భారత్ కుబేరుల్లో దిలీప్ సంఘ్వి టాప్ | Sakshi
Sakshi News home page

భారత్ కుబేరుల్లో దిలీప్ సంఘ్వి టాప్

Published Thu, Mar 5 2015 6:15 AM

భారత్ కుబేరుల్లో దిలీప్ సంఘ్వి టాప్

- 2 రోజుల్లోనే ముకేశ్ అంబానీ వెనక్కు
- సన్‌ఫార్మా షేరు జోరే కారణం

న్యూయార్క్: ఎనిమిదేళ్లుగా భారత బిలియనీర్ల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీని కేవలం రెండు రోజుల్లోనే  వెనక్కునెట్టి సన్‌ఫార్మా అధినేత దిలీప్ సంఘ్వి భారత నం-1 బిలియనీర్‌గా అవతరించారు. రియల్ టైమ్ అప్‌డేట్ ప్రకారం ఫోర్బ్స్ తన జాబితాలో కొన్ని మార్పులను చేసింది.

ఈ మార్పుల ప్రకారం ప్రపంచ బిలియనీర్ల జాబితాలో సంఘ్వి ర్యాంక్ 44 నుంచి 37కు పెరిగింది.ముకేశ్ అంబానీ ర్యాంక్ 39 నుంచి 43కు తగ్గింది. ప్రస్తుతం సంఘ్వి సంపద 21.5 బిలియన్ డాలర్లుగా, ముకేశ్ అంబానీ సంపద 20.4 బిలియన్ డాలర్లుగా ఉంది. సంఘ్వి అధినేతగా ఉన్న సన్‌ఫార్మా కంపెనీ మార్కెట్ షేరు ధర భారీగా పెరగడమే దీనికి కారణం.

Advertisement
Advertisement