అమ్మకు అన్నం పెట్టరట..! | Sakshi
Sakshi News home page

అమ్మకు అన్నం పెట్టరట..!

Published Tue, Dec 10 2013 12:11 AM

అమ్మకు అన్నం పెట్టరట..!

అడ్డాలనాటి బిడ్డలు గడ్డాలనాడుకారన్న నానుడిని నిజం చేశారా తనయులు.  కొడుకుల తీరుతో విసిగిపోయిన ఆ మాతృమూర్తి విధిలేని పరిస్థితిలో ఠాణామెట్లెక్కింది. బాధితురాలి కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం మల్లారం గ్రామానికి చెందిన బాషెట్టి వెంకటమ్మ-రాములు దంపతులకు ముగ్గురు కుమారులు. భర్త రాము లు 34 ఏళ్ల క్రితం గల్ఫ్‌లో మృతి చెందాడు. అప్పటినుంచి అన్నీ తానై తనయులను పెంచిపెద్ద చేసింది వెంకటమ్మ. రెండో కుమారుడు సుధాకర్, మూడో కుమారుడు రవి మూడు నెలల క్రితం తల్లిని వైద్యపరీక్షల నిమిత్తమని వేములవాడకు తీసుకువచ్చి.. ఆమె పేరిట ఉన్న ఇంటిని తమ పేరి ట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.

 

విషయం పెద్ద కుమారు డు కమలాకర్‌కు తెలియడంతో అన్నదమ్ముల మధ్య వివా దం మొదలైంది. పలుమార్లు గ్రామపెద్దల సమక్షంలో పం చాయితీ జరిగింది. ఇంటిని పంచుకున్న ఆ ఇద్దరే తల్లిని చూసుకోవాలని కమలాకర్  చేతులెత్తేశాడు. చిన్నోళ్లు ఇద్దరూ తల్లి బాధ్యత తనకొద్దంటే.. తనకొద్దంటూ తప్పిం చుకున్నారు. దీంతో తల్లి ఒంటరిదైంది. తనను కొడుకులు ఆదరించడం లేదని, మీరే ఆధారం చూపించాలని కోరు తూ ఆదివారం ఠాణామెట్లెక్కింది. సీఐ దేవారెడ్డి కొడుకుల ను పిలిపించి కౌన్సెలింగ్ చేస్తున్నారు.
      - న్యూస్‌లైన్, వేములవాడ
 

Advertisement
 
Advertisement
 
Advertisement