోజున టాలీవుడ్ స్టార్ సింగర్ సునీత అరుదైన ఘనత
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హీరో నాగచైతన్య తల్లి!
ఢిల్లీపై ఆర్సీబీ ఘన విజయం.. వరుసగా ఐదో గెలుపు
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
టీడీపీ అభ్యర్థి ఆఫీస్‌ను ముట్టడించిన మహిళలు
మదర్స్ డే స్పెషల్: 47 ఏళ్ల నాటి ఫోటో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా
యాంకర్ శ్రీముఖికి త్వరలో పెళ్లి? రివీల్ చేసిన 'జబర్దస్త్' కమెడియన్
రాజస్తాన్‌ను చిత్తు చేసిన చెన్నై.. ప్లే ఆఫ్స్ రేసులో మున్ముందుకు
తప్పక చదవండి
- పెత్తందారుల వెన్నులో వణకు తెప్పిస్తున్న కొత్తతరం..!
- నాడు చెప్పుతో కొట్టి.. నేడు ‘కాపు’ కాస్తానంటూ కాకమ్మ కబుర్లు!
- నాడు చదువులు ఉత్త మిథ్య.. నేడు జీవితకాల భరోసా!
- బాబు షాక్‌కు.. జగన్ ట్రీట్మెంట్
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
- పవన్ వ్యూహానికి వంగా గీత కౌంటర్ వ్యూహమిదే..!
- సీఎం వైఎస్ జగన్ చేయూత.. పారిశ్రామికవేత్తలుగా మహిళలు
- RRRకి కమ్మటి దెబ్బ.. పరువు తీసేసిన బీజేపీ!
- దారి తప్పిన మేధావి.. ఎందుకీ మార్పు?
Advertisement