అతను మళ్లీ విజృంభించొచ్చు! | Sakshi
Sakshi News home page

అతను మళ్లీ విజృంభించొచ్చు!

Published Mon, Mar 2 2015 8:45 PM

అతను మళ్లీ విజృంభించొచ్చు!

కాన్ బెర్రా:దక్షిణాఫ్రికా కెప్టెన్ డివిలియర్స్ ఆట గురించే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.వన్డే వరల్డ్ కప్ లో వెస్టిండీస్ తో జరిగిన లీగ్ మ్యాచ్ లో అతను ఆడిన తీరు క్రికెట్ అభిమానులకు కన్నుల పండగను అందించింది. డివిలియర్స్ నుంచి ఆ తరహా ఇన్నింగ్స్ ను మరోసారి చూసే అవకాశం ఉందని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మంగళవారం ఓవల్ లో దక్షిణాఫ్రికా-ఐర్లాండ్ ల మధ్య  లీగ్ మ్యాచ్ జరుగనుంది. ఆ క్రమంలో డివిలియర్స్ మళ్లీ చెలరేగే అవకాశం ఉందని ఆ దేశ మాజీ క్రికెట్ కెప్టెన్ షాన్ పొలాక్ స్పష్టం చేశాడు. 'అతను నిజంగా ఒక గొప్ప క్రికెటర్. వెస్టిండీస్ పై మ్యాచ్ లో చెలరేగిన తీరు అమోఘం. అతని ఆటను వీక్షించే అదృష్టం నాకు దక్కింది. మరోసారి అదే శైలిలో రేపటి మ్యాచ్ లో విజృంభిస్తాడని అనుకుంటున్నా'అని పొలాక్ స్పష్టం చేశాడు.



వెస్టిండీస్ పై డివిలియర్స్ 66 బంతుల్లో 17 ఫోర్లు, 8 సిక్సర్లు 162 పరుగులతో సునామీ సృష్టించిన సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement