ఉండీలేనట్లు! | Sakshi
Sakshi News home page

ఉండీలేనట్లు!

Published Wed, Dec 17 2014 10:30 PM

ఉండీలేనట్లు!

స్త్రీ హృదయానికి చేరువవ్వాలంటే విలక్షణమైన గుణమేదో కలిగి ఉండాలి. అందుకే ఆస్ట్రేలియా పరిశోధకులు స్త్రీల ఛాతీ కదలికలకు అనుగుణంగా అప్పటికప్పుడు తనను తను మలుచుకునే ‘బయోనిక్ బ్రా’ను రూపొందించారు! బిగుతుగా అనిపించినప్పుడు కాస్త వదులవడం, వదులైన ట్లుగా ఉంటే బిగుతవడం, మొత్తం మీద ఛాతీని సౌకర్యవంతంగా పట్టి ఉంచడం ఈ బ్రా ప్రత్యేకత. దీనిని కనిపెట్టడం కోసం శాస్త్రవేత్తల బృందం పదిహేనేళ్ల పాటు శ్రమించారట.

బయోనిక్ బ్రా తయారీలో మృదువైన కృత్రిమ దారపు (బయోనిక్) పోగులను ఉపయోగించడం జరుగుతుంది కనుక అచ్చంగా ఇది దేహ కండరంలా పనిచేస్తుంది. త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా మార్కెట్‌లోకి రాబోతున్న ఈ కొత్త ఉత్పత్తి ఎప్పుడూ ఉరుకులు పరుగుల మీద ఉండే ఉద్యోగినుల కదలికల్లోని ఇబ్బందులను తొలగిస్తుందని అంటున్నారు.
 
 

Advertisement
Advertisement