ప్రభుత్వ ఉద్యోగికి ఏడాది జైలు | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఉద్యోగికి ఏడాది జైలు

Published Fri, Apr 29 2016 10:47 PM

one year in prison for a Government employee

సాక్షి, సిటీబ్యూరో: మెడికల్ షాప్ లెసైన్స్ కోసం లంచం తీసుకొని పట్టుబడ్డ డ్రగ్స్ కంట్రోలర్ డెరైక్టర్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ కె.వెంకటేశ్వర్లుకు ఏసీబీ ప్రత్యేక కోర్టు ఏడాది కఠిన కారాగార శిక్ష, రూ. 2 వేల జరిమానా విధించింది. ఈ మేరకు శుక్రవారం తీర్పు వెలువరించింది.

రంగారెడ్డి జిల్లా ఏసీబీ సీఐ నాగేశ్వర్‌రావు కథనం ప్రకారం... ప్రస్తుతం ప్రకాశం జిల్లా దర్శిలో ఉంటున్న ఫిర్యాదుదారుడు పి.ఆంజనేయులు...ఆరేళ్ల క్రితం బీఎన్‌రెడ్డి నగర్‌లో మెడికల్ షాప్ ఏర్పాటు చేద్దామని లెసైన్స్ కోసం దరఖాస్తు చేశారు. లెసైన్స్ మంజూరు చేయాలంటే తనకు రూ. 4,500 లంచం ఇవ్వాలని డ్రగ్స్ కంట్రోలర్ డెరైక్టర్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ కె.వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు.

ఏసీబీ అధికారులు వలపన్ని లంచం డబ్బు తీసుకుంటున్న సీనియర్ అసిస్టెంట్ వెంకటేశ్వర్లును రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు సమర్పించిన సాక్ష్యాధారాలన్నీ రుజువు కావడంతో నిందితుడు వెంకటేశ్వర్లుకు కోర్టు ఏడాది కఠిన కారాగార శిక్ష, రూ. 2 వేల జరిమానా విధించింది.

Advertisement
Advertisement