శ్రీవారికి ప్రేమగా వంట | Sakshi
Sakshi News home page

శ్రీవారికి ప్రేమగా వంట

Published Sat, Dec 6 2014 12:16 AM

Sri those who love cooking

కథానాయికగా వెండితెరపై తళుక్కుమన్న కామ్నా జెఠ్మలాని.. ఇప్పుడు ఇల్లాలి పాత్రలో ఒదిగిపోయింది. ఎనిమిది నెలల కిందట ఏడడుగులు నడిచిన ఈ ముద్దుగుమ్మ.. కలవారి కోడలిగా కొత్త ఇన్నింగ్‌‌స మొదలెట్టింది. శుక్రవారం మాదాపూర్‌లోని వీవీనగర్‌లో జీసీ హైపర్ మార్కెట్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన కామ్నా ‘సిటీ ప్లస్’తో కాసేపు ముచ్చటించింది.
 
పుట్టింది, పెరిగింది ముంబైలోనే. అమ్మ, నాన్న, నేను తమ్ముడు, చెల్లి.. మై ఫ్యామిలీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. నాన్న ట్రాన్‌స్పోర్ట్ బిజినెస్. అమ్మ హౌస్‌వైఫ్. తమ్ముడు కూడా ఇప్పుడు బిజినెస్‌లో ఉన్నాడు. నేను మా ఇంట్లో 65 ఏళ్ల తర్వాత పుట్టిన ఆడపిల్లను. అందుకే అల్లారుముద్దుగా చూసుకుంటారు. టెక్స్‌టైల్ డిజైనింగ్ చేశాను. సినిమాల్లోకి రాకపోయి ఉంటే డిజైనర్‌గా సెటిల్ అయి ఉండేదాన్ని. ఫ్యూచర్‌లో పిల్లలకు సంబంధించిన ఒక ఇన్నోవేటివ్ ఫీల్డ్‌ను నెలకొల్పుతాను.
 
ఎప్పటికీ మరచిపోలేను


కాలేజ్ డేస్‌లో కల్చరల్ ప్రోగ్రామ్స్, ముఖ్యంగా ఫ్యాషన్ షోలో ఉత్సాహంగా పాల్గొనేదాన్ని. ఓ షో చూసిన డెరైక్టర్ హీరోయిన్‌గా అవకాశం ఇచ్చారు. సినిమాల కోసమే 9 ఏళ్ల కిందట మొదటిసారి హైదరాబాద్‌కు వచ్చా. అప్పుడు శిల్పకళావేదికలో పెర్ఫార్మెన్స్ ఇచ్చా. అప్పటికి నేనెవరో తెలియకపోయినా.. అక్కడున్నవారంతా నన్నెంతో అభినందించారు. ఆరోజు మరచిపోలేను.
 
ఏనాటి బంధమో...

నాకు హైదరాబాద్‌తో ఏదో తెలియని అనుబంధం ఉంది. సిటీలో బాగా నచ్చే ప్లేస్ గోల్కొండ ఫోర్ట్. అక్కడ షూటింగ్ కోసమని వారం రోజులు ఉన్నాను. ఎంతో ఎంజాయ్ చేశాను. ఈ తొమ్మిదేళ్లలో హైదరాబాద్ ఎంతో మారిపోయింది. నేను ఫస్ట్‌టైం సిటీకి వచ్చినప్పుడు బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌లో దిగాను. ఇప్పుడు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ సూపర్బ్. అక్కడ రోడ్లు, చెట్లు, వ్యూ.. కొత్తగా అనిపిస్తాయి. బంజారాహిల్స్ చట్నీస్ రెస్టారెంట్‌లో సెట్ దోశ భలే ఇష్టం.   
 
కొత్తగా.. హ్యాపీగా...

ఎనిమిది నెలల కిందట పెళ్లయింది. పక్కా అరేంజ్డ్ మ్యారేజ్. మా అత్తగారిల్లు బెంగళూరు. అక్కడే ఉంటున్నా. మా ఆయన సూరజ్. మెకానికల్ ఇంజనీర్. ఆయనకు స్పేర్ పార్ట్స్ ఇండస్ట్రీ ఉంది. షూటింగ్‌లకు ప్యాకప్ చెప్పినా నో ప్రాబ్లమ్. నా లైఫ్ ఫుల్ సెక్యూర్డ్. మా శ్రీవారి హైట్ 6.2 అడుగులు.. ఆయన పక్కన నిల్చుంటే క్రేజీగా అనిపిస్తుంది. నా వంటల ఎక్స్‌పరిమెంట్స్ అంటే ఆయనకు ఇష్టం. మా అమ్మకు ఫోన్ చేసి మరీ ప్రేమగా వండి పెడుతుంటాను. నేను ప్రాపర్ హోమ్ మేకర్‌నని అనుకుంటున్నాను. కుకింగ్, నా భర్తను, అత్తయ్యను చూసుకోవడం ఇవన్నీ కొత్తగా ఉన్నా హ్యాపీగానే ఉంది.

- శిరీష చల్లపల్లి

Advertisement
 
Advertisement
 
Advertisement