తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల | Sakshi
Sakshi News home page

తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల

Published Thu, May 26 2016 11:10 AM

తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల - Sakshi

హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ ఇంజనీరింగ్ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. సచివాలయంలో డీ బ్లాక్ కాన్ఫరెన్స్ హాల్‌లో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఉదయం 11 గంటలకు  ర్యాంకులను విడుదల చేశారు. మొత్తం 77.88 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.

ఇంజనీరింగ్ లో తాళ్లూరి సాయితేజకు ఫస్ట్ ర్యాంక్ (160 మార్కులు), చేతన్ సాయి (159) రెండో ర్యాంక్,  నిఖిల్ సామ్రాట్ (158) మూడో స్థానంలో నిలిచారు. నాలుగో స్థానంలో విఘ్నేష్ రెడ్డి (158), అయిదో స్థానంలో రాహుల్ (158), ఆరో ర్యాంక్ వెంకటసాయి గణేష్ (157), ఏడో ర్యాంక్ తన్మయి (157) ఎనిమిదో ర్యాంక్ గంటా గౌతమ్ (156), 9వ ర్యాంక్ జయకృష్ణ వినయ్ (156), పదో ర్యాంక్ వంశీకృష్ణారెడ్డి (156). విద్యార్థులు తమ ర్యాంకులను www.sakshieducation.com, http://www.tseamcet.in సైట్లలో పొందవచ్చు.

ఎంసెట్‌లో సాధించిన మార్కులు, ఇంటర్ మార్కులకు ఇచ్చే 25 % వెయిటేజీ కలిపి ఇచ్చే తుది ర్యాంకుల వివరాలను వెల్లడించారు. ఈ నెల 15న జరిగిన ఎంసెట్‌లో ఇంజనీరింగ్‌కు 1,33,442 మంది, అగ్రికల్చర్ అండ్ మెడికల్ పరీక్షకు 89,792 మంది హాజరయ్యారు. కాగా జూన్ 9 లేదా 10న కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

అగ్రికల్చర్ లో
మొదటి ర్యాంక్ ప్రదీప్ రెడ్డి (160 మార్కులు)
2.ప్రత్యుష (160)
3.అర్బాస్ (160)
4.ప్రణతి (160)
5.యజ్ఞప్రియ (160)
6.అహ్మద్ జలీల్ (160)
7.ఆర్. ఉజ్వల్ (159)
8.టి.శివ  (159)
9.పి.శైలజ  (159)
10.నిధి  (159)

Advertisement
Advertisement