గరుడ సేవ నేడే | Sakshi
Sakshi News home page

గరుడ సేవ నేడే

Published Tue, Sep 30 2014 2:41 AM

గరుడ సేవ నేడే - Sakshi

సాక్షి, తిరుమల: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ప్రతిష్టాత్మకమైన గరుడ వాహన సేవ ఊరేగింపు మంగళవారం నిర్వహించనున్నారు. రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే వాహన ఊరేగింపు రాత్రి ఒంటిగంటవరకూ జరగనుంది. ఐదు లక్షల మంది భక్తులు వాహన సేవను తిలకించేందుకు వచ్చే అవకాశముందని టీటీడీ, పోలీసు అధికారులు అంచనావేశారు.
 
కట్టుదిట్టమైన భద్రత
గరుడ వాహన సేవలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే తిరుమలలో 3 వేల మందితో భద్రతను పటిష్టం చేశారు. అదనంగా మరో 1500 మందిని విధులకు రప్పించారు. వాహన సేవలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీసు, విజిలెన్స్ అధికారులు పలుమార్లు చ ర్చించారు. సీసీ కెమెరాలతో జనం కదలికలను పాత అన్నదాన భవనంలో ఏర్పాటు చేసిన సెం ట్రల్ కమాండెంట్ సెంటర్‌లోని మాస్టర్ కంట్రోల్ రూమ్‌లో నిశితంగా పరిశీలిస్తున్నారు. ఆక్టోపస్ క మాండోలు, ఏఆర్ కమాండో సిబ్బందిని ఆల యం వద్ద మఫ్టీలో అనుక్షణం సిద్ధంగా ఉంచారు.
 
ఏర్పాట్లపై ఉన్నతాధికారుల సమీక్ష
తిరుమల జేఈవో శ్రీనివాసరాజు టీటీడీలోని ఉన్నతాధికారులతో సమీక్షించారు. గరుడ వాహ న సేవలో బ్యాడ్జిల పంపిణీ నుంచి వాహన సేవ పూర్తయ్యే వరకు చేపట్టాల్సిన ఏర్పాట్లను చర్చించారు. భద్రతా ఏర్పాట్లపై అనంతపురం రేంజ్ డీఐజీ బాలకృష్ణ, ఇన్‌చార్జి సీవీఎస్‌వో జి.శ్రీనివాస్, తిరుపతి అర్బన్ జిల్లా ఎస్‌పీ గోపినాథ్‌జెట్టి సమీక్షించారు. గరుడ వాహన సేవ సందర్భంగా నాలుగు మాడా వీధుల్లో భక్తుల మ ద్య ఎలాంటి తోపులాట, తొక్కిసలాటలకు అవకా శం లేకుండా భద్రతా చర్యలు చేపట్టాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. మధ్యాహ్నం నుంచే మాడా వీధుల్లోని గ్యాలరీల్లో భక్తులను అనుమతించాలని నిర్ణయించారు.

ఆలయం వద్ద గ్యాలరీల్లో అశేష సంఖ్యలో వేచి ఉండే భక్తులందరూ ఉత్సవమూర్తిని  దర్శించుకునే విధంగా సిబ్బందికి ఆదేశాలిచ్చారు. భక్తుల మధ్య తోపులాటకు అవకాశం లేకుం డా బారికేడ్లను నిర్మించారు. గరుడ సేవ సందర్భంగా తిరుమల, తిరుపతి మధ్య రెండు ఘాట్‌రోడ్లలో మంగళవారం వేకువజాము నుంచి బుధవారం వేకువజాము వరకు ద్విచక్రవాహనాలను అనుమతించరు. పైవేట్ వాహనాలను జీఎన్‌సీ టోల్‌గేట్ వద్ద నుంచే క్రమబద్ధీకరిస్తున్నారు. గరుడ వాహన సేవ తిలకించేందుకు వీవీఐపీలు, వీఐపీలు, టీటీడీ ఉద్యోగుల కుటుంబాలు, పోలీసు కుటుంబాలు, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ప్రతినిధులకు మొత్తం 3500 మందికి పాసులు, బ్యాడ్జిలు జారీ చేయాలని నిర్ణయించారు.
 
నాలుగు మాడ వీధుల్లో ఆహారం పంపిణీకి చర్యలు
గరుడసేవ సందర్భంగా తరలి వచ్చే భక్తులకు శ్రీవారి నిత్యాన్నప్రసాద సముదాయం, క్యూ కాంప్లెక్స్‌లు, క్యూలు, నాలుగు మాడ వీధుల్లో సుమారు రెండు లక్షల మందికి ఉచిత భోజన సౌ కర్యం కల్పించనున్నారు. మాడ వీధుల్లో పులిహోర, సాంబారన్నం, పెరుగన్నం, ఉప్మా వంటి ఆహార పొట్లాలు, వేడిపాలు, కాఫీ, టీ అందించనున్నారు. భక్తులకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు తిరుమలలో పలు ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. దీంతో పాటు సీటీసీ సంజీవిని, 108 అంబులెన్స్ సర్వీసులు కూడా పనిచేస్తున్నాయి. అనుకోని సంఘటన ఎదురైతే నాలుగు మాడ వీధుల్లోకి ఫైర్‌ఇంజన్  సులభంగా వచ్చేలా చర్యలు తీసుకున్నారు.

Advertisement
Advertisement