నితిన్ నోట త్రివిక్రమ్ మాట! | Sakshi
Sakshi News home page

నితిన్ నోట త్రివిక్రమ్ మాట!

Published Mon, Aug 31 2015 1:07 AM

నితిన్ నోట త్రివిక్రమ్ మాట!

త్రివిక్రమ్ మాటల తూటాలు ఏ హీరో నోటి నుంచి పేలినా అవి ప్రేక్షకులకు మంచి కిక్ ఇస్తాయి. అది ఆయన డైలాగ్స్‌కున్న పవర్. ‘సన్నాఫ్ సత్యమూర్తి’ తర్వాత ఆయన తెరకెక్కించనున్న సినిమా గురించి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ  తరుణంలో ఆయన తాజా చిత్రానికి సంబంధించిన కబురు రానే వచ్చింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్ హీరోగా ఓ చిత్రం రూపొందనుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై త్రివిక్రమ్‌తో  ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రాలను రూపొందించిన సూర్యదేవర రాధాకృష ్ణ(చిన బాబు) ఈ చిత్రానికి నిర్మాత. ఇందులో నితిన్ సరసన ఇద్దరు హీరోయిన్లు నటిస్తారు.
 
 ఓ కథానాయికగా స్టార్ హీరోయిన్ సమంత నటించనుండగా, ఇంకో కథానాయికను ఎంపిక చేయాల్సి ఉంది. ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ- ‘‘సెప్టెంబరు మూడో వారంలో షూటింగ్ ప్రారంభించి, సంక్రాంతి కానుకగా విడుదల చేస్తాం. త్వరలోనే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను తెలియజేస్తాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్, కెమెరా: నటరాజ్ సుబ్రమణియన్, ఆర్ట్: రాజీవన్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: పి.డి.వి.ప్రసాద్, సమర్పణ: శ్రీమతి మమత.
 

Advertisement
Advertisement