జాతీయాదాయం అసమానతలు.. భారత స్థూల ఆర్థిక దృక్పథం | Sakshi
Sakshi News home page

జాతీయాదాయం అసమానతలు.. భారత స్థూల ఆర్థిక దృక్పథం

Published Thu, Feb 5 2015 8:55 AM

జాతీయాదాయం అసమానతలు.. భారత స్థూల ఆర్థిక దృక్పథం

ఒక దేశ ఆర్థిక ప్రగతిని కొలిచే సూచికలలో జాతీయాదాయం ప్రధానమైంది. నిర్ణీత కాలంలో దేశంలోని ప్రజల కోరికలను సంతృప్తి పరిచే ఆర్థిక వ్యవస్థ ఉత్పాదక శక్తి ద్వారా ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల మొత్తం ఉత్పత్తి విలువను జాతీయాదాయం అంటారు.
 
నిర్ణీత కాలంలో ఒక వస్తువుకు రెండు సార్లు విలువ కట్టకుండా తయారైన అన్ని వస్తు సేవల విలువను అంచనా వేస్తే అది జాతీయాదాయం అవుతుందని భారత జాతీయాదాయ కమిటీ నిర్వచించింది. 1991 తర్వాత భారత్‌లో జాతీయాదాయ వృద్ధి రేటు సంతృప్తికరంగా ఉన్నప్పటికీ.. చైనా, దక్షిణ కొరియా వంటి దేశాలతో పోల్చితే తక్కువ వృద్ధి నమోదైంది. భారత్‌లో 1970కి ముందు నికర దేశీయోత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా సుమారు 50 శాతం. కాగా ప్రస్తుతం 13 శాతం లోపు ఉంది. ప్రణాళికా యుగంలో ప్రభుత్వ చర్యల కారణంగా పారిశ్రామిక రంగంలో నిర్మాణాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. గత ఆరు ద శాబ్దాలలో ఆధునిక పరిశ్రమల ఏర్పాటుతో అసంఘటిత రంగంలో చిన్న తరహా పరిశ్రమల ప్రాధాన్యత తగ్గింది. అంతేకాకుండా నికర దేశీయోత్పత్తిలో రవాణా, సమాచారం, శక్తి, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ రంగాల వాటా పెరిగింది. దీన్ని బట్టి దేశంలో ఆర్థిక అవస్థాపన మెరుగైందని భావించవచ్చు.
 
 నూతన ఆధార సంవత్సరం
 స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ
 (The Ministry of Statistics and Programme Implementation) ఆధార సంవత్సరాన్ని 2004-05 నుంచి 2011-12కు మారుస్తూ జాతీయ అకౌంట్స్ గణాంకాలకు సంబంధించి నూతన సిరీస్‌ను విడుదల చేసింది. జాతీయ అకౌంట్స్ గణనకు 2010, జనవరిని ఆధార సంవత్సరంగా నిర్ణయించింది. నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ సిఫార్సుల మేరకు జాతీయ అకౌంట్స్ గణాంకాల కోసం ఆధార సంవత్సరాన్ని ప్రతి ఐదేళ్లకోసారి సవరిస్తారు. సవరించిన ఆధార సంవత్సరం వద్ద ఆర్థిక సూచీలను లెక్కిస్తారు. 2012 ఆధార సంవత్సరంగా (ఆ్చట్ఛ ్గ్ఛ్చట) 2015, జనవరికి సంబంధించి వినియోగదారుని ధరల సూచీ (ఇ్కఐఇౌటఠఝ్ఛట ్కటజీఛ్ఛి ఐఛ్ఛ్ఠీ)ని ఫిబ్రవరిలో కేంద్ర గణాంక సంస్థ విడుదల చేస్తుంది.
 
 ఆర్థిక వృద్ధికి కొలమానంగా
 దేశ ఆర్థిక వృద్ధికి కొలమానంగా ఇప్పటి వరకు లెక్కిస్తున్న జీడీపీ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ (ఎఈ్క ్చ్ట జ్చఛిౌ్టట ఛిౌట్ట) స్థానంలో ఆధార సంవత్సరం ప్రాతిపదికన స్థూలంగా కలిపిన విలువ ద్వారా ఆర్థిక వృద్ధిని లెక్కించాలని కేంద్ర గణాంక సంస్థ నిర్ణయించింది. 2011-12 ఆధార సంవత్సరంగా నూతన కొలమానంతో 2011-12 నుంచి 2013-14 వరకు లెక్కించిన జాతీయ, తలసరి ఆదాయ గణాంకాలను ఈ ఏడాది జనవరి 30న కేంద్ర గణాంక సంస్థ ప్రకటించింది. ఈ నూతన కొలమానాన్ని 2008లో యునెటైడ్ నేషన్స్ సిస్టమ్ ఆఫ్ నేషనల్ అకౌంట్స్ (ఖీజ్ఛి ్ఖజ్ట్ఛీఛీ ూ్చ్టజీౌట డట్ట్ఛఝ ౌజ ూ్చ్టజీౌ్చ అఛిఛిౌఠ్టట) సిఫార్సు చేసింది. అభివృద్ధి చెందిన దేశాలతో భారత జీడీపీని లెక్కించడానికి ఈ కొలమానం ఉపయోగకరంగా ఉంటుంది.
 
 నికర ఉత్పత్తి పన్నులు, సబ్సిడీలను జీవీఏ (ఎటౌటట గ్చఠ్ఛ  అఛీఛ్ఛీఛీ  ఎగఅ) కి కలిపితే ఆధార సంవత్సర ధరల వద్ద జీడీపీ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్‌ను లెక్కించవచ్చు. భారత్‌లో స్టాంప్ డ్యూటీలు, ప్రాపర్టీ ట్యాక్స్‌లు ఉత్పత్తి పన్నులో భాగంగా ఉంటాయి. ఉత్పత్తి సబ్సిడీలలో అప్రెంటైస్ సబ్సిడీలు, వడ్డీ సబ్సిడీలు భాగం. స్థిర ధరల వద్ద (2004-05) 2011-12లో 6.7 శాతం, 2012-13లో 4.5 శాతం, 2013-14లో 4.7 శాతం వృద్ధి రేటు నమోదైంది. ఆధార సంవత్సరాన్ని 2011-12గా సవరించడంతో జీడీపీ వృద్ధి రేటులో పెరుగుదల సాధ్యమైంది. సవరించిన ఆధార సంవత్సర ధరల వద్ద జీడీపీ వృద్ధి రేటు 2012-13లో 5.1 శాతం, 2013-14లో 6.9 శాతంగా నమోదైంది.
 
 ఐఎంఎఫ్ అంచనాలు
 గత 15 ఏళ్లలో భారత బిలియనీర్ల నికర విలువ (ూ్ఛ్ట గిట్టౌజి) 12 రెట్లు పెరిగినట్లు అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనా వేసింది. పెరిగిన ఈ విలువ ద్వారా భారత్‌లోని నిరపేక్ష పేదరికాన్ని తొలగించవచ్చని ఐఎంఎఫ్ అభిప్రాయపడింది. ఈ స్థితి పెరుగుతున్న ఆదాయ అసమానతలను సూచిస్తుంది. ప్రపంచంలోని 85 మంది ధనికుల సంపద.. ప్రపంచంలోని చివరి 15 శాతం ప్రజల సంపదకు సమానమని ఐఎంఎఫ్ మేనేజింగ్ డెరైక్టర్ క్రిస్టినా లాగార్డ్ పేర్కొన్నారు. వచ్చే 30 ఏళ్లలో ప్రపంచ జనాభాకు మరో 2 బిలియన్ల మంది తోడవుతారని, 2020 నాటికి ఐదేళ్లలోపు పిల్లల కంటే 65 ఏళ్లకు పైబడిన వారి సంఖ్య అధికంగా ఉండొచ్చని ఐఎంఎఫ్ అంచనా వేసింది.
 
