సమాజానికి వైద్యం | Sakshi
Sakshi News home page

సమాజానికి వైద్యం

Published Wed, Mar 4 2015 11:44 PM

సమాజానికి వైద్యం - Sakshi

తెర వెనుక వివిధ శాఖల్లోని సాంకేతిక నిపుణులు తెర ముందుకొచ్చి నటించడం ఇటీవల తరచూ జరుగుతోంది. సంగీత శాఖ నుంచి అలా తెర ముందుకు వచ్చినవారిలో తాజా చేర్పు - విజయ్ ఆంటోనీ. తమిళనాట విజయ్ ఆంటోనీ నటుడిగా కూడా ఎంతటి విజయం సాధించారంటే, గత ఏడాది అక్కడ విడుదలైన ‘సలీమ్' చిత్రం ఏకంగా రూ. 45 కోట్ల దాకా వసూలు చేసినట్లు కోడంబాకం వర్గాల కథనం. ఇప్పుడు అదే చిత్రాన్ని తెలుగులో ‘డాక్టర్ సలీమ్’గా అందిస్తున్నారు నిర్మాత, పంపిణీదారు సురేశ్ కొండేటి. విజయ్ ఆంటోనీ, అక్ష జంటగా నటించిన ఈ చిత్రాన్ని తెలుగులో నాగప్రసాద్ సన్నితి సమర్పణలో ఎస్.కె. పిక్చర్స్, ఓబులేశ్వర ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి.

‘‘విజయ్ ఆంటోనీ కథానాయక పాత్ర పోషిస్తూ, మరోపక్క సంగీతం కూడా అందించిన ఈ చిత్ర గీతాలకు మంచి స్పందన లభిస్తోంది’’ అని సురేశ్ చెప్పారు. ఎన్.వి. నిర్మల్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కథానాయక పాత్ర కీలకం. వైద్యం పేరుతో జనాన్ని దోచుకొనే కొందరు కార్పొరేట్ వైద్యులకు భిన్నంగా అన్యాయాన్ని ఎదిరించే ఒక నిజాయతీపరుడైన వైద్యుడి కథ ఇది. సమకాలీన సమాజంలో జరుగుతున్న అనేక సంఘటనలకూ, వైద్యవృత్తిలోని పలు అంశాలకూ అద్దం పట్టే ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను ఈ నెల 13న విడుదల చేయనున్నారు.

Advertisement
Advertisement