చెన్నై: దర్శకుడు కె.రాఘవేంద్రరావుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నిర్మాత కె.మురారీ క్షమాపణ చెప్పాలని సీనియర్ నిర్మాత, జి.ఆర్.పి ఆర్ట్స్ అధినేత ఆర్.వి. గురుపాదం డిమాండ్ చేశారు. ఇటీవల గీత విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టర్ బిరుదును అందుకున్న ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు ఆ బిరుదుకు అర్హుడు కాదంటూ నిర్మాత మురారీ విమర్శించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై స్పందించిన ఆర్.వి.గురుపాదం మురారీ చర్యల్ని తీవ్రంగా ఖండించారు.
ఆయన చెన్నైలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మురారీ వ్యాఖ్యలు విని షాక్ అయ్యానన్నారు. తెలుగు సినిమా గర్వించ దగ్గ దర్శకుడు కె.రాఘవేంద్రరావు అన్నారు. అన్నమయ్య, శ్రీరామదాసు, షిరిడి సాయి బాబా వంటి గొప్ప భక్తిరస కథా చిత్రాలను తెరపై ఆవిష్కరించిన ఖ్యాతి రాఘవేంద్రరావుదన్నారు. ఆదుర్తి సుబ్బారావు, వి.మధుసూదనరావు, వి.బి.రాజేంద్ర ప్రసాద్, కె.ఎస్.ఆర్ దాసు దాసరి నారాయణ రావు లాంటి తెలుగు చిత్ర పరిశ్రమ చరిత్రను తిరిగి రాసిన దర్శకుల్లో రాఘవేంద్రరావు ఒకరన్నారు. కమర్షియల్ దర్శకుడిగా తనదైన ముద్రవేసుకున్న రాఘవేంద్రరావుది నేటి స్టార్ హీరోలు వెంకటేష్, మహేశ్ బాబు, అల్లు అర్జున్ వంటివారిని తెరకు పరిచయం చేసిన ఘనత అన్నారు.
ఎన్టీ రామారావు, అక్కనేని నాగేశ్వరరావు, చంద్రబాబులాంటి వారికి అత్యంత సన్నిహితులైన రాఘవేంద్రరావును చాలా కొన్ని చిత్రాలు నిర్మించిన మురారీ విమర్శించడం హాస్యాస్పదం అన్నారు. వ్యక్తిగత కారణాలతో ఒక వ్యక్తిని బహిరంగంగా విమర్శించడం హర్షనీయం కాదన్నారు. ఈ వ్యవహారంలోకి మురారీ వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు. లేని పక్షంలో వ్యవహారం చాలా వరకు వెళుతుందని హెచ్చరించారు. కె.మురారీ అంశాన్ని హైదరాబాద్‌లోని చిత్ర పరిశ్రమకు చెందిన అన్ని శాఖల ప్రతినిధులు దృష్టికి తీసుకెళ్లనున్నట్లు ఆర్.వి.గురుపాదం వెల్లడించారు.
'మురారీ వ్యాఖ్యలు విని షాక్ అయ్యా'
Published Mon, Sep 15 2014 9:01 AM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆది సాయికుమార్ కొత్త మూవీ.. గోవాలో మ్యూజిక్ సిట్టింగ్స్
కాంగ్రెస్‌కు శామ్ పిట్రోడా రాజీనామా
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
IPL 2024: సన్‌రైజర్స్, లక్నో మ్యాచ్.. లంక యువ స్పిన్నర్ అరంగేట్రం
ఒక్క క్లిక్‌తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
IPL 2024 SRH VS LSG: మరో మూడేస్తే..!
ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
తప్పక చదవండి
- ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
- ఒక్క క్లిక్‌తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్‌కి టెండర్ వేసిన 'దేవర'?
- ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
- టీ20 వరల్డ్‌కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement