టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఆసీస్ దిగ్గజ క్రికెటర్ ఆడమ్ గిల్ క్రిస్ట్ ప్రశంసలు కురిపించాడు. కోహ్లీ గొప్ప నాయకుడని, ఇప్పటికైనా ఆస్ట్రేలియా.. భారత్ జట్లు డీఆర్ఎస్ వివాదాన్ని పక్కనపెట్టి ప్రొఫెషనల్ క్రికెట్ ఆడాలని గిల్ క్రిస్ట్ అన్నాడు. ఈ సిరీస్‌లో ఇంకా కోహ్లీ బ్యాట్ నుంచి తగినన్ని పరుగులు రావాల్సి ఉంది. ధర్మశాలలో శనివారం నుంచి జరిగే చివరి టెస్టులో కోహ్లీ తనదైన ఆట చూపిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. కోహ్లీ తన జట్టుతో పాటు మొత్తం దేశాన్ని తనతో తీసుకెళ్తాడని ప్రశంసించాడు. ధర్మశాల టెస్టులో కోహ్లీ వీరవిహారం చేస్తే ఎలా ఉంటోందనని తాను భయపడుతున్నట్లు గిల్‌క్రిస్ట్ తెలిపాడు. ఇది చాలా అరుదైన సిరీస్ అని, రెండు జట్లు జాగ్రత్తగా కూర్చుని.. ఇప్పటివరకు తాము చెప్పిన విషయాలను వేరేగా ఎలా చెప్పచ్చో ఆలోచించుకోవాలని సూచించాడు. 2008లో ఇలాంటి వివాదమే ఏర్పడి అది బాగా ఎక్కువకాలం సాగిందని, ఇప్పుడు అలా కాకుండా వీలైనంత త్వరగా ఆ వివాదాన్ని ముగించుకోవాలని అన్నాడు.
భారత్-ఆస్ట్రేలియా క్రికెట్ శత్రుత్వంలో వివాదాలు కూడా అంతర్భాగమేనని తన కాలం నాటి ప్రముఖ వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ అయిన గిల్‌క్రిస్ట్ సరదాగా చెప్పాడు. సిరీస్ అయిపోయే సమయానికి రెండు జట్ల మధ్య మంచి గౌరవభావం ఉంటుందని, రెండు జట్లు చాలా మంచి పోటీ ఇస్తాయని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుత సిరీస్‌లో ఆసీస్ పెర్ఫామెన్స్ చూసి తాను చాలా ఆశ్చర్యపోతున్నట్లు తెలిపాడు. అసలు వాళ్లు ఇంత బాగా ఎలా ఆడగలిగారోనని అందరూ ఆశ్చర్యపోతున్నారన్నాడు. ఇది భలే అద్భుతమైన సిరీస్ అని, భారతదేశంలో తాము 2001 నుంచి చూసిన వాటిలో ఇదే బెస్ట్ సిరీస్ అని చాలామంది చెబుతున్నట్లు గిల్లీ చెప్పాడు.
కోహ్లీపై ఆసీస్ దిగ్గజం ప్రశంసల జల్లు
Published Thu, Mar 23 2017 6:43 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- భారత్ సేవల రంగం నెమ్మది
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్‌కు కోర్టు హెచ్చరిక
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్‌ను ఆశీర్వదించండి
- అక్రమాలు కో‘కొల్లు’లు
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement