పోలీసుల అదుపులో హత్యకేసు నిందితులు..? | Sakshi
Sakshi News home page

పోలీసుల అదుపులో హత్యకేసు నిందితులు..?

Published Sat, Jul 22 2017 5:27 AM

అడ్వాన్స్‌ తిరిగివ్వనన్నందుకే రియల్టర్‌ సైదయ్యచౌదరి హత్య

అడ్వాన్స్‌ తిరిగివ్వనన్నందుకే మట్టుబెట్టిన వైనం
అడిగితే హత్య చేయిస్తానని బెదిరింపు
చివరి నిమిషం వరకూ ప్రాధేయపడినా..ఒప్పుకోని సైదయ్య
ఖాకీల విచారణలో నేరం అంగీకరించిన ముగ్గురు నిందితులు


నల్లగొండ క్రైం : జిల్లా కేంద్రంలో పట్టపగలే ఓ హోటల్‌లో రియల్టర్‌ను దారుణంగా మట్టుబెట్టిన ముగ్గురు నిందితులను  శుక్రవారం అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు వర్గాల ద్వారా తెలి సింది. సైదయ్య చౌదరిని హత్యచేసిన నకిరేకల్‌ పరిధిలోని కంచర్ల జగన్మోహన్‌రెడ్డి, శాలిగౌరారం మండలం వల్లాల గ్రామానికి చెందిన పన్నాల సత్తిరెడ్డి, వల్లాల గ్రామ మాజీ సర్పంచ్‌ బొడుగు వెంకటేశ్వర్లును ప్రత్యేక పోలీసు బృందం నకిరేకల్‌లో అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

రూ.1.50 కోట్లకు 20 ఎకరాల కొనుగోలు..
జగన్మోహన్‌రెడ్డి, పన్నాల సత్తిరెడ్డి, మాజీ సర్పంచ్‌ వెంకటేశ్వర్లు కలిసి రియల్‌ ఎస్టేట్‌గా వ్యాపారం చేస్తున్నారు. కొన్ని మాసాల క్రితం జి.యాదయ్య మధ్యవర్తిగా ఉండి  సైదయ్య చౌదరి వద్ద రూ.1.50 కోట్లకు 20 ఎకరాల భూమిని జగన్మోహన్‌రెడ్డి, పన్నాల సత్తిరెడ్డి, మాజీ సర్పంచ్‌ వెంకటేశ్వర్లుకు ఇప్పించాడు. అడ్వాన్స్‌గా రూ. 50 లక్షలు ఇచ్చారు. మిగతా డబ్బు  ఆరుమాసాల్లో చెల్లిస్తామని కోరగా సైదయ్య వారికి రెండు మసాల గడువే ఇచ్చాడు.

గుట్టుచప్పుడు కాకుండా మరొకరికి విక్రయం
అయితే కొన్ని రోజులకే కేంద్ర ప్రభుత్వం పాత రూ. వెయ్యి, 500 నోట్లను రద్దు చేయడంతో జగన్మోహన్‌రెడ్డి, పన్నాల సత్తిరెడ్డి, మాజీ సర్పంచ్‌ వెంకటేశ్వర్లు రియల్టర్‌ సైదయ్యకు ఒప్పంద డబ్బులను చెల్లించలేకపోయారు. వారికి ఇచ్చిన గడువు ఉండగానే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న సైదయ్య చౌదరి ఆ భూమిని గుట్టుచప్పుడు కాకుండా రూ.2 కోట్లకు మరొకరికి విక్రయించాడు. ఆ డబ్బు పూర్తిగా అందిన తర్వాత ఖమ్మం జిల్లాకు మకాం మార్చాలనే యోచనలో ఉన్నాడని ఆలస్యంగా తెలుసుకున్న ‘రియల్‌’ వ్యాపారులు నిర్ఘాంత పోయారు.

ఎకరం అమ్మితే ముగ్గురిని లేపేస్తానంటూ హెచ్చరికలు..
అడ్వాన్స్‌ డబ్బులు ఇవ్వమని ముగ్గురు వ్యాపారులు పలుమార్లు ప్రాథేయపడినా సైదయ్య చౌదరి హెచ్చరించే ధోరణిలో మాట్లాడినట్లు నిందితులు పోలీసు విచారణలో వెల్లడించినట్లు తెలుస్తోంది.  ఎకరం అమ్మితే ముగ్గురిని లేపేస్తా అంటు పలుమార్లు బెదిరించినట్టు సమాచారం. రూ.2కోట్లకు అమ్ముకున్నావుగా  తమ డబ్బులకు కనీసం వడ్డీ అయినా చెల్లించాలని బతిమిలాడినా ఒప్పుకోలేదని తెలుస్తోంది.  గురువారం స్టేయిన్‌ ఇన్‌ హోటల్‌లో చేరుకునేందుకు ముందు కూడా సైదయ్య చౌదరిని నిందితులు ప్రాథేయపడినట్టు సమాచారం.

అప్పటికప్పుడు కత్తి కొనుగోలు చేసి..
సైదయ్య ఎంతకీ వినిపించుకోకపోవడంతో ముగ్గురిలో ఓ వ్యక్తి అప్పటికప్పుడు జిల్లా కేంద్రంలోని ప్రకాశం బజార్‌కు వెళ్లి కత్తిని కొనుగోలు చేసినట్టు తెలిసింది. చివరి నిమిషంలో కూడా డబ్బు ఇచ్చేం దుకు సైదయ్య నిరాకరించడంతోనే హత్య చేసినట్టు నిందితులు విచారణలో ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. అయితే సైదయ్య ఫోన్‌కాల్‌ డేటా ఆధారంగానే నిం దితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్టు తెలి సింది. అయితే ఒకటి, రెండు రోజుల్లో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 

Advertisement

తప్పక చదవండి

Advertisement