పారిశ్రామిక నవోదయం | Sakshi
Sakshi News home page

పారిశ్రామిక నవోదయం

Published Sat, May 4 2024 10:25 AM

పారిశ

ఇంకా...

● కొవ్వూరు మండలం ఇసుకపట్ల పంగిడి గ్రామం వద్ద మరో భారీ పరిశ్రమకు నాంది పలికారు. 26.65 ఎకరాల విస్తీర్ణంలో రూ. 1,350 కోట్ల పెట్టుబడితో త్రివేణి రెన్యువబుల్స్‌ సంస్థ ఆధ్వర్యాన సోలార్‌ గ్లాస్‌ తయారీ పరిశ్రమ ఏర్పాటైంది. దీని ద్వారా 2,400 మందికి ఉద్యోగాలు లభించాయి.

● నల్లజర్ల మండలం పోతవరం గ్రామంలో 14 ఎకరాల్లో జాగృతి బయోటెక్‌ సంస్థ ఆధ్వర్యాన బయో టెక్నాలజీ కంపెనీ అందుబాటులోకి రానుంది. రూ.50 కోట్ల పెట్టుబడితో నిర్మిస్తున్న ఈ పరిశ్రమ ఏర్పాటు పూర్తయితే 81 మందికి ఉద్యోగాలు లభిస్తాయి.

● పెరవలి మండలం ఖండవల్లి గ్రామం వద్ద రవళి స్పిన్నర్స్‌ సంస్థ 16,800 స్పిండిల్స్‌ ఉత్పత్తి సామర్థ్యంతో కాటన్‌ స్పిన్నింగ్‌ మిల్లును అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ఏర్పాటు చేసింది. అనంరతం 1,520 స్పిండిల్స్‌గా, 2,900 డ్రమ్స్‌కు దీనిని విస్తరించింది. సంస్థలో 1,000 మంది ఉపాధి పొందేవారు. నెలకు 10,000 టన్నుల నూలు ఈ ఫ్యాక్టరీ నుంచి ఉత్పత్తి అవుతోంది. సాధారణమైన నూలుతో పాటు జీన్స్‌కు, అన్ని రకాల వస్త్రాల తయారీకి ఉపయోగపడే నూలు ఇక్కడ తయారు చేస్తున్నారు. ఫలితంగా దేశవ్యాప్తంగా ‘రవళి’ దారం మంచి పేరు పొందింది. దీని ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు ప్రభుత్వం తాజాగా అనుమతులు ఇచ్చింది. తద్వారా రూ.150 కోట్ల పెట్టుబడి వ్యయంతో 2 లక్షల స్పిండిల్స్‌ తయారీ సామర్థ్యానికి దీనిని విస్తరించారు. ఫలితంగా మరో 1,000 మందికి ఉపాధి లభించింది.

● జిల్లా కేంద్రం రాజమహేంద్రవరం నగరంలోని ఆంధ్రా పేపర్‌ మిల్లు ఉత్పత్తి సామ ర్థ్యం పెరిగింది. రూ.2 వేల కోట్లతో మరో 2,300 మందికి ఉద్యోగాలు లభించాయి.

ఇసుకపట్ల పంగిడి వద్ద సోలార్‌ గ్లాస్‌ తయారీ పరిశ్రమ

సాక్షి, రాజమహేంద్రవరం: నవ్య తూర్పు గోదావరి జిల్లా సుస్థిర ఆర్థికాభివృద్ధి సాధించే దిశగా అడుగులు వేస్తోంది. దీనికి అనుగుణంగా ప్రభుత్వం గడచిన ఐదేళ్లుగా కొత్త పరిశ్రమల స్థాపనకు అత్యంత ప్రోత్సాహం ఇచ్చింది. పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు సింగిల్‌విండో విధానంలో అన్ని రకాల అనుమతులూ ఇస్తున్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రాయితీపై భూములు కేటాయిస్తూండటం, పరిశ్రమలకు అనుకూల వాతావరణం ఉండటంతో పారిశ్రామిక దిగ్గుజాలు, బహుళజాతి సంస్థలు జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వస్తున్నాయి. రూ.వేల కోట్ల పెట్టుబడులు పెడుతున్నాయి. వీటితో పాటు సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమల (మైక్రో, స్మాల్‌ అండ్‌ మీడియం ఎంటర్‌ప్రైజెస్‌) ఏర్పాటుకు అత్యధిక శాతం మంది ఆసక్తి చూపుతున్నారు. అధికార యంత్రాంగం చొరవతో ‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌’కు కేంద్రంగా జిల్లా మారింది. పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలన్న ప్రభుత్వ అజెండాతో వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి దక్కుతోంది.

పరిశ్రమల స్థాపన.. ఉద్యోగాల కల్పన

కొత్త జిల్లాల ఏర్పాటు అనంతరం నూతన తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురంలో భారీ పరిశ్రమ స్థాపనకు అడుగులు పడ్డాయి. పారిశ్రామిక దిగ్గజ కంపెనీ ఆదిత్య బిర్లా గ్రూప్‌ తొలి దశలో రూ.1,000 కోట్లు, రెండో దశలో మరో రూ.1,500 కోట్లు కలిపి మొత్తం రూ.2,500 కోట్ల పెట్టుబడితో గ్రాసిమ్‌ కాస్టిక్‌ సోడా ప్లాంట్‌ నిర్మించింది. ఈ పరిశ్రమ రెండో దశ విస్తరణ ప్రక్రియ సైతం ఇటీవల పూర్తయింది. 2,500 మందికి ఉపాధి దక్కుతోంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నిరాదరణకు గురైన ఈ ప్రాజెక్టును సీఎం వైఎస్‌ జగన్‌ పట్టాలెక్కించారు.

రూ.260 కోట్లతో ఇథనాల్‌ ప్రాజెక్టు

‘రైస్‌ బౌల్‌ ఆఫ్‌ ఇండియా’గా పేరొందిన గోదావరి తీరాన.. పెట్రో ఉత్పత్తుల్లో కలిపేందుకు ఉపయోగించే బియ్యం ఆధారిత తొలి ఇథనాల్‌ ప్లాంట్‌ మన జిల్లాలో ఏర్పాటవుతోంది. గోకవరం మండలం గుమ్మళ్లదొడ్డి గ్రామంలో రూ.260 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తున్నారు. దీనికి ఏపీఐఐసీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రూ.13.50 కోట్ల విలువైన 20.07 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ పరిశ్రమ ద్వారా రోజుకు 200 కిలోలీటర్ల (2 లక్షల లీటర్ల) ఇథనాల్‌ ఉత్పత్తి చేయాలన్నది లక్ష్యం. ప్రస్తుతం దీని పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. పరిశ్రమ నిర్మాణం పూర్తయితే 210 మందికి పైగా నిరుద్యోగులకు ఉపాధి దక్కుతుంది.

ఎంఎస్‌ఎంఈలతో..

గడచిన మూడున్నరేళ్లుగా ఎంఎస్‌ఎంఈల అభివృద్ధికి, తద్వారా ఉపాధి కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. అధికార యంత్రాంగం గత ఏడాది ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకూ జిల్లా వ్యాప్తంగా 6,000 ఎంఎస్‌ఎంఈలు స్థాపించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇప్పటికే 2,427 ఏర్పాటు చేసింది. చిన్న, మధ్యతరహా, పెద్ద పరిశ్రమలకు కలిపి రూ.39.557 లక్షల పెట్టుబడులు వచ్చాయి. ఫలితంగా 10,179 మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం తీసుకుని వచ్చిన సింగిల్‌ విండో విధానం పారిశ్రామికవేత్తలకు ఎంతో ఉపయోగపడుతోంది. 2019–23 మధ్య వివిధ పరిశ్రమల స్థాపనకు, పారిశ్రామిక అవసరాలకు 2,514 దరఖాస్తులు అందగా.. వాటిలో 2,431కు పరిష్కారం చూపారు.

జిల్లాలో పరిశ్రమలకు ప్రభుత్వ ప్రోత్సాహం

బలభద్రపురంలో రూ.2,500 కోట్లతో గ్రాసిమ్‌ కాస్టిక్‌ సోడా ఇండస్ట్రీ

గుమ్మళ్లదొడ్డి వద్ద రూ.260 కోట్లతో ఇథనాల్‌ ప్రాజెక్టు

2,427 ఎంఎస్‌ఎంఈల పరిధిలో 10,179 మందికి ఉపాధి

జిల్లాలో పరిశ్రమల స్థాపన, పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన

సంవత్సరం పరిశ్రమల స్థాయి స్థాపించిన యూనిట్లు పెట్టుబడి ఉద్యోగాల కల్పన

2019–23 భారీ 1 రూ.861 కోట్లు 1,203

2024 భారీ 4 రూ.3,760 కోట్లు 5,910

ఎంఎస్‌ఎంఈలు

2019–22 533 రూ.245.25 కోట్లు 5,725

2022 ఏప్రిల్‌ – 2023 సెప్టెంబర్‌ 8,885 రూ.777.28 కోట్లు 19,050

పారిశ్రామిక నవోదయం
1/3

పారిశ్రామిక నవోదయం

పారిశ్రామిక నవోదయం
2/3

పారిశ్రామిక నవోదయం

పారిశ్రామిక నవోదయం
3/3

పారిశ్రామిక నవోదయం

Advertisement
Advertisement