ప్రియురాలితో రోహిత్ నిశ్చితార్థం | Sakshi
Sakshi News home page

ప్రియురాలితో రోహిత్ నిశ్చితార్థం

Published Mon, May 4 2015 1:09 AM

ప్రియురాలితో  రోహిత్ నిశ్చితార్థం

న్యూఢిల్లీ : మరో భారత స్టార్ క్రికెటర్ పెళ్లికొడుకు కాబోతున్నాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ... తన స్నేహితురాలు రితిక సజ్దేతో నిశ్చితార్థం చేసుకున్నాడు. గత ఆరేళ్ల నుంచి వీరిద్దరి మధ్య స్నేహం కొనసాగుతోంది. రోహిత్ మేనేజర్‌గా కూడా రితిక వ్యవహరించింది. తన క్రికెట్ కెరీర్‌ను ప్రారంభించిన ముంబై బోరివాలి స్పోర్ట్స్ క్లబ్‌లోనే ఈ 28 ఏళ్ల డాషింగ్ ఓపెనర్ తన ప్రియురాలికి పెళ్లి కోసం ప్రతిపాదించాడు. ‘మంచి స్నేహితుల నుంచి మనలో ఒకరిగా మారడం కన్నా మించింది ఏముంటుంది’ అని రోహిత్ ఎంగేజ్‌మెంట్ విషయాన్ని తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశాడు.

Advertisement
Advertisement