అది ఓ కదిలే నగరమే.. | World's largest cruise ship, costing $1B, sets sail | Sakshi
Sakshi News home page

అది ఓ కదిలే నగరమే..

May 16 2016 8:35 PM | Updated on Sep 4 2017 12:14 AM

అది ఓ కదిలే నగరమే..

అది ఓ కదిలే నగరమే..

ప్రపంచంలోనే అతిపెద్ద విశాలమైన 'నౌక హర్మనీ ఆఫ్ ది సీస్' సముద్రంలో దూసుకుపోతోంది.

ప్రపంచంలోనే అతిపెద్ద నౌక ' హర్మనీ ఆఫ్ ది సీస్' సముద్రంలో దూసుకుపోతోంది. ఫ్రెంచ్ షిప్ యార్డులో దీన్ని తయారు చేయడానికి 32 నెలలు సమయం పట్టింది. ఫ్రాన్స్లోని వెస్టర్న్ పోర్టు టౌన్ లోని సెయింట్-నజైర్ నుంచి యూకేకు బయలుదేరిన హర్మనీ ఆఫ్ ది సీస్కు వేలాది మంది ఫ్రెంచ్ అభిమానులు ఘనంగా వీడ్కోలు పలికారు.

దీన్ని తయారుచేయడానికి దాదాపు 660 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. హర్మనీ ఆఫ్ ది సీస్ 362 మీటర్లతో ఏకంగా ఈఫిల్ టవర్ ఎత్తుకన్నా పొడవుతో ప్రపంచంలోనే విశాలమైన నౌకగా గుర్తింపుపొందింది. 16 అంతస్తులు, విశాలమైన 20 డైనింగ్ రూంలు, 23 స్విమ్మింగ్ పూల్స్, ఓ పార్కు, 10వేల మొక్కలు, 50 వృక్షాలు, వినోదాల కోసం ప్రత్యేకంగా థియేటర్లతోపాటూ 2500 రూములతో నగరమే కదులుతుందా అనే రీతిలో ఉన్న ఈ నౌక 6,360 మంది ప్రయాణికులను తీసుకు వెళ్లే సామర్థ్యం కలిగిఉంది. మే22న అధికారిక తొలి ప్రయాణానికి బార్సిలోనాలో ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement