లాసెట్ దరఖాస్తుకు రేపటితో గడువు పూర్తి | Sakshi
Sakshi News home page

లాసెట్ దరఖాస్తుకు రేపటితో గడువు పూర్తి

Published Fri, Apr 29 2016 6:51 PM

Law-cet application due to expire tomorrow

ఏపీలో మే 28న జరిగే లాసెట్ - 2016 పరీక్షకు అపరాధ రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 30వ తేదీతో గడువు ముగుస్తున్నట్టు లాసెట్ కన్వీనర్, ప్రొఫెసర్ పుల్లారెడ్డి తెలిపారు. రూ.500 అపరాధ రుసుముతో మే 7వరకు, రూ.1,000 అపరాధ రుసుముతో మే 15 వరకు, రూ.1,500 అపరాధ రుసుముతో మే 21 వరకు, రూ.5వేల రూపాయల అపరాధ రుసుముతో మే 27వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన సూచించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. మే 22 తర్వాత దరఖాస్తు చేసుకున్న వారు అనంతపురంలోని పరీక్షా కేంద్రంలో పరీక్ష రాయాల్సి ఉంటుందని సూచించారు.

Advertisement
Advertisement