‘ఉగ్రవాదమే చివరకు పాక్‌ను మింగేస్తుంది’ | Sakshi
Sakshi News home page

‘ఉగ్రవాదమే చివరకు పాక్‌ను మింగేస్తుంది’

Published Sun, Feb 19 2017 2:06 PM

‘ఉగ్రవాదమే చివరకు పాక్‌ను మింగేస్తుంది’

ఇండోర్‌: పాకిస్థాన్‌ పాలకులు ఉగ్రవాదులకు మద్దతిస్తున్నారని అఫ్ఘనిస్థాన్‌ అసెంబ్లీ స్పీకర్‌ అబ్దుల్‌ రవూఫ్‌ ఇబ్రహీం ఆరోపించారు. ఇండోర్‌లో జరుగుతున్న దక్షిణాసియా దేశాల స్పీకర్ల సదస్సుకు హాజరైన ఆయన పాకిస్థాన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పొరుగు దేశాల్లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడేందుకు ఉగ్రవాదులకు పాక్‌ ఊతం అందిస్తోందని చెప్పారు. ఈ సమావేశానికి పాకిస్థాన్‌ డుమ్మాకొట్టిన నేపథ్యంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

‘దక్షిణాసియా దేశాలకు ఉగ్రవాదం పెనుముప్పుగా మారింది. అఫ్ఘనిస్థాన్‌ వంటి పలు దేశాలు దీని బారిన పడుతున్నాయి. పాకిస్థాన్‌ను పరిపాలిస్తున్న నాయకులంతా కూడా ఉగ్రవాదానికి బహిరంగంగా మద్దతిస్తున్నారు. వారు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అనుసరిస్తున్న విధివిధానాలు ఏవీ కూడా ఇతర దేశాల, పొరుగు దేశాల ఆందోళనలను పట్టించుకోవడం లేదు. ఇదే ఉగ్రవాదం కారణంగా పాకిస్థాన్‌ త్వరలో స్వయంగా భారీ దెబ్బతింటుంది’ అని కూడా రవూఫ్‌ హెచ్చరించారు.

Advertisement
Advertisement