 ఆఫ్రికా, దక్షిణాసియా ప్రాంతాల్లో యువ జనాభా పెరుగుదల అధికంగా యూరోప్, చైనాలో తక్కువగా ఉంటుంది . రాబోయే దశాబ్దంలో జనాభా పరంగా భారత్ చైనాను, నైజీరియా అమెరికాను అధిగమిస్తాయి. యువ జనాభా అధికంగా ఉన్న ప్రాంతాల్లో నవ కల్పనలు, చైతన్యం, సృజనాత్మకతకు తగిన వాతావరణం ఏర్పడుతుంది. ఈ క్రమంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఉపాధి అవకాశాలను కల్పిస్తేనే ఆర్థిక వ్యవస్థలో వృద్ధి సాధ్యమవుతుంది. ఇందుకు విద్య ప్రమాణాల మెరుగుదల, సాంకేతిక ప్రగతి తప్పనిసరి. ఆర్థిక వృద్ధి సాధనకు అధిక ప్రాధాన్యమిస్తూ వృద్ధి పంపిణీని విస్మరించడంతో అసమానతలు పెరిగాయి. ఆదాయ అసమానతలు పెరిగే క్రమంలో సమాజంలో కొన్ని వర్గాల ప్రజలు నిర్లక్ష్యానికి గురవుతారు.
 
 భారత స్థూల ఆర్థిక దృక్పథం 2020
 పెరుగుతున్న ఆదాయ స్థాయి, పని చేసే వారిలో యువ జనాభా అధికంగా ఉండే పరిస్థితుల్లో 2020 నాటికి అంతిమ ప్రైవేట్ వినియోగ వ్యయంలో అధిక వృద్ధి నమోదు కాగలదు. 2011, ఫిబ్రవరి నుంచి 2020, ఫిబ్రవరి మధ్య ప్రైవేట్ వినియోగ వ్యయంలో వృద్ధి సగటు 9.1 శాతం ఉండగలదని అమెరికాకు చెందిన డెన్ అండ్ బ్రాడ్ స్ట్రీట్ అనే సంస్థ అంచనా వేసింది. 2010, ఫిబ్రవరితో పోల్చితే 2020 ఫిబ్రవరిలో జీడీపీలో వినియోగ వ్యయంలో స్వదేశీ పెట్టుబడి కార్యకలాపాలు పెరిగే నేపథ్యంలో వినియోగంలో తగ్గుదల ఏర్పడుతుంది. 2020 నాటికి మొత్తం ప్రైవేట్ వినియోగ వ్యయంలో ఆహారం, బెవరేజెస్, పొగాకు, వస్త్రాలు, ఫుట్‌వేర్‌పై తగ్గుదల కనిపిస్తుంది. మరో వైపు అద్దె, ఇంధనం, విద్యుత్, ఫర్నీచర్, మెడికల్ కేర్, విద్య, రిక్రియేషన్, రవాణా, సమాచారంపై వ్యయం పెరుగుతుంది. ఐఎంఎఫ్ అంచనాల ప్రకారం 2015-16లో 6.3 శాతం, 2016-17లో 6.5 శాతం వృద్ధిని సాధిస్తే వాస్తవిక తలసరి ఆదాయంలో పెరుగుదల సాధ్యమవుతుంది. తద్వారా దారిద్య్ర రేఖకు దిగువన నివసించే ప్రజల శాతం తగ్గుతుంది.
 
 ఆదాయ స్థాయిలో పెరుగుదల కారణంగా 2020 నాటికి భారత్ అల్పాదాయ దేశాల స్థాయి నుంచి మిడిల్ ఇన్‌కమ్ లేదా అప్పర్ మిడిల్ ఇన్‌కమ్ దేశాల స్థాయికి చేరుకోగలదు. రాబోయే కాలంలో జీడీపీలో అధిక వృద్ధిని సాధించాలంటే ప్రైవేట్ వ్యయ డిమాండ్‌లో పెరుగుదలతోపాటు అవస్థాపన రంగంపై పెట్టుబడులు అధికమవ్వాలి, సేవా రంగంలో వృద్ధి సాధించాలి. 12వ పంచ వర్ష ప్రణాళికలో అవస్థాపన రంగంపై పెట్టుబడులను జీడీపీలో 9 శాతం లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఈ నేపథ్యంలో 2020 నాటికి పెట్టుబడులను ఆకర్షించే అభిలషణీయ ఆర్థిక విధానాలు అవసరం. పెరుగుతున్న పారిశ్రామికీకరణ, పట్టణీకరణ వల్ల నికర సాగు విస్తీర్ణం తగ్గుతుంది. నీటిపారుదల సౌకర్యాలు, గిడ్డంగులు, కోల్డ్‌స్టోరేజ్‌లు వంటి మౌలిక వసతులపై ప్రభుత్వ పెట్టుబడులు పెరిగితేనే 2020 నాటికి వ్యవసాయ రంగంలో వృద్ధి రేటు 4 శాతానికి పైగా ఉండగలదు. పారిశ్రామిక రంగంలో వృద్ధి సాధనకు ప్రైవేట్ వినియోగ డిమాండ్, ఎగుమతుల్లో పెరుగుదల అవసరం. అంతేకాకుండా స్వదేశీ పెట్టుబడుల వృద్ధి, అవస్థాపన సౌకర్యాల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించాలి.
 
 ఆదాయం పెరిగే సూచనలు
 పెరుగుతున్న ఆదాయ స్థాయి, మధ్య తరగతిలో పని చేసే జనాభా పెరుగుదల కారణంగా అనశ్వర వినియోగ వస్తువులకు డిమాండ్ అధికంగా ఉండగలదు. 2011, ఫిబ్రవరి నుంచి 2020, ఫిబ్రవరి మధ్య సేవా రంగం వృద్ధి సగటు 10.1 శాతంగా ఉండగలదని డీ అండ్ బీ అంచనా వేసింది. ఈ రంగంలో అధిక వృద్ధి సాధనకు హోటళ్లు, రవాణా, కమ్యూనికేషన్, ఫైనాన్షియల్ సర్వీసులు ఎక్కువ దోహదం చేస్తాయి. ఈ క్రమంలో 2020 నాటికి జాతీయాదాయంలో వివిధ రంగాల వాటాలో మార్పులు సంభవిస్తాయి. 2013-14లో జాతీయాదాయంలో వ్యవసాయం, అనుబంధ కార్యకలపాల వాటా 13.9 శాతం, కాగా ఇది 2019-20లో 9 శాతానికి తగ్గే అవకాశం ఉంది. ఇదే సమయంలో పారిశ్రామిక రంగం వాటా 26.2 శాతం.

ఇది 2019-20లో సుమారు 20 శాతానికి చేరుకుంటుందని అంచనా. ఇదేకాలంలో సేవా రంగం వాటా 59.9 శాతం నుంచి సుమారు 62 శాతానికి పెరుగుతుంది. ఈ స్థితి భారత ఆర్థిక వ్యవస్థలో చోటు చేసుకుంటున్న నిర్మాణాత్మక మార్పులను సూచిస్తుంది. అవస్థాపన రంగం అభివృద్ధి దిశగా ప్రభుత్వ చర్యలు, ప్రైవేట్ పెట్టుబడుల కారణంగా 2010, ఫిబ్రవరిలో జీడీపీలో స్థూల దేశీయ మూల ధన కల్పన 36.5 శాతం. కాగా ఇది 2020, ఫిబ్రవరి నాటికి 41.5 శాతానికి చేరుకోగలదని అంచనా. స్వదేశీ పొదుపు రేటులో పెరుగుదల కారణంగా పెట్టుబడి రేటులో వృద్ధి సాధ్యమవుతుంది.
 
 ఫలితంగా బహిర్గత విత్తంపై ప్రభుత్వం ఆధారపడటం తగ్గుతుంది. 2010, ఫిబ్రవరిలో జీడీపీలో స్థూల పొదుపు 33.7 శాతం. కాగా, 2020, ఫిబ్రవరి నాటికి స్థూల పొదుపు రేటు 38.8 శాతంగా ఉండగలదు. పెరుగుతున్న ఆదాయాల కారణంగా స్వదేశీ పొదుపులో పెరుగుదల ఏర్పడుతుంది. 2021 నాటికి మొత్తం జనాభాలో 15 ఏళ్లలోపు జనాభా 25.1 శాతానికి తగ్గుతుంది. 60 సంవత్సరాలు పైబడిన జనాభాలో పెరుగుదల ఉంటుంది. మొత్తం జనాభాలో 2021 నాటికి 15-59 వయోవర్గం 64.2 శాతానికి పెరుగుతుందని అంచనా. పని చేసే జనాభా పెరుగుదల, ఆధారపడే జనాభా తగ్గుదల, ఆర్థిక వ్యవస్థ అధిక వృద్ధి సాధించే సూచనలతో శ్రామిక లభ్యత పెరిగి ఉత్పాదక కార్యకలాపాలు మెరుగవుతాయి. ఈ క్రమంలో ఆదాయం పెరిగే సూచనలు ఎక్కవగా ఉన్నాయి.
 
ముఖ్యాంశాలు
 స్థిర ధరల (2011-12) వద్ద.. 2011-12లో జీవీఏ 81.9 లక్షల కోట్లు, 2012-13లో 85.9 లక్షల కోట్లు, 2013-14లో 91.6 లక్షల కోట్లు.
 స్థిర ధరల (2011-12) వద్ద.. జీడీపీ 2011-12లో 88.3 లక్షల కోట్లుగా, 2012-13లో 92.8 లక్షల కోట్లు, 2013-14లో 99.2 లక్షల కోట్లు.
 స్థిర ధరల (2011-12) వద్ద.. 2012-13లో ప్రైవేట్ అంతిమ వినియోగ వ్యయంలో 5.5 శాతం, 2013-14లో 6.2 శాతం వృద్ధి ఏర్పడింది.
 ఆధార సంవత్సరం (2011-12) మార్పు ప్రాతిపదికన ప్రస్తుత ధరల వద్ద తలసరి ఆదాయం 2011-12లో రూ. 64,316, 2012-13లో రూ. 71,593, 2013-14లో రూ.80,388గా నమోదైంది.
 స్థూల దేశీయ పొదుపులో కుటుంబ రంగ వాటా ఎక్కువ. ఈ రంగం వాటా 2011-12లో 67.3 శాతం నుంచి 2012-13లో 63.4 శాతానికి తగ్గిం ది. 2013-14లో 59.4 శాతంగా నమోదైంది.
 స్థిర ధరల (2011-12) వద్ద.. స్థూల మూలధన కల్పన రేటు 2012-13లో 37.2 శాతం కాగా, 2013-14లో 33.4 శాతానికి తగ్గింది.
 స్థిర ధరల 2011-12) వద్ద.. ప్రైవేట్ అంతిమ వినియోగ వ్యయం 2012-13లో రూ. 53.7 లక్షల కోట్లు, 2013-14లో రూ.57 లక్షల కోట్లు.
 ప్రస్తుత ధరల వద్ద స్థూల జాతీయ వ్యయార్హ ఆదాయం 2011-12లో రూ. 90.6 లక్షల కోట్లు, 2013-14లో రూ. 116 లక్షల కోట్లకు పెరిగింది.
- డా॥తమ్మా కోటిరెడ్డి,
 ప్రొఫెసర్, ఐబీఎస్ హైదరాబాద్.

Advertisement
Advertisement