నిరుద్యోగుల బ్యాంక్ ఖాతాల్లోని డబ్బు కాజేసిన నిందితుడు
సిటీబ్యూరో: ఆన్‌లైన్‌లో నిరుద్యోగుల బ్యాంక్ ఖాతాల్లోని డబ్బు కాజేస్తున్న ఓ మోసగాడిని నగర సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. సీసీఎస్ డీసీపీ సి.రవివర్మ కథనం ప్రకారం... ఆటో కన్సల్టెన్సీ వ్యాపారం చేస్తున్న కర్ణాటకకు చెందిన మ్మద్ ఆసీఫ్ అలియాస్ సైఫుల్లా (23) వెబ్‌సైట్‌ను తెరిచాడు.
ఈ వెబ్‌సైట్ ద్వారా నిరుద్యోగులతో చాటింగ్ చేసేవాడు. తమ సంస్థలో రూ.2000 చెల్లించి సభ్యుడిగా చేరితే మంచి ఉద్యోగం చూపిస్తానని నమ్మించాడు. ఈ క్రమంలోనే వారి సెల్‌నెంబర్, ఏటీఎం, క్రెడిట్ కార్డు నెంబర్లను చాకచక్యంగా తెలుసుకొనేవాడు. తర్వాత వారి బ్యాంక్ ఖాతాలోని మొత్తం డబ్బును ఆన్‌లైన్‌లో తన ఖాతాలోకి బదిలీ చేసుకొని మోసగించేవాడు. ఇలా ఇతగాడు సుమారు 300 మంది నిరుద్యోగులకు చెందిన బ్యాంక్ ఖాతాలను కొల్లగొట్టాడు. ఇదే విధంగా ఇటీవల నగరానికి చెందిన ఓ యువతి బ్యాంక్ ఖాతా నుంచి లక్ష రూపాయలు స్వాహా చేశాడు. యువతి సీసీఎస్ సైబర్ క్రైమ ఏసీపీ బి.అనురాధకు ఫిర్యాదు చేయడంతో సైఫుల్లాపై కేసు నమోదు చేశారు. సోమవారం అతడ్ని అరెస్టు చేసి రూ.2 లక్షలు, ల్యాప్‌టాప్, 17 సిమ్‌కార్డులు, 3 సెల్‌ఫోన్లు, రెండు ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నారు.
‘ఆన్‌లైన్’ చీటర్ అరెస్టు
Published Tue, Feb 17 2015 12:28 AM | Last Updated on Sat, Sep 2 2017 9:26 PM
Advertisement