జిల్లాలోనే అత్యధిక ఆయకట్టు.. | Sakshi
Sakshi News home page

జిల్లాలోనే అత్యధిక ఆయకట్టు..

Published Sat, May 4 2024 9:25 AM

జిల్లాలోనే అత్యధిక ఆయకట్టు..

హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకం కింద ఉరవకొండ నియోజకవర్గానికి జిల్లాలోనే అత్యధికంగా 50 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉరవకొండ పర్యటన సందర్భంగా ఆయకట్టు అభివృద్ధికి ఆమోదం తెలిపారు. హంద్రీనీవా 33వ ప్యాకేజీ కింద 20,600 ఎకరాలు, 34వ ప్యాకేజీ కింద 17,300 ఎకరాలు, 36(ఏ) ప్యాకేజీ కింద 65,600 ఎకరాలు మొత్తంగా 76,058 ఎకరాలకు సంబంధించి ఫీల్డ్‌ ఛానల్స్‌ నిర్మాణానికి 68.45 కోట్లు మంజురు చేశారు. దీంతో పాటు బెళుగుప్ప మండలం జీడిపల్లి రిజర్వాయర్‌ కింద ఉన్న జీడిపల్లి గ్రామాన్ని పునరావసం కల్పించడానికి నిధులు కూడా మంజూరు చేశారు. హంద్రీనీవా ద్వారా నియోజకవర్గంలో ఇప్పటికే 50 వేల ఎకరాల ఆయకట్టు సాగునీరు అందడంతో రైతులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.

Advertisement
Advertisement