జ్యోతుల నెహ్రు సోదరుడి మృతి | Sakshi
Sakshi News home page

జ్యోతుల నెహ్రు సోదరుడి మృతి

Published Thu, Mar 26 2015 8:18 PM

Jyotula Nehru brother died

రాజమండ్రి(జగ్గంపేట): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసన సభాపక్ష ఉప నేత జ్యోతుల నెహ్రు సోదరుడు జ్యోతుల సత్యనారాయణ (54) గుండె పోటుతో మృతి చెందారు. ఛాతీలో నొప్పిగా ఉండటంతో ఆయనను గురువారం సాయంత్రం కాకినాడ ట్రస్ట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆయన కొద్దిసేపటి కింద గుండెపోటుతో మరణించారు.

 స్థానికులు ఆప్యాయంగా సత్తిబాబు అని పిలుచుకునే సత్యనారాయణ ప్రజల మనిషిగా జిల్లాలో మంచి పేరు సంపాదించుకున్నారు.

Advertisement
Advertisement