రాష్ట్రంలో తుగ్లక్‌పాలన సాగుతోంది | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో తుగ్లక్‌పాలన సాగుతోంది

Published Sun, Oct 23 2016 10:54 PM

రాష్ట్రంలో తుగ్లక్‌పాలన సాగుతోంది - Sakshi

 –  ఎమ్మెల్యే రవీంద్రనాద్‌రెడ్డి
కడప ఎడ్యుకేషన్‌:  రాష్ట్రంలో ప్రస్తుతం తుగ్లక్‌ పాలన సాగుతోంది. ప్రజలతో పాటు ఉద్యోగ ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని త్వరలో మంచి రోజులు వస్తాయని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాద్‌రెడ్డి పేర్కొన్నారు. కడప నగరం డీసీఈబీలో ఆదివారం వైఎస్సార్‌టీఎఫ్‌ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఏడాది ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందుకున్న పలువురు ఎంఈఓలతోపాటు ఉపాధ్యాయులకు వైఎస్సార్‌టీఎఫ్‌ ఆధ్వర్యంలో సన్మానించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే రవీంధ్రనాద్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి, పట్టభద్రుల ఎమ్మెల్సీ గోపాల్‌రెడ్డి కుమారుడు అనంతపురం జిల్లా రాప్తాడు జెడ్పీటీసీ రవీంద్రనాద్‌రెడ్డిలు ముఖ్య అథితులుగా హాజరయ్యారు. సమావేశానికి వైఎస్సార్‌టీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు వెంకటరమణారెడ్డి అధ్యక్షత వహించారు. ఎమ్మెల్యే రవీంద్రనాద్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలకు మౌలిక సదుపాయాలను కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. త్వరలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టుభద్రుల స్థానానికి వెన్నపూస గోపాల్‌రెడ్డికి , ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి పొచంరెడ్డికి మద్దతను ప్రకటించాలని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్సీ పొచంరెడ్డి సుబ్బారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో పూర్తిగా విఫలమైయ్యారన్నారు. అనంతపురం జిల్లా రాప్తాడు జెడ్పీటీసీ సభ్యుడు రవీంద్రారెడ్డి, ఏపీటీఎఫ్‌ గౌరవాధ్యక్షుడు చెంచిరెడ్డి , వైఎస్సార్‌టీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి రెడ్డెప్పరెడ్డి ప్రసంగించారు.   ఈ సందర్భంగా  ముగ్గురు ఎంఈఓలు, ఇద్దరు ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎంలకు, ఐదుగురు ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌టీఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శివశంకర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు రెడ్డెప్పరెడ్డి, దివాకర్, జిల్లా అధ్యక్షుడు రమణారెడ్డి, ఉపాధ్యక్షుడు రమేష్, జిల్లాబాధ్యులు అమర్‌నాద్‌రెడ్డి, గంగిరెడ్డి, శివారెడ్డి, నరేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు

Advertisement

తప్పక చదవండి

Advertisement