ఫోర్న్ వీడియోల సూత్రధారి ఒక్కడే | Sakshi
Sakshi News home page

ఫోర్న్ వీడియోల సూత్రధారి ఒక్కడే

Published Tue, Jul 7 2015 9:55 AM

ఫోర్న్ వీడియోల సూత్రధారి ఒక్కడే - Sakshi

న్యూఢిల్లీ: ఆన్లైన్లో అభ్యంతరకర వీడియో పోస్టు చేసిన కేసులో బెంగళూరుకు చెందిన యువకుడే ప్రధాన సూత్రధారిగా సీబీఐ నిర్ధారించింది. కొద్దిరోజుల కింద ఓ యువతితో ఏకాంతంగా గడిపిన వీడియోను దుండగులు సోషల్ మీడియాలో ఆప్లోడ్ చేశారు. వాట్సాప్లో ఈ వీడియో బాగా సర్క్యూలేట్ అవడంతో హైదరాబాద్ కు చెందిన  ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హెల్ ఎల్ దత్తుకు లేఖ రాసింది. సుమోటోగా విచారణ ప్రారంభించిన అత్యున్నత న్యాయస్థానం నిందితులను అరెస్ట్ చేయాలని సీబీఐను ఆదేశించింది. లైంగిక చర్యలు చిత్రీకరిస్తున్న ఆరోపణల పై కౌశక్ కౌనర్పై మేలో కేసు నమోదు చేసిన సీబీఐ విచారణ చేపట్టింది.

బెంగళూరులోని సంపన్నకుటుంబానికి చెందిన కౌశక్ కౌనర్(20) పోర్న్ సైట్ల నుంచి భారతీయ మహిళలు, అమ్మాయిల అభ్యంతరకర వీడియోలని డౌన్లోడ్ చేసి వాటిని ఎడిట్ చేసి తిరిగి ఇంటర్నెట్లో(వీడియోని చూడడానికి ఎవరైనా క్లిక్ చేస్తే తన ఖాతాలోకి డబ్బు రావడానికి) పోస్ట్ చేసేవాడని సీబీఐ విచారణలో తేలింది.  అతని నుంచి 470 పోర్న్ వీడియో క్లిప్లతో పాటూ అత్యాధునిక ఎడిటింగ్ సాఫ్ట్ వేర్, హార్డ్ డిస్క్, రహస్యకెమరాలను సీబీఐ స్వాధీనం చేసుకుంది. సీబీఐ అధునాతన ఫోరెన్సిక్ సాప్ట్ వేర్ను ఉపయోగించి ఈ అభ్యంతరకర వీడియోల మూలాలని కనుగొన్నారు.

Advertisement
Advertisement