నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు భేష్‌ | Sakshi
Sakshi News home page

నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు భేష్‌

Published Sat, May 4 2024 4:25 AM

నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు భేష్‌

సుభాష్‌నగర్‌: నీటి ఎద్దడి తలెత్తకుండా జిల్లా యంత్రాంగం చేపడుతున్న చర్యలు బాగున్నాయని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి, జిల్లా ప్రత్యేకాధికారి శరత్‌ అభినందించారు. మే నెలలో ఎండల తీవ్రత అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో జి ల్లావ్యాప్తంగా తాగునీటి సరఫరాకు అంతరాయం తలెత్తకుండా అంకితభావంతో పని చేయాలని, నీటి సరఫరా వ్యవస్థను నిరంతరం పర్యవేక్షించాల ని సూచించారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతుతో కలిసి జిల్లాలో మంచి నీటి సరఫరా పరిస్థితిపై మండల స్పెషల్‌ ఆఫీసర్లు, సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. జిల్లాలో ఎక్కడ కూడా నీటి సమస్య తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నారని, వేసవి సీజన్‌ ముగిసే వరకు ఇదే స్ఫూర్తితో పని చేయాలని సూచించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ నీటి సరఫరాను నిరంతరం పర్యవేక్షించేందుకు వీలుగా గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులకు ఎన్నికల విధుల నుంచి మినహాయింపు ఇచ్చామని తెలిపారు. మండల ప్రత్యేక అధికారులు క్రమం తప్పకుండా మండలాల్లో పర్యటిస్తూ పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. సమావేశంలో నగరపాలక సంస్థ కమిషనర్‌ మకరంద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement