ఆల్వాన్‌పల్లిలో భారీ చోరీ | Sakshi
Sakshi News home page

ఆల్వాన్‌పల్లిలో భారీ చోరీ

Published Sat, Oct 18 2014 4:00 AM

ఆల్వాన్‌పల్లిలో భారీ చోరీ - Sakshi

 జడ్చర్ల: మండలంలోని ఆల్వాన్‌పల్లిలో శుక్రవారం పట్టపగలు భారీ చోరీ జరిగింది. తాళం వేసిన ఇంట్లోకి చొరబడిన దొంగలు దాదాపు రూ.5 లక్షల విలువ చేసే బంగారు నగలు అపహరించుకెళ్లారు. సీఐ జంగయ్య కథనం మేరకు... ఆల్వాన్‌పల్లికి చెందిన మన్నెం కృష్ణారెడ్డి కుటుంబసభ్యులు శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో సొంత పనినిమిత్తం జడ్చర్లకు వెళ్లారు. అనంతరం కృష్ణారెడ్డి ఇంటికి తాళం వేసి తాళం చెవిని ఇంటి ముందు పందిరి గుంజకు ఏర్పాటు చేసిన డబ్బాలో పెట్టి పొలం దగ్గరకు వెళ్లాడు.

సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఆయన ఇంటికి వచ్చి చూడగా, తలుపు తెరచి ఉండడం గమనించి ఆందోళనపడ్డాడు. వెంటనే ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువాను పగలగొట్టి అందులో ఉన్న 18 తులాల బంగారు నగలను దొంగలించినట్లు గుర్తించాడు. దీంతో లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇటీవల కొన్ని నెలల ముందే కృష్ణారెడ్డి కుమారుడి వివాహం జరిగింది. పెళ్లి సందర్భంగా కోడలికి బంగారు నగలు పెట్టారని, వాటిని బీరువాలో దాచినట్లు బాధితుడు తెలిపాడు.

 క్లూస్ టీమ్ పరిశీలన, డాగ్ స్క్వాడ్‌తో గాలింపు
 దొంగతన ం విషయం తెలియగానే జడ్చర్ల సీఐ జంగయ్య హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్‌టీమ్ వేలిముద్రలు సేకరించింది. డాగ్ స్క్వాడ్‌ను రప్పించి గాలించారు. అయితే జాగిలం గ్రామంలో కొద్ది దూరం వెళ్లి ఆగిపోయినట్లు తెలిసింది. కే సు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Advertisement
Advertisement