సరితాదేవికి షాక్ | Sakshi
Sakshi News home page

సరితాదేవికి షాక్

Published Wed, Oct 22 2014 12:35 PM

సరితాదేవికి షాక్

న్యూఢిల్లీ: భారత మహిళా బాక్సర్ సరితాదేవిపై సస్పెన్షన్ వేటు పడింది. అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య(ఏఐబీఏ) ఆమెపై ఈ చర్య తీసుకుంది. ఆసియా క్రీడల్లో కాంస్య పతకాన్ని నిరాకరించి, దాన్ని రజత పతక విజేత కొరియన్ అమ్మాయి మెడలో వేసేసి వెళ్లిపోయినందుకు ఆమెను ఏఐబీఏ సస్పెండ్ చేసింది.

ఫలితంగా అన్నిరకాల పోటీల్లో పాల్గొనకుండా ఆమెపై నిషేధం ఉంటుంది. బాక్సింగ్ కు సంబంధించిన సమావేశాల్లోనూ ఆమెకు ప్రవేశం ఉండదు.  సరితాదేవి కోచ్ లు గురుబక్ష్ సింగ్ సాంధు, ఫెర్నాడెంజ్, సాగర్ మాల్ దయాల్ పై కూడా వేటు పడింది.

ఆసియా క్రీడల్లో సెమీఫైనల్స్లో మ్యాచ్ ఫిక్సింగ్ చేసి కొరియా బాక్సర్ గెలిచినట్లు జడ్జీలు ప్రకటించడంతో సరితాదేవి, ఆమె భర్త కూడా తీవ్ర నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. పోడియం మీద కన్నీరు మున్నీరుగా విలపించి సరితాదేవి తన కాంస్య పతకాన్ని తిరిగి ఇచ్చేసింది.

Advertisement
Advertisement