ప్రకాశం: అయిదేళ్ల బాలికపై లైంగికదాడి యత్నానికి పాల్పడిన ఘటన ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం కలికివాయలో ఆదివారం జరిగింది. పోలీసుల కథనం మేరకు..గ్రామానికి చెందిన అయిదేళ్ల బాలిక తల్లిదండ్రులు పచ్చాకు కూలీ పని కోసం వేరే ప్రాంతానికి వెళ్లారు. కుమార్తెను పెద్దమ్మ దగ్గర ఉంచారు. ఆమె ఆదివారం ఇంటి వద్ద ఉన్న చర్చికి వెళ్లగా అదే గ్రామానికి చెందిన దాసరి కోటేశ్వరరావు (50) బాలికను చర్చి సమీపంలోని నిర్మానుశ్య ప్రదేశానికి తీసుకెళ్లి లైంగికదాడికి యత్నించాడు. బాలిక కేకలు వేయడంతో గమనించిన స్థానికులు కోటేశ్వరరావుకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. స్థానిక సీఐ గుంజి తిరుమలరావు, ఎసై ్స మల్లికార్జునరావు ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు.
(సింగరాయకొండ)