ప్రజాసేవ నా ఆశయం | Sakshi
Sakshi News home page

ప్రజాసేవ నా ఆశయం

Published Fri, Apr 25 2014 12:04 AM

ప్రజాసేవ నా ఆశయం

 సాక్షి ప్రతినిధి, ఏలూరు :పేరెన్నిగకన్న పరిశ్రమలకు అధిపతి అయినా.. దేశవిదేశాలను చుట్టి అపార అనుభవం గడించినా.. ఆయనలో కించిత్ గర్వం కనపడదు. తండ్రి నుంచి అబ్బిన నిరాడంబరత.. ప్రజలకు సేవ చేయాలనే సంకల్పం వంక రవీంద్రనాథ్‌ను రాజకీయాల వైపు నడిపించింది. కమ్యూనిస్టు కుటుంబంలో పుట్టి స్వశక్తితో వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించిన ఆయన తన సంస్థల్లో పనిచేసే వారి సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు. ఇలాంటి సంక్షేమాన్ని సమాజం అంతటిలోనూ చూడాలనేదే ఆయన లక్ష్యం. అందుకు స్ఫూర్తి ఆయన తండ్రి వంక సత్యనారాయణని చెబుతున్న వంక రవీంద్రనాథ్ తండ్రి చూపిన బాటలోనే రాజకీయ రంగంలోకి అడుగుపెట్టారు. అందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వేదికగా చేసుకున్నారు. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున నరసాపురం ఎంపీ అభ్యర్థిగా రంగంలోకి దిగిన రవీంద్ర ఎన్నో ఏళ్లుగా నరసాపురం ప్రాంతం నిర్లక్ష్యానికి గురైందని చెబుతున్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ఈ ప్రాంత రూపురేఖలు మార్చి ప్రజలకు మెరుగైన జీవి తాన్ని అందించడమే తన లక్ష్యమని స్పష్టం చేస్తున్నారు. రవీంద్రనాథ్‌ను ‘సాక్షి’ ఇంటర్వ్యూ చేసింది. ఆ వివరాలివీ...
 
 మీ కుటుంబ నేపథ్యం 
 నా తండ్రి వంక సత్యనారాయణ. పరిచయం అక్కర్లేని ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడాయన. పెనుగొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యూ రు. తణుకు ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి, ఇక్కడి పరిశ్రమల్లోని కార్మికులకు మెరుగైన జీవనం కల్పించడానికి ఆయన ఎన్నో పోరాటాలు చేశారు. నిస్వార్థ రాజకీయాలకు పెట్టింది పేరైన ఆయనే నాకు ఆదర్శం. నా చిన్నప్పుడు హైదరాబాద్‌లో ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఉండేవాళ్లం. మిగతా ఎమ్మెల్యేల పిల్లలు దర్జాగా తిరుగుతుంటే నేను మాత్రం సాదాసీదాగా ఉండేవాడిని. అందుకు కారణమైన నా తల్లిదండ్రులపై అప్పుడు కోపం ఉండేది. వాళ్లలా మనం ఎందుకు ఉండకూడదని అడిగితే మా నాన్న నిజాయితీ, నిస్వార్థం గురించి వివరించేవారు. అప్పట్లో ఆ మాటలు అర్థం కాకపోయినా ఆ తర్వాత ఆయన గొప్పతనం తెలిసింది. విద్యార్థి దశలో ఏఐఎస్‌ఎఫ్‌లో పనిచేశాను. అప్పట్లోనే విద్యార్థులకు వైట్‌పేపర్లు తక్కువ ధరకే ఇవ్వాలని పాఠశాలలో ఆందోళన చేశాను. 
 
  నియోజకవర్గం అభివృద్ధిపై మీ విజన్ ఏమిటి
 నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గంలో చాలాకాలంగా అపరిష్కృతంగా ఎన్నో పనులున్నారుు. విజయవాడ నుంచి నరసాపురం, నిడదవోలు, తణుకు, భీమవరం రైల్వేలైను డబ్లింగ్ చేయటంతోపాటు విద్యుదీకరణ చేయాల్సి ఉంది. సింగిల్ లైనుగా ఉండటం వల్ల ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక రెండో ప్రాధాన్యత డెల్టా ఆధునికీకరణ పనులు పూర్తిచేయడం. వైఎస్ హయాంలో ప్రారంభించిన డెల్టా ఆధునికీకరణ పనులు పూర్తికాకపోవటంతో ఆ ఫలాలు రైతులకు అందకుండాపోతున్నాయి. గోదావరి ఏటిగట్లను పటిష్టం చేసి రైతులు, ప్రజలకు మేలు చేయాల్సి ఉంది. టూరిజం అభివృద్ధికి ఇక్కడ అవకాశాలున్నాయి. పేరుపాలెం బీచ్‌ను విస్తరించాలి. పెట్టుబడులు పెట్టేందుకు పలు దేశాలు ఆసక్తిగా ఉ న్నాయి. అందుకు అనువైన వాతావరణాన్ని కల్పించాలి. జిల్లాలో ఇండస్ట్రియల్ పార్కు నెల కొల్పి భారీస్థాయిలో పరిశ్రమలను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. తద్వారా భారీగా ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తారుు. ముఖ్యంగా కొబ్బరి ఆధారిత పరిశ్రమ లు స్థాపించాలి. పరిశ్రమల ఏర్పాటులో విద్యు త్ కీలకంగా మారుతుంది. దీనికోసం విద్యుత్ ప్లాంటును కూడా జిల్లాకు తీసుకువచ్చి విద్యుత్ కొరత లేకుండా చేయాల్సి ఉంది. మత్స్యకార కుటుంబాల జీవనస్థితిగతులను మార్చాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను సక్రమంగా వినియోగించుకునేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలి. గత 13వ ఆర్థిక సం ఘం కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కారు వల్ల రూ.13 వేల కోట్ల నిధులను నష్టపోయాం. రాష్ట్ర ప్రభు త్వ వాటా 20శాతం పెట్టుబడి పెడితే కేంద్రనిధులు 80శాతం వస్తాయి. వాటిని రాబ ట్టేందుకు వ్యూహాత్మకంగా పనిచేయాలి. పోల వరం ప్రాజెక్టు నిర్మాణం కూడా చాలా ప్రాముఖ్యమైంది.  వ్యాపారవేత్తగా ఆఫ్రికా, ఆసియా, ఆస్ట్రేలియా ఖండాల్లోని దేశాల్లో పర్యటించాను. అక్కడి జీవన పరిస్థితులు, పరిశ్రమల అభివృద్ధిపైనా అధ్యయనం చేశాను. ఆ అనుభవం నరసాపురాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది. 
 
