మాంసం కోసం ఘర్షణ: 17 మందికి గాయాలు | Sakshi
Sakshi News home page

మాంసం కోసం ఘర్షణ: 17 మందికి గాయాలు

Published Sun, Aug 2 2015 9:13 PM

మాంసం కోసం ఘర్షణ: 17 మందికి గాయాలు

రుద్రవరం: వర్గవిభేదాలో.. పాత కక్షలతోనో ఘర్షణ జరుగుతుంది. కానీ ఇక్కడ జరిగింది మాత్రం మాంసం కోసం. అది కూడా కత్తులతోనే మొదలైంది. ఈ ఘర్షణలో దాదాపు 17 మంది గాయపడ్డారు. వివరాలు.. కర్నూలు జిల్లా రుద్రవరం మండలం గోనంపల్లెలో ఆదివారం స్థానికులు గంగమ్మకు దున్నపోతును బలి ఇచ్చారు. మాంసం పంపకాల్లో రెండు వర్గాల మధ్య తేడా వచ్చింది. అది కాస్త పెద్దదై ఘర్షణకు దారి తీసింది. క్షతగాత్రులను నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ ఊరి సంప్రదాయ పద్ధతుల ప్రకారం ప్రతి ఏడాది దున్నపోతులను బలి ఇస్తారు. ఆ క్రమంలోనే ఆదివారం కూడా బలి ఇచ్చారు. అయితే వాటి మాంసం పంపకాల్లో చిన్నపాటి గొడవ మొదలైంది. అది కాస్త పెద్దదై 17 మందికి గాయాలయ్యే పరిస్థితి దాకా వెళ్లింది. ఇలాంటి ఘటన ఎపుడూ జరగలేదని ఆ గ్రామస్తులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement