పది మంది పేకాట రాయుళ్ల అరెస్ట్ | Sakshi
Sakshi News home page

పది మంది పేకాట రాయుళ్ల అరెస్ట్

Published Thu, Nov 26 2015 10:28 AM

10 people arrested in playing game cards in palamuru district

మహబూబ్‌నగర్ : పాలమూరు జిల్లాలో పది మంది పేకాట రాయుళ్లను బుధవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కడ్తాల్ మండలం మైసిగండి గ్రామంలో పేకాడుతున్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పది మందిని అరెస్ట్ చేసి, వారి నుంచి 10 సెల్‌ఫోన్‌లు, రూ.లక్షా 80 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి స్టేషన్కు తరలించారు.
 

Advertisement
Advertisement