బెడ్రూమ్‌లో నగ్నంగా వ్యక్తి.. యువతి షాక్! | Society guard attempts to rape a woman in Greater Noida | Sakshi
Sakshi News home page

బెడ్రూమ్‌లో నగ్నంగా వ్యక్తి.. యువతి షాక్!

Jun 25 2017 10:56 AM | Updated on Sep 5 2017 2:27 PM

బెడ్రూమ్‌లో నగ్నంగా వ్యక్తి.. యువతి షాక్!

బెడ్రూమ్‌లో నగ్నంగా వ్యక్తి.. యువతి షాక్!

ఫ్లాట్‌లో ఒంటరిగా ఉన్న యువతిపై అపార్ట్ మెంట్ సెక్యూరిటీ గార్డు అత్యాచారయత్నం చేశాడు.

గ్రేటర్ నోయిడా: ఫ్లాట్‌లో ఒంటరిగా ఉన్న యువతిపై అపార్ట్ మెంట్ సెక్యూరిటీ గార్డు అత్యాచారయత్నం చేశాడు. యువతి వేగంగా స్పందించి అలారమ్ ఆన్ చేయడంతో నిందితుడు పరారయ్యాడు. ఈ ఘటన శుక్రవారం రాత్రి గ్రేటర్ నోయిడాలో చోటుచేసుకుంది. ఆ వివరాలిలి.. గ్రేటర్ నోయిడాలోని ఏవీజే హైట్స్ వద్ద 11 భవనాలు ఉన్నాయి. 1800 ఫ్లాట్స్ ఉండగా, వాటిలో ఓవరాల్‌గా 1100 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి.

25 ఏళ్ల యువతి ప్రైవేట్ కాలేజీలో జాబ్ చేస్తూ ఇక్కడి ఫ్లాట్‌లో నివాసం ఉంటోంది. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం ఫ్లాట్‌కి వెళ్లిన తర్వాత డోర్ లాక్ చేయడం మరిచిపోయి నిద్రపోయింది. ఆమె కదలికలు గమనించిన సెక్యూరిటీ గార్డ్ రాజ్ కుమార్ చుట్టుపక్కల ఫ్లాట్ల డోర్లు లాక్ చేశాడు. ఆపై రాజ్ కుమార్ యువతి ఫ్లాట్‌లోకి ప్రవేశించి అన్ని తలుపులకు గడియ పెట్టాడు. బెడ్రూమ్‌లో వెళ్లి నిద్రిస్తున్న యువతిని రేప్ చేసేందుకు సిద్ధపడ్డాడు. ఇంతలో అలికిడి విని లేచిన యువతి నగ్నంగా మారుతున్న సెక్యూరిటీ గార్డ్ ను చూసి షాక్ కు గురైంది.

పారిపోయేందుకు యత్నించగా ఆమెను గట్టిగా పట్టుకుని బెడ్ మీదకు లాక్కున్నాడు. అతడి భారి నుంచి తప్పించుకుని వెంటనే ఫ్లాట్ అలారమ్ ను మోగించింది. కిటికీ తెరచి నన్ను కాపాడండి.. అంటూ గట్టిగా అరవడం మొదలుపెట్టింది. ఏం చేయాలో అర్థంకాని రాజ్ కుమార్ వెనక వైపు డోర్ తెరుచుకుని పరారయ్యాడు. గత మే31న అల్మారా లాక్ ప్రాబ్లం ఉందని సెక్యూరిటీ గార్డ్ సాయం కోరింది. ఆ రోజు నుంచి ఆమె కదలికల్ని గమనించిన రాజ్ కుమార్ యువతిపై ఆశ పెంచుకుని ఈ అఘాయిత్యానికి యత్నించాడని పోలీసులు తెలిపారు. సెక్యూరిటీ గార్డుపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement