-
నోటిదురుసుకు ఇదా శిక్ష!
నోరు పారేసుకునే అలవాటున్న నేతలకు ఎన్నికలు ఎప్పుడూ పండగే. ఊరూరా తిరుగుతూ ప్రత్యర్థులను ఇష్టానుసారం దూషించటం ఒక్కటే ఆ బాపతు నేతలకు తెలిసిన విద్య. కలకత్తా హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తూ రిటైర్మెంట్కు కొన్ని నెలల ముందు పదవికి రాజీనామా చేసి రాజకీయ రంగ ప్రవేశం చేసిన జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ్ అలాంటి నేతలను తలదన్నారు. ఆలస్యంగా వచ్చినా ‘అన్నీ నేర్చుకునే’ వచ్చారని నిరూపించుకున్నారు. న్యాయమూర్తులుగా పనిచేసినవారు వెనువెంటనే రాజకీయాల్లోకి రావొచ్చా లేదా అన్నది వేరే చర్చ. అసలు జస్టిస్ అభిజిత్ వంటివారిని రానీయొచ్చా అనే సదసత్సంశయం అందరిలోనూ కలిగేలా చేసిన ఘనుడాయన. ఆయన దూషణలు ఎంత హీనాతిహీనంగా ఉన్నాయంటే...అవి పశ్చిమ బెంగాల్ రాష్ట్రం పరువు తీస్తాయని, దేశాన్ని అపఖ్యాతిపాలు చేస్తాయని ఎన్నికల సంఘం(ఈసీ) వ్యాఖ్యానించింది. ఉన్నత విద్యావంతుడై, దీర్ఘకాలం వృత్తిలో కొనసాగిన ఒక బాధ్యతగల వ్యక్తి నుంచి ఇలాంటి చవకబారు మాటలు రావటం బాధాకరమన్నది. అయితే ఆయన దూషణలపై ఇంత తీవ్రంగా స్పందించిన ఈసీ, తీరా ఆయన్ను 24 గంటలపాటు ప్రచారంలో పాల్గొనరాదంటూ నిషేధం విధించి ఊరుకోవటం విడ్డూరంగానే అనిపిస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఉద్దేశించి గత గురువారం ఆయన దూషణలకు దిగారు. ‘మీ రేటెంత మమతాజీ...ఎంతకు అమ్ముడుపోయారు? మేకప్ వేసుకుంటున్నారు గనుక పది లక్షలా! అసలామె మహిళేనా అని సందేహం కలుగుతుంది’ అని ఆయన మాట్లాడారు. ఆ వెంటనే ఈసీకి తృణమూల్ ఫిర్యాదు చేసింది. గతంలో సమాచారం తెలుసుకోవటం, నిర్ధారించుకోవటం కష్టమయ్యేది. సామాజిక మాధ్యమాలొచ్చాక మరుక్షణంలోనే ప్రపంచానికి తెలిసిపోతోంది. ఎన్నికల సంఘం దీన్నంత సీరియస్‌గా తీసుకుంటే 24 గంటల్లో నివేదిక తెప్పించుకుని చర్య తీసుకోవటం కష్టం కాదు. కానీ ఈసీకి దాదాపు అయిదు రోజులు పట్టింది. ఈలోగా ఆయన ప్రచారమూ యథావిధిగా సాగింది. స్వీయసమర్థన సరేసరి.మన సమాజం స్త్రీలను గౌరవిస్తుందని, పూజిస్తుందని ఘనంగా చెప్పుకుంటాం. కానీ మహిళలపై సాగుతున్న నేరాలు గమనిస్తే ఆ విషయంలో సందేహం కలుగుతుంది. బయటికెళ్తే ఎదురయ్యే సమస్యల గురించి ఏ బాలికను అడిగినా, మహిళను అడిగినా చెప్తారు. వీటిని రూపుమాపే ప్రభుత్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి. కఠిన నిబంధనలతో చట్టాలు కూడా వస్తున్నాయి. కానీ ఆశించిన ఫలితాలేవి? చట్టాలు ఒక్కటే సమాజాన్ని మార్చలేవు. బాధ్యతాయుత స్థానాల్లో ఉంటున్నవారు సక్రమంగావుంటే ఇతరులకు అదొక సందేశమవుతుంది. కానీ వారే విచ్చలవిడి చేష్టలతో, మాటలతో చెలరేగుతుంటే వీధుల్లో తిరిగే పోకిరీలు ఇక నేర్చుకునేదేముంటుంది? మహిళలను కించపర్చటంలో జస్టిస్ అభిజిత్ మొదటివారు కాదు... బహుశా చివరివారు కూడా కాకపోవచ్చు. సాధారణ సందర్భాల మాటెలావున్నా కనీసం ఎన్నికలప్పుడైనా ఈసీ తీవ్రంగా స్పందిస్తే కొద్దో గొప్పో ఫలితం ఉంటుంది. ఎందుకంటే రాజకీయాలు పెద్దగా పట్టనివారు సైతం ఎన్నికలప్పుడు ఆసక్తి చూపుతారు. అందువల్లే ఈసీ కఠినంగా ఉండాలి. ఎన్నికల ప్రచారంలో పాటించే మార్గదర్శకాలేమిటో తమ అభ్యర్థులకూ, పార్టీ ప్రచారంలో పాల్గొనే ఇతరులకూ తెలియజేయాలని బీజేపీ అధినేత జేపీ నడ్డాకు ఈసీ సూచించింది. ఆ పార్టీ దాన్నెంతవరకూ పాటించిందో తెలియదు. అయినా ఇది ఈసీ చెబితేగానీ తెలియనంత విషయమేం కాదు. పార్టీలకు మందీమార్బలం ఉంటుంది. వివిధ హోదాల్లో ఉండేవారంతా బాధ్యతలు పంచుకుని తీరికలేకుండా ప్రచారంలో తలమునకలైన అధినేతలకు అవసరమైన విషయాలను చేరేస్తుంటారు. కానీ వారెవరికీ జస్టిస్ అభిజిత్ సంస్కారహీనమైన మాటలు తప్పనిపించినట్టు లేదు. సరిగదా...‘ప్రధానిని విపక్షాలు అంటున్న మాటలు మీకు వినిపించటంలేదా...కళ్లూ, చెవులూ మూతబడ్డాయా?’ అని బీజేపీ రాజ్యసభ ఎంపీ సమిక్ భట్టాచార్య ఈసీని ప్రశ్నించారు. ‘కంటి వైద్య నిపుణులతో చూపు సరిచేయించుకోండి’ అని కూడా ఉచిత సలహా ఇచ్చారు. తమది విభిన్నమైన పార్టీ అని తొలినాళ్లలో చెప్పుకున్న రాజకీయ పక్షం నుంచి ఇలాంటి సమర్థనలు ఆశించగలమా? జస్టిస్ అభిజిత్ ఇప్పుడే కాదు... న్యాయమూర్తిగా పనిచేసినప్పుడు సైతం విమర్శలు ఎదుర్కొన్నారు. మమత ప్రభుత్వంపై వెలువరించే తీర్పుల్లో ఆయన వ్యాఖ్యలు మితిమీరుతున్నాయన్న అభిప్రాయం ఉండేది. ఆయన్ను సమర్థించే మీడియా మాత్రం ‘ప్రజా న్యాయమూర్తి’ అనే భుజకీర్తులు తగిలించింది. అది వేరే సంగతి. చిత్రమేమంటే ఆయన తీర్పులను గట్టిగా సమర్థించి, ఎవరు ఎప్పుడు పునః సమీక్షించినా అవి ప్రామాణికమైనవని నిర్ధారణవుతుందన్నవారు సైతం బీజేపీలో చేరటం ద్వారా వ్యవస్థ విశ్వసనీయతను జస్టిస్ అభిజిత్ తీవ్రంగా దెబ్బ తీశారని అభిప్రాయపడ్డారు. ఉద్దేశపూర్వకంగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించేవారినీ, మహిళల వ్యక్తిత్వహననానికి పాల్పడేవారినీ ఉపేక్షించటం, నామమాత్రపు నిషేధాలతో సరిపెట్టడం న్యాయం కాదు. అవసరమైతే పోటీకి అనర్హులను చేయటంవంటి కఠిన చర్యలకు సిద్ధపడితే తప్ప ఇటువంటి నేతలు దారికి రారు. చట్టసభల్లో ఎలాగూ ఆరోగ్యవంతమైన చర్చలకు తావుండటం లేదు. కీలకమైన నిర్ణయాలు సైతం మూజువాణి ఓటుతో గట్టెక్కి చట్టాలుగా మారి సామాన్యులపై సవారీ చేస్తున్నాయి. కనీసం ఎన్నికల సమయంలోనైనా ఏ పార్టీ చరిత్రేమిటో, ఎవరివల్ల తమకు మేలు కలుగుతుందో నిర్ధారించుకునే అవకాశం ప్రజలకివ్వటం అవసరం. అందుకు నోటిదురుసు నేతలను కట్టడి చేయటం ఒక్కటే మార్గం. -
మమత సర్కారుకు షాక్.. కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు
కోల్‌కతా: లోక్‌సభ ఎన్నికల వేళ పశ్చిమబెంగాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ సర్కారుకు కలకత్తా హైకోర్టు షాక్ ఇచ్చింది. ఈ మేరకు బుధవారం(మే22)న కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఓబీసీ కోటాలోని పలు క్లాసులు చట్ట విరుద్ధమని పేర్కొంటూ కొట్టివేసింది. 2010 తర్వాత నుంచి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన అన్ని ఓబీసీ సర్టిఫికెట్లను రద్దు చేసింది.2012 పశ్చిమబెంగాల్ వెనుకబడిన వర్గాల చట్టంలోని కొన్ని నిబంధనలు చట్టవిరుద్ధంగా ఉన్నాయంటూ దాఖలైన పిటిషన్లను విచారించిన కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. 2010-12 మధ్య రాష్ట్ర ప్రభుత్వం ఓబీసీ వర్గీకరణలో పేర్కొన్న 42 క్లాసులను కొట్టివేస్తున్నట్లు డివిజన్ బెంచ్ తెలిపింది. ఓబీసీ వర్గీకరణ చట్టవిరుద్ధంగా ఉందని స్పష్టంచేసింది.అయితే, ఈ తీర్పును ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని సీఎం మమతా బెనర్జీ అన్నారు. ఇది కచ్చితంగా బీజేపీ కుట్రేనని ఆరోపించారు. రాష్ట్రంలో రిజర్వేషన్లు ఎప్పటిలాగే అమలవుతాయన్నారు. -
మాజీ జడ్జి గంగోపాధ్యాయ ప్రచారంపై ‘ఈసీ’ బ్యాన్
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీపై చేసిన వ్యాఖ్యలకుగాను కలకత్తాక హైకోర్టు మాజీ జడ్జి గంగోపాధ్యాయను ఎన్నికల కమిషన్ మందలించింది. 24 గంటల పాటు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలని ఆదేశించింది. ఈ గడువు మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభమవుతుందని తెలిపింది.ప్రచార సభల్లో మాట్లాడేటపుడు జాగ్రత్తగా మాట్లాడాలని గంగోపాధ్యాకు ఎన్నికల సంఘం సూచించింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను దృష్టిలో ఉంచుకోవాలని హెచ్చరించింది. నీ రేటెంత అని మమతా బెనర్జీని ఉద్దేశించి గంగోపాధ్యాయ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే.గంగోపాధ్యాయ ప్రస్తుతం వెస్ట్‌బెంగాల్‌లోని టమ్లుక్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున ఎన్నికల బరిలో ఉన్నారు. కలకత్తా హైకోర్టు జడ్జి పదవికి రాజీనామా చేసి మరీ గంగోపాధ్యాయ బీజేపీలో చేరి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. -
ఓట్ల కోసమే సాధువులపై దాడి: ప్రధాని మోదీ
కోల్‌కతా: బుజ్జగింపు రాజకీయాల కోసమే పశ్చిమబెంగాల్ తృణమూల్ (టీఎంసీ) గూండాలు సాధువులపై దాడులు చేస్తున్నారని ప్రధాని మోదీ అన్నారు. సోమవారం(మే20) పశ్చిమ బెంగాల్‌లోని జార్గ్రామ్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మోదీ మాట్లాడారు.‘టీఎంసీ గూండాలు రామకృష్ణ మిషన్‌పై దాడి చేశారు. ఇది చేసింది తామేనని టీఎంసీ ప్రకటించడం సిగ్గుచేటు. సీఎం రామకృష్ణ మిషన్, భారత్ సేవాశ్రమ్ మఠాల సాధువులను బెదిరిస్తున్నారు. ఆదివారం రాత్రి జల్పాయ్గురిలోని రామకృష్ణ మిషన్‌పై దాడి చేశారు.ఇలాంటి వాటిని బెంగాల్ ప్రజలు సహించరు. ఇస్కాన్, రామకృష్ణ మిషన్, భారత్ సేవాశ్రమ్ సంఘ్ సంస్థలు సేవ, విలువలకు నిదర్శనం, కానీ సీఎం మమతా బెనర్జీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం బహిరంగంగా వారిని బెదిరిస్తున్నారు’అని మోదీ మండిపడ్డారు.కాగా, ఓ ఎన్నికల ప్రచార ర్యాలీలో మాట్లాడుతూ రామకృష్ణ మిషన్, భారత్ సేవాశ్రమ్ సంస్థలకు చెందిన సాధువులు బీజేపీ ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తున్నారని మమతా బెనర్జీ విమర్శించారు. అయితే మమత వ్యాఖ్యలను రెండు సంస్థలకు చెందిన సాధువులు ఖండించారు. -
‘మమతా కూటమి నుంచి వెళ్లిపోయింది, ఆమె మాటలపై నమ్మకం లేదు’
లోక్‌సభ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్లో రాజకీయం రసవత్తరంగా మారింది. ప్రతిపక్ష ఇండియా కూటమిలో భాగమైన కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ మధ్య విభేధాలు రోజురోజకీ తారా స్థాయికి చేరుతున్నాయి. ముఖ్యంగా సీఎం మమతా బెనర్జీ. రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ అధిర్ రంజన్ చౌదరి మధ్య మాటలు తూటలు పేలుతున్నాయి.ఈ క్రమంలో తాజాగా మమతా బెనర్జీ మాట్లాడుతూ.. తాము(టీఎంసీ) ఇప్పటికీ ఇండియా కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్, సీపీఎంతో ఎలాంటి పొత్తు లేదని స్పష్టం చేశారు. కాగా లోక్‌సభ ఎన్నికల్లో కూటమి విజయం సాధిస్తే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బయట నుంచి తమ మద్దతు ఉంటుందని వెల్లడించిన మరుసటి రోజే మమతా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హంహల్దియాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో గురువారం మమతా బెనర్జీ మాట్లాడుతూ.. ‘ఓటర్లను విభజించడానికి కాంగ్రెస్, సీపీఎం ప్రయత్నిస్తున్నాయి. ఇక్కడ (బెంగాల్లో) వారికి ఓటు వేయకండి. రాష్ట్రంలో పొత్తు లేదు. కేవలం కేంద్రంలో మాత్రమే పొత్తు పెట్టుకున్నామని స్పష్టం చేస్తున్నాను. అలాగే కొనసాగుతాం. మేము ఇండియాలో భాగమే. దానికి మద్దతునిస్తూనే ఉంటాను. ఇందులో ఎలాంటి అపార్థం ఉండకూడదు’’ అని పేర్కొన్నారు.తాజాగా మమతా బెనర్జీ వ్యాఖ్యలపై బెంగాల్ కాంగ్రెస్ చీఫ్ అధిర్ రంజన్ చౌదరి మండిపడ్డారు. టీఎంసీ ఇండియా కూటమిలో భాగం కాదని, ఆమె మాటలను నమ్మవద్దని తెలిపారు. టీఎంసీ కూటమి నుంచి వెళ్లిపోయిందని, మమతా బెనర్జీ ఎప్పుడైనా బీజేపీ వైపు వెళ్లవచ్చని ఆరోపించారు.‘ఆమె కూటమికి బయట నుంచి, లోపల నుంచి నాకు చేస్తుందో తెలియదు. మీరే ఆమెను అడగాలి. కానీ నాకు ఆమెపై నమ్మకం లేదు.ఆమె కూటమిని విడిచిపెట్టింది. త్వరలో బీజేపీ వైపు ఆకర్షితులైన ఆశ్యర్యపోనవసరం లేదు.’ అని పేర్కొన్నారు. ఇండియా కూటమి బెంగాల్ కాంగ్రెస్‌ను లెక్క చేయదని అన్నారు. కూటమి గురించి ఆమెకు ఏమైనా ఫిర్యాదులు ఉంటే ఏర్పాటు సమయంలోనే లేవనెత్తాల్సి ఉండేదని అభిప్రాయపడ్డారు. -
ఇండియా కూటమి గెలిస్తే మద్దతిస్తాం: మమతా బెనర్జీ
కోల్‌కతా: లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తున్న తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఇండియా కూటమిపై కాస్త మెత్తబడినట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో ఇండియా కూటమి గెలిస్తే తాము బయటినుంచి మద్దతిస్తానని ప్రకటించారు. సీట్ల పంపకాలపై కాంగ్రెస్‌తో విభేదాలు తలెత్తడం వల్లే ఇండియా కూటమికి మమత దూరంగా ఉన్నారు. బుధవారం(మే15) కోల్‌కతాలో మమత మీడియాతో మాట్లాడారు. ‘మేము ఇండియా కూటమికి బయటినుంచి మద్దతిస్తాం. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తాం’అని తెలిపారు. కాగా, బెంగాల్లో కాంగ్రెస్, సీపీఎంలు బీజేపీ మద్దతిచ్చి తృణమూల్‌ను ఓడించాలని చూస్తున్నాయని మమత ఇటీవల విమర్శలు గుప్పించడం గమనార్హం. -
మమతా బెనర్జీ: రాజ్‌భవన్‌లో అడుగుపెట్టను
సప్తాగ్రామ్: పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆనంద బోసుపై టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు. మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న గవర్నర్ ఇంకా పదవిలో కొనసాగుతున్నారని మండిపడ్డారు. ఆయన ఎందుకు రాజీనామా చేయలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. శనివారం సప్తాగ్రామ్‌లో ఎన్నికల ప్రచారం మమతా బెనర్జీ మాట్లాడారు. గవర్నర్ పదవిలో ఆనంద బోసు కొనసాగినంత కాలం తాను రాజ్‌భవన్‌లో అడుగుపెట్టబోనని తేలి్చచెప్పారు. ఒకవేళ గవర్నర్‌ను కలవాలనుకుంటే వీధుల్లోనే కలుస్తానని అన్నారు. మహిళలపై వేధింపులకు గవర్నర్ సమాధానం చెప్పాలన్నారు. గత నెల 24న, ఈ నెల 2న గవర్నర్ ఆనంద బోసు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని రాజ్‌భవన్‌లో పనిచేసే ఓ మహిళా ఉద్యోగి గతవారం కోల్‌కతా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను తప్పు చేయలేదని గవర్నర్ అన్నారు. పూర్తి వీడియోలను గవర్నర్ బహిర్గతం చేయలేదని మమత ఆరోపించారు. -
గవర్నర్.. నీ దాదాగిరి పని చేయదు: మమతా బెనర్జీ
కోల్‌కతా: గవర్నర్ బోస్ ఎందుకు రాజీనామా చేయరో చెప్పాలని వెస్ట్‌బెంగాల్ సీఎం మమతాబెనర్జీ డిమాండ్ చేశారు. రాజ్‌భవన్‌లో మహిళా ఉద్యోగిపై గవర్నర్ లైంగిక వేధింపులకు పాల్పడడంపై శనివారం సప్తగ్రామ్లో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో మమత విమర్శలు గుప్పించారు. బోస్ గవర్నర్‌గా ఉన్నంతకాలం తాను రాజ్‌భవన్‌లో అడుగుపెట్టనని మమత స్పష్టం చేశారు.‘దీదీగిరి పనిచేయదని గవర్నర్ అంటున్నారు. కానీ గవర్నర్ నీ దాదాగిరి కూడా పనిచేయదు. లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన తర్వాత కూడా గవర్నర్ ఎందుకు రాజీనామా చేయరో చెప్పాలి. గవర్నర్ నీ ప్రవర్తన సిగ్గుచేటు’అని మమత అన్నారు. -
ఈవీఎంలపై మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు
కోల్‌కతా: లోక్‌సభ ఎన్నికల తొలి రెండు దశల పోలింగ్ శాతంపై మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమబెంగాల్లో బుధవారం(మే1) జరిగిన ఎన్నికల ప్రచార సభలో మమత ప్రసంగించారు. తొలి రెండు దశల పోలింగ్ ముగిసినపుడు ఒకటి ప్రకటించి తర్వాత ఏకంగా 5.75 శాతం పోలింగ్ పెరిగిందని ఎన్నికల కమిషన్(ఈసీ) ప్రకటించడమేంటని ప్రశ్నించారు. బెంగాల్లో జేపీకి ప్రతికూలంగా ఉన్న చోట్లలోనే పోలింగ్ శాతం పెరిగిందని చెప్పారు. పోలింగ్ శాతం ఒక్కసారిగా పెరగడంతో ఈవీఎంల విశ్వసనీయతపై అనుమానాలు వస్తున్నాయన్నారు. ఎన్నికల్లో గెలవడానికి బీజేపీ ఎంతకైనా దిగజారుతుందని ఆరోపించారు.పశ్చిమబెంగాల్లో సీపీఎం, కాంగ్రెస్‌లకు ఓటు వేయొద్దని మమత పిలుపునిచ్చారు. ఆ రెండు పార్టీలు బీజేపీ ఏజెంట్‌లేనన్నారు. టీఎంసీ ఓట్లు చీల్చి బీజేపీని గెలిపించడానికి ఆ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని మండపపడ్డారు. -
యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
కోల్‌కాతా: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ బెంగాల్ ముర్షిదాబాద్ జిల్లాలోని మైనారిటీల ప్రాబల్యం ఉన్న జంగీపూర్ నియోజకవర్గంలో జరిగిన ర్యాలీలో ముఖ్యమంత్రి 'మమతా బెనర్జీ' పాల్గొన్నారు. ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ)ని బీజేపీ రాజకీయ ఎత్తుగడగా ఉపయోగించుకుంటోంది. దీని వల్ల హిందువులకు ఎలాంటి ప్రయోజనం లేదని ఆమె అన్నారు.దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎన్నికల మొదటి, రెండో దశ ఓటింగ్ పూర్తయింది. ఈ దశలోనే బీజేపీ ఓటమి భయాన్ని పొందిందని మమతా బెనర్జీ అన్నారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ బీజేపీ మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టడానికి ఏదో ఒక అంశాన్ని ఉపయోగిస్తోంది. ఈసారి యూసీసీ గురించి మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ఇది ఒక వర్గానికి పూర్తిగా వ్యతిరేకమని అన్నారు.బీజేపీకి దేశవ్యాప్తంగా వ్యతిరేఖత ఏర్పడుతోందని మమతా బెనర్జీ అన్నారు. మొదటి రెండు దశల ఓటింగ్ తర్వాత ఇది స్పష్టంగా కనిపిస్తుంది. మిగిలిన ఐదు దశల్లో కూడా బీజేపీ ఓటమిని చవి చూస్తుందని బెనర్జీ అన్నారు. ఎన్నికల తరువాత రాబోయే ఫలితాలే దీన్ని చెబుతాయని అన్నారు. -
టీచర్లపై వేటు.. ఆ పార్టీలకు ఓటు వేయొద్దన్న సీఎం మమత
కోల్‌కతా: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, సీపీఐ, కాంగ్రెస్ పార్టీలకు ఎవరూ ఓటు వేయొద్దని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. ముఖ్యంగా టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులు ఆయా పార్టీలకు ఎట్టిపరిస్థితుల్లో ఒక్క ఓటు కూడా వేయద్దని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇటీవల ఉద్యోగాలు రద్దైన టీచర్లకు ఓ సందేశాన్ని పంపారు. హైకోర్టు తీర్పు అనంతరం తొలిసారి సీఎం మమతా స్పందించారు. ‘బీజేపీ హైకోర్టు కోర్టును కోనుగోలు చేసింది. సుప్రీం కోర్టును కాదు. నాకు ఇప్పటికే సుప్రీం కోర్టు న్యాయం లభిస్తుందని ఆశిస్తున్నా. బీజేపీ హైకోర్టును, సీబీఐ, ఎన్ఐఏ, బీఎస్ఎఫ్, సీఏపీఎస్ వంటి ప్రభుత్వం సంస్థలను కొనుగోలు చేసింది. దూరదర్శన్ ఛానెల్ కలర్ మార్చింది. ఛానెల్ వాళ్లు కేవలం బీజేపీ, మోదీ గుర్చించి మాత్రమే ప్రసారాలు చేస్తారు. దూరదర్శన్ ఛానెల్ చూడకండి. ఆ ఛానెల్‌ను బాయ్‌కాట్ చేయండి’ అని తీవ్ర ఆరోపణలు చేశారు.మరోవైపు.. టీచర్లకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పు.. బెంగాల్ లోక్‌సభ ఎన్నికల్లో కీలకంగా మారనుంది. ఇక.. 2019లో మొత్తం 42 స్థానాల్లో 18 సీట్లను గెలుపొందిన విషయం తెలిసిందే. ఇక.. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై టీచర్లు తీవ్ర నిరసన తెలిపారు. అవినీతికి పాల్పడిన కొంతమంది వల్ల వేలాది మంది అమాయక ఉపాధ్యాయులు, వారి కుటుంబాలు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన చేశారు.2016 నాటి స్టేట్ లెవల్ సెలెక్షన్ టెస్ట్ (SLST) చట్టబద్ధం కాదని జస్టిస్ దేబాంగ్సు బాసక్, జస్టిస్ ఎండీ షబ్బార్ రషీదిలతో కూడిన బెంచ్ ఇటీవల తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఎస్ఎల్ఎస్టీ 2016 ద్వారా భర్తీ చేసిన ఉద్యోగాలన్నింటినీ రద్దు చేయాలని, దీని కింద ఉద్యోగాలు పొందిన టీచింగ్, నాన్‌టీచింగ్ సిబ్బంది తాము తీసుకున్న జీతాలను 4 వారాల్లో వడ్డీతో సహా తిరిగిచ్చేయాలని కూడా కోల్‌కతా హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి విదితమే.ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లలో 9 నుంచి 12 వ తరగతులకు ఉపాధ్యాయులు, గ్రూప్ సీ, గ్రూప్ డీ ఉద్యోగాల భర్తీకి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 2016లో ఎస్ఎల్ఎస్టీ ద్వారా నియామక పరీక్ష నిర్వహించింది. అయితే ఈ పరీక్షలో అవకతవకాలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. -
కాంగ్రెస్‌పై మమతా బెనర్జీ సంచలన కామెంట్స్
కలకత్తా: ఎన్నికల ప్రచారంలో మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఆమె ఇండియా కూటమి పార్టీలు కాంగ్రెస్, వామపక్షాలపైనే విరుచుకుపడ్డారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీతో కలిసి కాంగ్రెస్, వామపక్షాలు తృణమూల్ కాంగ్రెస్‌పై కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. అసలు ఇండియా కూటమిని ఏర్పాటు చేసిందే తానని, కూటమికి ఇండియా అనే పేరు కూడా తానే పెట్టానన్నారు. ఇంత చేస్తే పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ బీజేపీ కోసం పనిచేస్తోందని మండిపడ్డారు. ‘రాష్ట్రంలో బీజేపీని ఓడించాలంటే కాంగ్రెస్,వామపక్షాలకు ఎవరూ ఓటు వేయకండి’అని మమత పిలుపునిచ్చారు. కాగా,లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమిలో భాగంగా తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీల మధ్య పశ్చిమబెంగాల్లో పొత్తు కుదరలేదు. సీట్ల పంపకం ఒప్పందం కుదరకపోవడం వల్లే ఒంటరిగా పోటీ చేయాల్సి వచ్చిందని తృణమూల్ ప్రకటించింది. ఇదీ చదవండి.. కోయంబత్తూరులో రూ.1000 కోట్లు.. బీజేపీ చీఫ్ సంచలన ఆరోపణలు -
కూటమి చిలుక 'పీకే'
సాక్షి, అమరావతి: తాను ఏ రాజకీయ పార్టీకీ ఎన్నికల వ్యూహకర్తగా పనిచేయడం లేదంటూ ప్రశాంత్ కిశోర్ (పీకే) వల్లె వేస్తున్న మాటల్లో వీసమెత్తు నిజం లేదని స్పష్టమైంది. ఏపీలో టీడీపీ–బీజేపీ కూటమికి పీకే ఎన్నికల వ్యూహకర్తగా పని చేస్తున్నట్లు పశ్చిమ బంగాల్ సీఎం మమతా బెనర్జీ వెల్లడించారు. ఈమేరకు బుధవారం టీవీ 9 బంగ్లా చానెల్‌కు మమతా బెనర్జీ ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘పీకే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ–బీజేపీ కూటమికి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తున్నారు. అందుకే ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబుకు, పశ్చిమ బెంగాల్లో బీజేపీకి అనుకూలంగా పీకే జోస్యం చెబుతున్నారు’ అని వెల్లడించారు. మమతా బెనర్జీ వ్యాఖ్యలను బట్టి పీకే చంద్రబాబు విసిరిన ప్యాకేజీ తీసుకుని టీడీపీకి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తున్నట్లు స్పష్టమవుతోంది. అందుకనే టీడీపీ గెలిచే అవకాశం ఉందంటూ చంద్రబాబుకు అవసరమైనప్పుడల్లా జోస్యం చెబుతున్నట్లు తేలిపోయింది. బాబు అరెస్టు తరువాత.. స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు అరెస్టు అనంతరం భయపడి ఢిల్లీలో తలదాచుకున్న సమయంలో నారా లోకేష్ పీకేను కలిశారు. తమకు ఎన్నికల వ్యూహకర్తగా పని చేయాలని వేడుకున్నారు. ఈక్రమంలో చంద్రబాబు బెయిల్‌పై విడుదలయ్యాక పీకేను ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు అక్కడి నుంచి విజయవాడకు సీఎం రమేష్ స్పెషల్ ఫ్లైట్‌లో లోకేష్ తీసుకొచ్చారు. ఉండవల్లిలోని తమ అక్రమ నివాసంలో చంద్రబాబుతో సమావేశం ఏర్పాటు చేశారు. అయితే అప్పుడు తాను ఏ పార్టీకీ వ్యూహకర్తగా పని చేయడం లేదని పీకే చెప్పారు. బిహార్‌లో కలసి రాకపోవడంతో.. బెంగాల్ ఎన్నికల తర్వాత 2021లో ఇక ఎన్నికల వ్యూహకర్తగా పని చేయనంటూ పీకే ప్రతినబూని ఐప్యాక్ నుంచి తప్పుకున్నారు. బిహార్‌లో రాజకీయ అరంగేట్రం చేశారు. తొలుత బిహార్ సీఎం నితీ‹Ùకుమార్ పంచన చేరి జేడీ(యూ) కీలక నేతగా చలామణి అయ్యారు. ఆపై నితీశ్‌తో విభేదించి సొంత పార్టీ స్థాపించి పాదయాత్ర చేసినా ఎలాంటి ప్రభావం చూపలేకపోయారు. దీంతో రాజకీయంగా బిహార్‌లో తన పప్పులు ఉడకవని గ్రహించిన పీకే డబ్బుల కోసం ఎవరు ప్యాకేజీ ఇస్తే వారికి అనుకూలంగా జోస్యం చెప్పేందుకు అలవాటుపడ్డారు. ఈ క్రమంలో చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీ తీసుకుంటూ టీడీపీకి అవసరమైనప్పుడల్లా ఆ పార్టీకి అనుకూలంగా జోస్యం చెబుతూ వస్తున్నారు. ఆ జోస్యాలన్నీ తప్పే.. అటు బిహార్‌లో రాజకీయంగా చెల్లక.. ఇటు ఇం‘ధనం’ లేక కొట్టుమిట్టాడిన పీకే తనకు ఎవరు ప్యాకేజీ ఇస్తే వారికి అనుకూలంగా జోస్యాలు చెప్పేందుకు అలవాటు పడ్డారు. గతేడాది చివరిలో తెలంగాణ, ఛత్తీస్గడ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం శాసనసభల ఎన్నికల్లోనూ పీకే జోస్యాలు చెప్పారు. తెలంగాణలో బీఆర్ఎస్ గెలుస్తుందని పీకే చెబితే చివరకు అక్కడ కాంగ్రెస్ గెలిచింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్ గెలుస్తుందని పీకే ఢంకా భజాయిస్తే ఆ మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీ గెలిచింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోనూ పీకే జోస్యం తప్పడం ఖాయమని, గత ఎన్నికల్లో టీడీపీ తరపున వకాల్తా తీసుకున్న లగడపాటి మాదిరిగానే ప్రశాంత్ కిశోర్ కూడా ఫలితాలు వెలువడ్డాక మాయం కావడం తథ్యమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బాబు సేవలో ‘పీకే’ ఏపీ రాజకీయాల్లో తలమునకలు బెంగాల్ సీఎం మమత వెల్లడి సాక్షి, న్యూఢిల్లీ: రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఏపీలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి గెలుపు కోసం కృషి చేస్తున్నట్లు పశ్చిమ బంగ సీఎం మమతా బెనర్జీ వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల్లో ఆయన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయడం లేదన్నారు. ఐప్యాక్ సంస్థకు చెందిన ప్రతీక్ జైన్, ఆయన బృందం తమకు వ్యూహకర్తలుగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో తలమునకలై ఉన్నట్లు చెప్పారు. ఆయన టీడీపీ, బీజేపీల కోసం పనిచేస్తున్నారన్నారు. తాజాగా బెంగాల్ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్యూలో మమతా ఈ విషయాలను వెల్లడించారు. పీకే బీజేపీకి అనుకూలంగా ఉన్నారు కాబట్టే ఎన్డీఏ కూటమి మళ్లీ విజయం సాధిస్తుందంటూ పదే పదే చెబుతున్నారని వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్ వెలుపల ఆయన ప్రభావం, ప్రమేయం పెద్దగా లేదన్నారు. -
‘తృణమూల్’ మేనిఫెస్టో రిలీజ్.. కీలక హామీలివే..
కలకత్తా: లోక్‌సభ ఎన్నికల కోసం తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) మేనిఫెస్టో విడుదల చేసింది. మేనిఫెస్టోలో టీఎంసీ పశ్చిమబెంగాల్ ప్రజలకు 10 హామీలిచ్చింది. బీజేపీ ప్రధాన హామీలైన సీఏఏ, యూనిఫామ్ సివిల్ కోడ్లతో పాటు ఎన్ఆర్సీలను బెంగాల్లో అమలు చేయబోమని మేనిఫెస్టోలో తెలిపింది. పేద కుటుంబాలకు ఉచితంగా ఏడాదికి 10 వంట గ్యాస్ సిలిండర్లు, పేద కుటుంబాలకు ఉచిత ఇల్లు, రేషన్‌కార్డుదారులకు ఇంటి వద్దే రేషన్, పెట్రోలియం ఉత్పత్తుల ధరల స్థిరీకరణకు ప్రత్యేక ఫండ్ ఏర్పాటు లాంటి హామీలు టీఎంసీ మేనిఫెస్టోలో ఉన్నాయి. మేనిఫెస్టో విడుదల సమయంలో టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ అస్సాంలో పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘ఇండియా కూటమి అధికారంలోకి వస్తే సీఏఏ, ఎన్ఆర్సీలను రద్దు చేస్తాం. మళ్లీ నరేంద్రమోదీ అధికారంలోకి వస్తే దేశంలో ప్రజాస్వామ్యం, ఎన్నికలు ఉండవు. ఇంత ప్రమాదకర ఎన్నికలను నేనుఎప్పుడూ చూడలేదు. బీజేపీ దేశం మొత్తాన్ని డిటెన్షన్ క్యాంపుగా మార్చేసింది’అన్నారు. కాగా, బెంగాల్లో ఏప్రిల్ 19న తొలి దశ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇదీ చదవండి.. బీజేపీ 150 సీట్లకే పరిమితం.. రాహుల్ -
ప్రధాని మోదీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు!
దేశంలో ఈరోజు శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది. ప్రధాని మోదీ దేశ ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రజల్లో అణువణువునా శ్రీరాముడు కొలువైవున్నాడని అన్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా శ్రీ రామ నవమి సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరామ నవమి సందర్భంగా ప్రధాని మోదీ.. సోషల్ సైట్ ఎక్స్‌లో.. 'దేశవ్యాప్తంగా ఉన్న నా కుటుంబ సభ్యులకు శ్రీ రాముని జన్మదినోత్సవ శుభాకాంక్షలు. ఈ శుభ సమయంలో నా హృదయం భావోద్వేగంతో, కృతజ్ఞతతో నిండిపోయింది. ఈ సంవత్సరం లక్షలాది దేశప్రజల ఆకాంక్ష నెరవేరడాన్ని చూశాను. ఐదు శతాబ్దాల నిరీక్షణ తర్వాత ఈరోజు అయోధ్యలో శ్రీరామనవమిని ఘనంగా జరుపుకునే భాగ్యం మనకు లభించింది’ అని పేర్కొన్నారు. राम भारत की आस्था है, राम भारत का आधार है... pic.twitter.com/iyZm0ponNm — Narendra Modi (@narendramodi) April 17, 2024 అమిత్ షా కూడా శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు ‘జై శ్రీరామ్.. అందరికీ పవిత్రమైన శ్రీరామ నవమి పండుగ శుభాకాంక్షలు. మర్యాద పురుషోత్తముదైన శ్రీరాముడు తన జీవితంతో సత్యం, త్యాగం తదితర విలువలతో అత్యున్నత ఆదర్శాన్ని స్థాపించాడు. యావత్ ప్రపంచానికి మార్గనిర్దేశం చేసేందుకు కృషి చేశాడు. 500 ఏళ్ల తర్వాత ఈ ఏడాది స్వామి జన్మదినోత్సవాన్ని ఆయన జన్మస్థలంలో జరుపుకోవడం రామభక్తులందరికీ గర్వకారణం. అందరి క్షేమం కోరుతూ శ్రీరాముణ్ణి ప్రార్థిస్తున్నాను’ అని పేర్కొన్నారు. The first Ram Navami after the Pran Pratishtha in Ayodhya is a generational milestone, weaving together centuries of devotion with a new era of hope and progress. This is a day crores of Indians waited for. Innumerable people devoted their lives to this sacred cause. May the… pic.twitter.com/2aJMLn1hhI — Narendra Modi (@narendramodi) April 17, 2024 -
‘దీదీ’ ఫైర్.. ‘‘చాయ్‌కు బదులు అది తాగమంటారేమో..!’’
కలకత్తా: లోక్‌సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ సమీపించిన వేళ పశ్చిమబెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత బీజేపీపై మాటల దాడి పెంచారు. కూచ్‌బెహార్‌లో సోమవారం(ఏప్రిల్15) జరిగిన ఎన్నికల ప్రచార సభలో మమత మాట్లాడారు. ఆర్జేడీ నేత తేజస్వియాదవ్ నవరాత్రుల్లో చేపలు తినడంపై విమర్శిస్తున్న బీజేపీ నేతలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. బీజేపీని అధికారంలో నుంచి దించకపోతే దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందన్నారు. ‘మనం ఏం తినాలో, ఎలా పడుకోవాలో బీజేపీ వాళ్లే నిర్ణయిస్తారు. వాళ్లను ఇలాగే వదిలేస్తే రోజూ ఉదయం చాయ్‌కు బదులు గో మూత్రం తాగమంటారు. భోజనానికి బదులు ఆవు పేడ తినమంటారు. ఒకవేళ బీజేపీ మళ్లీ పవర్లోకి వస్తే భవిష్యత్తులో ఎన్నికలే ఉండవు. వాళ్లకు వన్ లీడర్, వన్ నేషన్, వన్ భోజన్, వన్ భాషన్ కావాలి’అని మమత విరుచుకుపడ్డారు. పశ్చిమబెంగాల్లో తొలి దశ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 19న జరగనుంది. ఇదీ చదవండి.. కుటుంబ రాజకీయాలకు స్వస్తి చెప్పండి -
బీజేపీకి 200 సీట్లు కూడా రావు
జల్పాయ్గురి: సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి కనీసం 200 సీట్లు కూడా రావని పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ప్రధాని మోదీ ఇస్తున్న గ్యారంటీలన్నీ బూటకమని కొట్టిపారేశారు. శనివారం జల్పాయ్గురిలో ఎన్నికల ప్రచార సభలో ఆమె ప్రసంగించారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని బీజేపీ ప్రభుత్వం ధ్వంసం చేసిందని మండిపడ్డారు. దేశాన్ని అమ్మేసే కుట్రలు సాగించారన్నారు. ప్రధాని మోదీ చెబుతున్న కల్ల»ొల్లి మాటలు నమ్మొద్దని ప్రజలను కోరారు. ఆయన ఇస్తున్న గ్యారంటీల వలలో పడొద్దని సూచించారు. బెంగాల్లో 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 200కుపైగా సీట్లు గెలుచుకుంటామని బీజేపీ నేతలు గొప్పలు చెప్పారని, చివరకు 70 సీట్లే వచ్చాయని గుర్తుచేశారు. -
‘రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్’ నిందితుల అరెస్టు.. స్పందించిన ‘దీదీ’
కలకత్తా: పశ్చిమ బెంగాల్ సురక్షిత ప్రాంతం కాదన్న బీజేపీ నేతల వ్యాఖ్యలపై సీఎం మమతా బెనర్జీ ఘాటుగా స్పందించారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, బిహార్ సురక్షితమా అని బీజేపీ నేతలను ఆమె ప్రశ్నించారు. కూచ్‌బెహార్‌లో శుక్రవారం(ఏప్రిల్ 12) జరిగిన లోక్‌సభ ఎన్నికల ప్రచార ర్యాలీలో మమత మాట్లాడారు. ‘బీజేపీకి ఒక ప్రొపగాండా స్పెషలిస్ట్ ఉన్నాడు. రామేశ్వరం కేఫ్ పేలుడు జరిగింది బెంగళూరులో. నిందితులు కర్ణాటకకు చెందిన వారు. బెంగాల్ వాసులు కాదు. వారు పారిపోయి వచ్చి బెంగాల్లో దాక్కున్నారంతే. అయినా మేం వారిద్దరినీ కేవలం రెండు గంటల్లోనే పట్టుకున్నాం’అని మమత తెలిపారు. కాగా, బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుడు నిందితులను ఎన్ఐఏ బెంగాల్లో శుక్రవారం అరెస్టు చేసింది. దీంతో బెంగాల్ ఉగ్రవాదులకు స్వర్గధామం అని బీజేపీ బెంగాల్ కో ఇంఛార్జ్ అమిత్ మాలవీయ, బెంగాల్ బీజేపీ శాసనసభాపక్ష నేత సువేందు అధికారి పోస్టు చేశారు. ఈ పోస్టులపై మమత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇదీ చదవండి.. రామేశ్వరం పేలుడు.. ఇద్దరు నిందితుల అరెస్టు -
kolkata: ‘ఎన్ఐఏ’ బృందంపై దాడి.. ‘దీదీ’ కీలక వ్యాఖ్యలు
కలకత్తా: పశ్చిమబెంగాల్ మేదినీపూర్‌లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) పోలీసులపై శుక్రవారం(ఏప్రిల్ 5) అర్ధరాత్రి స్థానికులు ఇటుకలు, రాళ్లతో దాడి చేసిన ఘటనపై సీఎం మమతాబెనర్జీ స్పందించారు. ‘అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చెప్పాపెట్టకుండా వస్తే ఏం చేయాలో మేదినిపూర్ భూపతినగర్ వాసులు కూడా అదే చేశారు. అసలు అర్ధరాత్రి అక్కడికి వెళ్లేందుకు ఎన్ఐకు అనుమతి ఉందా. ఎన్ఐఏకు ఏం అధికారం ఉందని ఇలాంటివి చేస్తున్నారు. బీజేపీకి మేలు చేసేందుకే ఇదంతా చేస్తున్నారు. బీజేపీ నీచ రాజకీయాలపై అందరూ కలిసి పోరాడాలి’ అని మమత పిలుపునిచ్చారు. కాగా,2022 బాంబు పేలుడు కేసు దర్యాప్తు నిమిత్తం భూపతినగర్ వెళ్లిన ఎన్ఐఏ పోలీసులపై స్థానికులు మూకుమ్మడిగా దాడికి దిగారు. బాంబు పేలుడు కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి కలకత్తా వెళుతుండగా ఈ దాడి జరిగిందని ఎన్ఐఏ అధికారి ఒకరు తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌కు సమాచారమిచ్చిన తర్వాతే తాము అక్కడికి వెళ్లామని చెప్పారు. ఎన్ఐఏ పోలీసులపై దాడి అత్యంత దారుణ ఘటన అని బెంగాల్ బీజేపీ ఖండించింది. ఇది తృణమూల్ కాంగ్రెస్ గూండాల పనేనని బీజేపీ నేతలు ఆరోపించారు. బాంబు పేలుళ్ల కేసు దర్యాప్తును తృణమూల్ అడ్డుకోవాలని చూస్తోందన్నారు. ఇదీ చదవండి.. తృణమూల్ కాంగ్రెస్ ఆ పార్టీకి కాపీ -
ప్రచార వేడి.. ప్రధాని మోదీపై ‘దీదీ’ సంచలన వ్యాఖ్యలు
కలకత్తా: పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీపై విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. తనదైన శైలిలో కేంద్ర ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించారు. సందేశ్‌ఖాలీ వివాదంపై ప్రధాని తాజాగా ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన మాటలకు దీదీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘పదే పదే సందేశ్‌ఖాలీ ఆందోళనలపై మాట్లాడుతున్న ప్రధానికి దేశంలో ఇతర ప్రాంతాల్లో మహిళలు, దళితులు, ముస్లింలపై జరుగుతున్న దాడులు కనిపించడం లేదు. ఆయన కుంభకర్ణుని తరహాలో నిద్ర పోతున్నారు. సందేశ్‌ఖాలీ ఆందోళనలపై మా ప్రభుత్వం సరైన రీతిలో స్పందించి చర్యలు తీసుకుంది’అని మమత తెలిపారు. కాగా, టీఎంసీ నేత షేక్ షాజహాన్ సందేశ్‌ఖాలీలో తమపై లైంగిక దాడులు చేసి వారి భూములు లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారని అక్కడి మహిళలు ఆందోళన బాట పట్టారు. ఈ ఆందోళనలకు కారణమైన షేక్ షాజహాన్‌ను సీబీఐ ఇప్పటికే అరెస్టు చేసింది. సందేశ్‌ఖాలీ ఆందోళనలకు నేతృత్వం వహించిన రేఖా పత్రకు బీజేపీ ఇప్పటికే లోక్‌సభ ఎన్నికల్లో టికెట్ కేటాయించింది. మరోపక్క టీఎంసీ షేక్ షాజహాన్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. బెంగాల్లో తొలి దశ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 19న జరగనుంది. రాష్ట్రంలోని 42 ఎంపీ సీట్లకు మొత్తం ఏడు దశల్లో పోలింగ్ జరగనుంది. ఇదీ చదవండి.. పామునైనా నమ్మగలం కానీ.. మమత -
పామునైనా నమ్మగలం గానీ..: మమత
కూచ్‌బెహార్/మాల్బజార్: ఎన్నికల ప్రవర్తనా నియమావళిని బీజేపీ పాటించడం లేదని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. విష పూరిత పామునయినా నమ్మొచ్చేమోగానీ, కాషాయదళాన్ని మాత్రం విశ్వసించరాదన్నారు. ఆవాస్ యోజన కింద పేర్లు నమోదు చేసుకోవాలని కేంద్రం కోరితే గుడ్డిగా నమ్మొద్దని ప్రజలను కోరారు. బీజేపీ దేశాన్ని నాశనం చేస్తోందని మండిపడ్డారు. బీజేపీకి ఒకే దేశం, ఒకే పార్టీ సిద్ధాంతంపై మాత్రమే నమ్మకం ఉందని వ్యాఖ్యానించారు. దర్యాప్తు సంస్థలతోపాటు బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్లు కూడా కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లోనే పనిచేస్తున్నాయని ఆరోపించారు. ఇటువంటి వాటికి తాము తలొంచబోమని తెగేసి చెప్పారు. అన్ని పార్టీలనూ సమానంగా చూడాలని ఈసీని కోరతామన్నారు. -
సందేశ్‌ఖాలీ హింస.. దీదీ సర్కార్‌పై హైకోర్టు ఆగ్రహం
సందేశ్‌ఖాలీ వ్యవహారంపై సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై కలకత్తా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సందేశ్‌ఖాలీలో జరిగిన ఘటన అత్యంత సిగ్గుచేటని పేర్కొంది. ఈ మేరకు సందేశ్‌ఖాలీ హింసపై దాఖలైన పిటిషన్లను గురువారం విచారణ చేపట్టింది. సందేశ్‌ఖాళీ భూఆక్రమణ, లైంగిక ఆరోపణలపై దర్యాప్తు జరపాలంటూ దాఖలైన అఫిడవిట్లో పేర్కొన్న ఒక్క విషయం నిజమైనా, అందులో ఒక శాతం వాస్తవమున్నా అది సిగ్గుచేటని పేర్కొంది. రాష్ట్రంలో పౌరుల భద్రతకు ముప్పు కలిగితే 100 శాతం ప్రభుత్వ బాధ్యతేనని తెలిపింది. దీనికి అధికార పార్టీ, స్థానిక యంత్రాంగం అందుకు పూర్తి నైతిక బాధ్యత వహించాలని చీఫ్ జస్టిస్ టిఎస్ శివజ్ఞానం నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. అంతేగాక ఈ కేసులో నిందితుడైన షేక్ షాజహాన్ తరపున హాజరైన న్యాయవాదిపై సైతం చీఫ్ జస్టిస్ మండిపడ్డారు. ‘విచారణలో ఉన్న నిందితుడి తరుపున హాజరువుతున్నారు. ముందు మీరు మీ చుట్టూ అలుముకున్న చీకటిని తొలగించండి. తరువాత మీ వాయిన్‌ను వినిపించడండి.’ అని మందలించారు. కాగా జనవరి 5న ఈడీ అధికారులపై దాడికి సంబంధించిన కేసులో అరెస్టు నుంచి తప్పించుకునేందుకు షాజహాన్ షేక్ కొంతకాలంపాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. 55 రోజుల పాటు షాజహాన్ పరారీలో ఉండడంపై కోర్టు అసహనం వ్యక్తంచేసింది. కాగా ఫిబ్రవరి నెలలో పోలీసులు అతడిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆలస్యంగా అరెస్ఠ్ చేయడంపై బెంగాల్ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. నార్త్ 24 పరిగణాల జిల్లాలోని సందేశ్‌ఖాలీ ఇటీవల తరుచూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. స్థానిక టీఎంసీ నేత షేక్ షాజహాన్, అతడి అనుచరులు అక్కడి మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడటమే కవాకుండా వారి భూములను బలవంతంగా లాక్కున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఘటన అధికార టీఎంసీ, బీజేపీ మధ్య రాజకీయ వివాదానికి దారి తీసింది. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు చెలరేగాయి. చదవండి: ఎన్నికల వేళ.. వంద కోట్ల ఇల్లీగల్ లిక్కర్ పట్టివేత? -
‘400 సరే.. 200 సీట్లలో గెలవమనండి’.. బీజేపీకి దీదీ సవాల్
ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో 400 పై చీలూకు స్థానాల్లో గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీకి పశ్చిమ బెంగాల్ సీఎం, తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ సవాల్ విసిరారు. కనీసం 200 లోక్‌సభ స్థానాల్లో గెలిచి చూపించాలని ఛాలెంజ్ చేశారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తల గాయం నుంచి కోలుకున్న మమతా బెనర్జీ అనంతరం తొలిసారి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. వివాదాస్పద మహిళా నేత, పశ్చిమ బెంగాల్ కృష్ణానగర్ లోక్‌సభ టీఎంసీ అభ్యర్ధి మహువా మొయిత్రా తరుపున ప్రచారం చేశారు. ఈ ఎన్నికల ర్యాలీలో ‘బీజేపీ 400కి పైగా లోక్‌సభ స్థానాల్లో గెలుస్తామని అంటోంది. ముందుగా 200 సీట్ల బెంచ్‌మార్క్‌ను దాటాలని నేను బీజేపీకి సవాలు చేస్తున్నాను. 2021 పశ్చిమ బెంగాల్ 294 అసెంబ్లీ స్థానాలకు గాను 200పైగా సీట్లు గెలుస్తామని బీజేపీ ప్రగల్భాలు పలికింది. కానీ 77 సీట్లతో సరిపెట్టుకుందని’ ఎద్దేవా చేశారు. #InPics | West Bengal chief minister Mamata Banerjee, along with TMC leader Mahua Moitra, holds a poll rally in Krishnanagar.#ElectionsWithNDTV #LokSabhaElection2024 pic.twitter.com/4iuTTL203Q — NDTV (@ndtv) March 31, 2024 సీఏఏని అనుమతించబోం ‘పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) చట్టబద్ధమైన పౌరులను విదేశీయులుగా మార్చేందుకు ఒక ఉచ్చు. అందుకే రాష్ట్రంలో మేం సీఏఏని అనుమతించబోం. సీఏఏ కోసం దరఖాస్తు చేయడం వల్ల దరఖాస్తుదారు విదేశీయులుగా మారతారని, కాబట్టి దరఖాస్తు చేసుకోవద్దని ప్రజల్నిహెచ్చరించారు. బీజేపీని వ్యతిరేకించినందునే టీఎంసీ అభ్యర్థి మహువా మోయిత్రాకు మద్దతుగా కృష్ణానగర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆమె మాట్లాడుతూ.. ‘మా ఎంపీ మహువా మొయిత్రా బీజేపీకి వ్యతిరేకంగా గళం విప్పినందున ఆమెను లోక్‌సభ నుండి బహిష్కరించారు’ అని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. కాంగ్రెస్ కోసం పనిచేస్తున్న బీజేపీ ఈ సందర్భంగా విపక్షాల ఇండియా కూటమిపై మమతా బెనర్జీ మండి పడ్డారు. ‘పశ్చిమ బెంగాల్లో ఇండియా కూటమి లేదు. రాష్ట్రంలో సీపీఐ, కాంగ్రెస్ కూటములు బీజేపీ కోసమే పనిచేస్తున్నాయి’ అని అన్నారు. -
Kolkata: ‘దీదీ’పై బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
కలకత్తా: పశ్చిమబెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతాబెనర్జీపై బీజేపీ నేత దిలీప్‌ఘోష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బెంగాల్ కూతురునని చెప్పుకుంటున్న మమతాబెనర్జీ తన తండ్రి ఎవరో ముందు డిసైడ్ చేసుకోవాలన్నారు. దిలీప్‌ఘోష్ చేసిన ఈ వ్యాఖ్యల వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ‘మమత గోవా వెళ్లి గోవా బిడ్డనంటుంది. త్రిపుర వెళ్లి త్రిపుర బిడ్డనంటుంది. అసలు తన తండ్రి ఎవరో ముందు మమత ముందు నిర్ణయించుకోవాలి’ అని ఘోష్ వ్యాఖ్యానించారు.ఘోష్ వ్యాఖ్యలపై తృణమూల్ కాంగ్రెస్ నేతలు ఫైర్ అయ్యారు. గతంలో దుర్గా మాతపై, ఇప్పుడు మమతా బెనర్జీపై ఘోష్ దిగజారుడు వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలు నైతికంగా ఆయన దివాళాకోరుతనానికి నిదర్శనమన్నారు. కాగా, 2021లో జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ వాడిన ‘బెంగాల్ వాంట్స్ టు గో విత్ డాటర్’ నినాదం బాగా పాపులర్ అయింది. ఆ ఎన్నికల్లో తృణమూల్ ఘన విజయం సాధించింది. ఇదీ చదవండి.. అందుకే వరుణ్‌గాంధీని బీజేపీ పక్కకు పెట్టింది -
ట్యాపింగ్ వీరుడు.. డేటా చోరుడు.. బాబే
సాక్షి, అమరావతి : ఈ ఎన్నికల్లో టీడీపీ ఓటమి ఖాయమని తేలిపోవడంతో ఈనాడు రామోజీరావు బెంబేలెత్తుతున్నారు. అందుకే టీడీపీ ఓటమికి ఇప్పటి నుంచే కుంటిసాకులు వెతికే పనిలో పడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం టీడీపీ నేతల ఫోన్లు ట్యాపింగ్ చేస్తోందంటూ చిత్తకార్తి రాతలు రాస్తూ వైఎస్సార్సీపీపై దుష్ప్రచార కుట్రకు తెరతీశారు. పచ్చ పైత్యం సోకి రామోజీరావుకు ఉద్దేశపూర్వక మతిమరుపు వచ్చిందేమోగానీ... రాష్ట్ర ప్రజలకు మాత్రం అన్నీ గుర్తున్నాయి. రాష్ట్రంలో 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు ప్రభుత్వం ఫోన్ల ట్యాపింగ్‌కు పాల్పడటం, ఓటర్ల వ్యక్తిగత డేటా చౌర్యానికి బరితెగించడం అంతా ప్రజలకు గుర్తుంది. ఫోన్ల ట్యాపింగ్ కోసం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు ఇజ్రాయెల్ వెళ్లి మరీ అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ సాఫ్ట్‌వేర్‌ను కొన్నారన్నది బహిరంగ రహస్యమే. చంద్రబాబు బాగోతాన్ని శాసన సభ ఉప సంఘం కూడా నిగ్గు తేల్చింది. మరోవైపు చంద్రబాబు పెగసస్ కంపెనీ నుంచి ఫోన్ ట్యాపింగ్ సాఫ్ట్వేర్ కొన్నారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీనే స్వయంగా ఆ రాష్ట్ర శాసన సభలో వెల్లడించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏ పోలీసు అధికారీ ఇజ్రాయెల్ వెళ్లలేదు. ఎలాంటి సాఫ్ట్వేర్ కొనలేదు. వీటన్నింటినీ మరుగున పరుస్తూ వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడమే ధ్యేయంగా ఈనాడులో ఓ కట్టుకథ రాశారు. అసలు వాస్తవాలేమిటంటే... ట్యాపింగ్ చరిత్ర బాబుదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఫోన్ ట్యాపింగ్ అనే జాడ్యానికి ఆద్యుడు చంద్రబాబే. 2004 ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడేందుకు అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన ప్రతిపక్ష నేతల ఫోన్ల ట్యాపింగ్ కోసం ఏకంగా ఓ వ్యవస్థను ఏర్పాటు చేశారు. అప్పటి ఇంటెలిజెన్స్ విభాగంలో ఓ కీలక అధికారిని, మరో పోలీసు ఉన్నతాధికారిని అందుకోసం ప్రత్యేకంగా నియమించారు. ప్రతిపక్ష నేత నుంచి ప్రతిపక్ష పార్టీల అభ్యర్థుల వరకూ అందరి ఫోన్ల ట్యాపింగ్‌కు పాల్పడ్డారు. ఆ కుట్రలో భాగస్వామి అయిన ఆ పోలీసు ఉన్నతాధికారికి 2014లో చంద్రబాబు మళ్లీ సీఎం అయిన తరువాత రాష్ట్ర పోలీస్ బాస్‌గా పోస్టింగ్ ఇచ్చారు కూడా. భద్రతా చట్టాలను ఉల్లంఘించి మరీ పెగసస్ సాఫ్ట్వేర్ కొన్న చంద్రబాబు రాష్ట్ర విభజన తరువాత 2014లో ఆంధ్రప్రదేశ్‌కు సీఎం అయిన చంద్రబాబు మరోసారి ఫోన్ ట్యాపింగ్ అక్రమాలకు పాల్పడ్డారు. ప్రధానంగా తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు కోట్లు వ్యవహారంలో ‘మా వాళ్లు బ్రీఫ్డ్ మీ’ అంటూచంద్రబాబు అడ్డంగా దొరికిపోయారు. రాత్రికి రాత్రే విజయవాడకు మకాం మార్చేశారు. ఇక్కడ ఆయన మరోసారి ఫోన్ ట్యాపింగ్‌పై దృష్టి సారించారు. అందుకోసం అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు నేతృత్వంతో ప్రత్యేకంగా ఓ వ్యవస్థను ఏర్పాటు చేశారు. వైఎస్సార్సీపీ నేతల ఫోన్లు ట్యాపింగ్‌తోపాటు ఓటర్ల జాబితాలో అక్రమాలకు పాల్పడటం ఆ వ్యవస్థ లక్ష్యం. ఐటీ గ్రిడ్స్ అనే ప్రైవేటు కంపెనీ, అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు కుమారుడు కూడా భాగస్వామిగా ఉన్న ఆకాశ్ ఎంటర్‌ప్రైజస్ కంపెనీల ద్వారా ఏరోస్టాట్ బెలూన్లు, ఇతర ఫోన్ ట్యాపింగ్ సాఫ్ట్వేర్ కొనుగోలుకు పెగసస్‌తో సంప్రదింపులు జరిపారు. అందుకోసం ఏబీ వెంకటేశ్వరరావు బృందం ఇజ్రాయెల్‌లో పర్యటించింది. పెగసస్ సంస్థతో సంప్రదింపులు జరిపింది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం విదేశీ కంపెనీల నుంచి ఫోన్ ట్యాపింగ్ సాఫ్ట్వేర్ కొనాలంటే రక్షణ శాఖ అనుమతి తప్పనిసరి. ఫోన్ ట్యాపింగ్ సాఫ్ట్వేర్ ఉగ్రవాద సంస్థలకు చిక్కితే దేశంలో విధ్వంసకర కార్యకలాపాలకు పాల్పడే అవకాశం ఉన్నందువల్ల దేశ భద్రత దృష్ట్యా ఈ నిబంధన విధించారు. కానీ, జాతీయ భద్రత చట్టాన్ని చంద్రబాబు ప్రభుత్వం ఉల్లంఘించింది. రక్షణ శాఖకు సమాచారం ఇవ్వకుండానే పెగసస్ కంపెనీతో సంప్రదింపులు జరిపింది. ఐటీ గ్రిడ్స్ కంపెనీ ద్వారా ఫోన్ ట్యాపింగ్ పరికరాలను కొనుగోలు చేసి దిగుమతి చేసుకుంది. అందుకోసం నిధులు కూడా చెల్లించింది. రూ.25 కోట్లతోచంద్రబాబు పెగసస్ సాఫ్ట్వేర్ కొన్నారు: మమత ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం రూ.25 కోట్లు వెచ్చించి పెగసస్ నుంచి అక్రమంగా ఫోన్ ట్యాపింగ్, డేటా చౌర్యం సాఫ్ట్వేర్ కొన్నారని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్వయంగా ప్రకటించడం జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించింది. 2022లో పశ్చిమ బెంగాల్ శాసనసభలో ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ డేటా చౌర్యం సాఫ్ట్వేర్ కొనాలని పెగసస్ కంపెనీ ప్రతినిధులు తనను సంప్రదించారని వెల్లడించారు. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం ఆ సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేసిందని, మీరు కూడా కొనాలంటూ ఆ సంస్థ ప్రతిపాదించిందని తెలిపారు. చట్ట విరుద్ధమైన ఆ పనిని తాను చేయలేనని తిరస్కరించానని మమతా బెనర్జీ చెప్పారు. ఇవన్నీ చంద్రబాబు కుతంత్రాలను బయటపెట్టే వాస్తవాలు. వీటిని ఏనాడూ ప్రశ్నించని రామోజీరావు.. ఇప్పుడు మాత్రం వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఫోన్ల ట్యాపింగ్‌కు పాల్పడకపోయినా, ఓ అసత్య కథనాన్ని ప్రజల్లోకి వదిలి, టీడీపీ ఓటమికి ఓ కుంటిసాకును సిద్ధం చేసుకున్నారు. యథేచ్ఛగా ఫోన్ ట్యాపింగ్..35 లక్షల మందిడేటా చౌర్యం అక్రమంగా కొన్న ఫోన్ ట్యాపింగ్, డేటా చౌర్యం సాఫ్ట్‌వేర్‌తో చంద్రబాబు ప్రభుత్వం బరితెగించింది. అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌తోపాటు వైఎస్సార్సీపీకి చెందిన 65 మంది నేతల ఫోన్ల ట్యాపింగ్‌కు పాల్పడింది. దీనిపై పూర్తి ఆధారాలతో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అప్పట్లోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2019 ఎన్నికలకు ముందు వివిధ కేసుల దర్యాప్తు ముసుగులో ఏకంగా వైఎస్సార్సీపీకి చెందిన 150 మంది ఫోన్లను ట్యాప్ చేయడం చంద్రబాబు దుర్మార్గ రాజకీయాలకు నిదర్శనం. మరోవైపు చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన ప్రజా సాధికార సర్వే ద్వారా సేకరించిన ఓటర్ల డేటా (సమాచారం) మొత్తాన్ని టీడీపీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసం రూపొందించిన ‘సేవా మిత్ర’ యాప్‌కు అనుసంధానించారు. రాష్ట్రంలోని ఓటర్ల వ్యక్తిగత సమాచారం చౌర్యానికి పాల్పడ్డారు. మరోవైపు టీడీపీ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉన్న 35 లక్షల మంది పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించేందుకు కుట్ర పన్నారు. ఈ కుట్రకు వ్యతిరేకంగా అప్పట్లోనే వైఎస్సార్సీపీ ఆందోళనలు చేసింది. పోలీసులు, కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల కమిషన్‌కు పూర్తి ఆధారాలతో ఫిర్యాదులు చేసింది. నిగ్గు తేల్చిన శాసనసభ ఉప సంఘం వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ ప్రభుత్వ డేటా చౌర్యంపై విచారణకు సభా సంఘాన్ని నియమించింది. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి నేతృత్వంలోని ఈ కమిటీ హోం, ఆర్థిక, సమాచార–పౌర సంబంధాల శాఖలకు చెందిన పలువురు ఉన్నతాధికారులను విచారించింది. అప్పటి సీఎం చంద్రబాబు ఆదేశాలతోనే తాము ఓటర్ల వ్యక్తిగత సమాచారాన్ని టీడీపీ సేవామిత్ర యాప్‌నకు బదిలీ చేశామని ఆ ఉన్నతాధికారులు వెల్లడించారు. ఇజ్రాయెల్ నుంచి ఫోన్ ట్యాపింగ్, డేటా చౌర్యం సాఫ్ట్‌వేర్‌ను అక్రమంగా కొన్న మాట వాస్తవమేనని, అందుకే ఆ దేశంలో పర్యటించామని తెలిపారు. ఈ వ్యవహారంపై ఉప సంఘం మధ్యంతర నివేదికను కూడా శాసనసభకు సమర్పించింది.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్‌కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్‌పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
రేవ్ పార్టీ.. హేమతో పాటు ఈ బ్యూటీ కూడా.. ఇంతకీ ఎవరంటే? (ఫోటోలు)
ఈ బ్రాండ్ అంత ఈజీగా రాలేదు: దిల్ రాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్
శ్రీధర్ రెడ్డి హత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి: కేటీఆర్
బేబీ హీరోయిన్ హారర్ థ్రిల్లర్.. ట్రైలర్ చూశారా?
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (23-05-2024)
బీఆర్ఎస్కు10 ఏళ్ళు పట్టింది.. కాంగ్రెస్‌కు 5 ఏళ్ల పాలన గగనం: కిషన్ రెడ్డి
ఏపీలో చంద్రబాబు విధ్వంసం సృష్టించాడు: కాసు మహేష్‌రెడ్డి
రూ.46.90 లక్షల కారు లాంచ్ చేసిన బీఎండబ్ల్యూ - పూర్తి వివరాలు
ఓటీటీకి వందకోట్ల సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
పుష్ప 2 మూవీలో ఛాన్స్ వదిలేసుకున్నా: రవి కృష్ణ
తప్పక చదవండి
- బేబీ హీరోయిన్ హారర్ థ్రిల్లర్.. ట్రైలర్ చూశారా?
- ఎంటర్ప్రెన్యూర్ కమ్ ఇన్ఫ్లుయెన్సర్గా మారిన లాయర్! ఏకంగా ఆరుసార్లు కేన్స్..!
- బాయ్‌ఫ్రెండ్‌తో బ్రేకప్.. తొలిసారి క్లారిటీ ఇచ్చిన శృతిహాసన్!
- 'ఇప్పుడు కొనండి.. తరువాత చెల్లించండి'.. గూగుల్ పే కొత్త ఫీచర్
- ‘దాడి సమయంలో కేజ్రీవాల్ ఇంట్లోనే ఉన్నారు’
- 800 ఏళ్ల నాటి వ్యాయామం..దెబ్బకు ఒత్తిడి, అలసట మాయం!
- బీసీసీఐ ఆఫర్ నిజమే.. నేనే రిజెక్ట్ చేశా: ఆసీస్ దిగ్గజం
- రూ.2.5 కోట్లకు రూ.10 కోట్లు.. విరుష్క జంటకు లాభాల పంట!
- SRH vs RR: ‘సన్‌రైజర్స్ కాదు!.. రాజస్తాన్‌కే గెలిచే ఛాన్స్’
- పీకేకు దిమ్మతిరిగే ప్రశ్న.. సహనం కోల్పోయిన రాజకీయ వ్యూహకర్త
Advertisement