  ప్రజల్లోకి ఎలా వెళుతున్నారు
 టీడీపీ, బీజేపీ మేనిఫెస్టో చూడండి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను చూడండి. గెలవాలనే తాపత్రయంతో టీడీపీ, బీజేపీ ఆచరణ సాధ్యంకాని హామీలు గుప్పిస్తే.. వైఎస్ జగన్ మాత్రం పేదల బతుకులు మార్చేందుకు భరో సా ఇస్తున్నారు. మా మేనిఫెస్టో పూర్తిగా పేద, మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా బలోపే తం ఆయ్యేందుకు నిర్ణయించిందే. బాలికల విద్యనుంచి పేద విద్యార్థుల ఉన్నత చదువులకు, డ్వాక్రా మహిళల ఆర్థిక పరిపుష్టికి, రైతుల కష్టాలను కడతేర్చేందుకు, వృద్ధులు, వికలాం గులు, నిరుద్యోగులు ఇలా అన్నివర్గాల ప్రజల కూ మేలు చేసే మేనిఫెస్టో అది. జగన్ పెట్టే ఐదు సంతకాలే రేపు రాష్ట్ర భవిష్యత్‌ను మార్చబోతున్నాయి. వీటినే ప్రచారం చేస్తూ ముందుకెళుతున్నాను. ప్రతిచోట ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తోంది. జగన్ టీమ్‌లో ఉన్నందుకు ఎంతో ఆనందపడుతున్నా. నేను గెలవడం ఖాయం. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం తథ్యం. 
 
  రాజకీయాల్లోకి రావటానికి ప్రధాన కారణం
 ప్రజలకు మంచిచేసే అవకాశాలు చాలానే ఉన్నాయి. ప్రభుత్వం నుంచి అందాల్సిన అనేక పథకాలు, సౌకర్యాలు సక్రమంగా వారికి చేరితే చాలావరకు సక్సెస్ అయినట్లే. నా తండ్రి వంక సత్యనారాయణను ఆదర్శంగా తీసుకుని రాజకీయాల్లోకి వచ్చాను. మచ్చలేని విధంగా పేదలకు సేవ ఎలాచేయవచ్చో ఆయన ద్వారా చిన్ననాటినుంచే నేర్చుకున్నాను. నా భార్య తణుకు మునిసిపల్ ఛైర్మన్‌గా పనిచేశారు. అవినీతికి ఆస్కారం లేకుండా తణుకును అభివృద్ధి చేశాం. అదేవిధంగా నరసాపురం ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నా. నీతిగా పనిచేస్తే వేలాదిమంది ప్రజలకు ఎంతో మేలు చేసే అవకాశం ఉంది. 
 
 వెఎస్సార్ సీపీలో చేరటానికి
 కారణం
 నన్ను టీడీపీలోకి రమ్మని ఆహ్వానాలు అందాయి. కానీ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌లోని నాయకత్వ లక్షణాలు, ప్రజలకు మంచి చేయాలనే ఆయన దృఢసంకల్పం నన్ను ఆకర్షించాయి. వైఎస్ జగన్‌తో కొద్దిసేపు మాట్లాడాను. ఆయన విజన్ ఉన్న నాయకునిగా కనిపించారు. విభజన కారణంగా నష్టపోతున్న సీమాంధ్రను అభివృద్ధి పథంలో నడిపించేందుకు వైఎస్ జగన్ పడుతున్న తాపత్రయం నాకు నచ్చింది. ఆయన్ని కల వడానికి వెళ్లేముందు భయపడ్డాను. ఆయన పెద్దలను గౌరవించరని, ఇబ్బందికరంగా మాట్లాడతారని టీవీల్లో ఇంటర్య్వూ లు చూసి ఆ అభిప్రాయానికి వచ్చాను.ఆయన్ని కలిసిన తర్వాత నా అభిప్రాయం పూర్తిగా మారింది. ఆయన్ను తొలిసారి కలి సిన క్షణం నాకు మాట రాలేదు. రవీంద్రన్నా అని ఎంతో అప్యాయంగా మాట్లాడారు. ఆ క్షణం నుంచి వైఎస్ జగన్ కోసం పనిచేయాలని నిర్ణయించుకున్నా. నాకు ఎంపీ సీటు ఇవ్వకపోయినా ఆయన వెంటే ఉండేవాడిని. ఎన్ని కష్టాలు, నష్టా లు, ఆటంకాలు ఎదురైనా వెనుదిరగని ఆయన తత్వం నాలో విశ్వాసాన్ని మరింత పెంచింది. చంద్రబాబునాయుడుకు, జగన్‌కు మధ్య చాలా వ్యత్యాసం ఉంది. నా తండ్రి కల సాకారం కావాలంటే జగన్‌తోనే సాధ్యమని పూర్తిగా నమ్మాను. 
 

Advertisement
Advertisement