మహిళా టెకీ ప్రాణాలు తీసిన లాంగ్ డ్రైవ్ | Sakshi
Sakshi News home page

మహిళా టెకీ ప్రాణాలు తీసిన లాంగ్ డ్రైవ్

Published Sat, Jul 26 2014 1:25 PM

మహిళా టెకీ ప్రాణాలు తీసిన లాంగ్ డ్రైవ్ - Sakshi

(ఒంగోలు నుంచి సాక్షి టీవీ రిపోర్టర్ శ్రీనివాస్)

లాంగ్ డ్రైవ్ సరదా మహిళా ఇంజినీర్ ప్రాణాలు తీసింది. స్నేహితులతో కలిసి సరదాగా బైక్ పై లాంగ్ డ్రైవ్కు బయల్దేరిన ఆమె రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది.  శనివారం ఉదయం  ప్రకాశం జిల్లాలో కొరిశపాడు మండలం మేదరమెట్ల వద్ద  ఓ లారీ వెనుక నుంచి బైక్ను ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే తమిళనాడు సేలంకు చెందిన విష్ణుప్రియ ...చెన్నైలో ఓ సాప్ట్వేర్ కంపెనీలో పని చేస్తోంది.

వీకెండ్ సందర్భంగా ఆమె... తన స్నేహితులతో కలిసి మూడు బైక్ల్లో చెన్నై నుంచి హైదరాబాద్కు బయల్దేరింది. మేదరమెట్ల సమీపంలో వారి బైక్ను లారీ ఢీకొనటంతో వెనక కూర్చున్న విష్ణుప్రియ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఆమె స్నేహితుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Advertisement
Advertisement