ఆసీస్ టి20 కెప్టెన్ గా స్మిత్ | Sakshi
Sakshi News home page

ఆసీస్ టి20 కెప్టెన్ గా స్మిత్

Published Tue, Feb 9 2016 2:18 PM

ఆసీస్ టి20 కెప్టెన్ గా స్మిత్

సిడ్నీ: టి20 ప్రపంచకప్ కోసం 15 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. కెప్టెన్సీ నుంచి ఆరోన్ ఫించ్ కు ఉద్వాసన పలికింది. అతడి స్థానంలో స్టీవ్ స్మిత్ ను కెప్టెన్ గా నియమించింది. ఫించ్ 2014 అక్టోబర్ నుంచి ఆసీస్ టి20 టీమ్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. వన్డే, టెస్టు టీమ్ కెప్టెన్ గా కొనసాగుతున్న స్మిత్ కు టి20 నాయకత్వ బాధ్యతలు అప్పగించాల్సిన సమయం ఆసన్నమైందని జాతీయ సెలెక్టర్ రోడ్ మార్ష్ తెలిపారు.

మాథ్యూ వేడ్ స్థానంలో పీటర్ నెవిల్ ను వికెట్ కీపర్ గా ఎంపిక చేసింది. ఇప్పటివరకు పరిమిత ఓవర్ల మ్యాచ్ లో ఆడని నెవిల్ ను టి20 సిరీస్ కు ఎంపిక చేయడం విశేషం. సీనియర్ ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ జట్టులో స్థానం నిలుపుకున్నాడు. ఆస్టోన్ అగార్, ఆడమ్ జంపా కూడా జట్టులో చోటు సంపాదించారు.

టి20 టీమ్ ఇదే...
స్టీవ్ స్మిత్(కెప్టెన్), ఉస్మాన్ ఖ్వాజా, వార్నర్, వాట్సన్, మ్యాక్స్ వెల్, మిచ్ మార్ష్‌, ఫాల్కనర్, హేస్టింగ్స్, ఆరోన్ ఫించ్, ఆండ్రూ టైయి, పీటర్ నెవిల్, హాజిల్ వుడ్, నాథన్ కౌల్టర్-నిలే, ఆస్టోన్ అగార్, ఆడమ్ జంపా

Advertisement
Advertisement