ఎమ్మెల్సీ దండే విఠల్‌ ఎన్నిక చెల్లదు | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీ దండే విఠల్‌ ఎన్నిక చెల్లదు

Published Sat, May 4 2024 7:35 AM

ఎమ్మె

మారిన రాజకీయ పరిస్థితులు..

అప్పటికి ఇప్పటికీ రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పుడు బీఆర్‌ఎస్‌ రాష్ట్రంలో అధికారంలో ఉండగా, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో అంతా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహించారు. అప్పుడు బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా దండే విఠల్‌ను ప్రకటించినప్పటికీ పార్టీ ఆదేశాలు ధిక్కరిస్తూ ఇదే పార్టీలో ఉన్న సారంగా పూర్‌ జెడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి కూడా నామినేషన్‌ వేశాడు. ఉపసంహరణ విషయంలో అప్పుడు మంత్రిగా ఉన్న ఇంద్రకరణ్‌ రెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయినా పత్తిరెడ్డి దిగిరాలేదు. ఇదిలా ఉంటే ఆరోజు 24 మందిలో 22 మంది నామినేషన్‌ ఉపసంహరించుకున్నారని ఎన్నికల అధికారులు ప్రకటించా రు. అందులో పత్తిరెడ్డి కూడా ఉన్నట్టు కూడా తెలిపారు. అయితే తన ప్రమేయం లేకుండానే ఫోర్జరీ సంతకాలతో తన నామినేషన్‌ను బీఆర్‌ఎస్‌ నేతలు ఉపసంహరింపజేశారని ఆయన ఆరోపించాడు. దీనిపై హైకోర్టును ఆశ్రయించాడు. తాజాగా తీర్పు వెలబడింది. కాగా ప్రస్తుతం మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, జెడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి ఇద్దరూ కాంగ్రెస్‌లోనే ఉండటం గమనార్హం.

ఎమ్మెల్సీ దండే విఠల్‌ ఎన్నిక చెల్లదు
1/1

ఎమ్మెల్సీ దండే విఠల్‌ ఎన్నిక చెల్లదు

Advertisement
Advertisement