హీరో రాజశేఖర్‌ సంచలన నిర్ణయం | Sakshi
Sakshi News home page

హీరో రాజశేఖర్‌ సంచలన నిర్ణయం

Published Thu, Jan 2 2020 7:21 PM

  ‘మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(మా)’ లో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. దీంతో ‘మా’ఉపాధ్యక్షుడు రాజశేఖర్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గురువారం స్థానిక హోటల్‌లో జరిగిన ‘మా’ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో తీవ్రస్థాయిలో వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. అయితే ఈ వివాదానికి ప్రధాన బిందువుగా నిలిచిన రాజశేఖర్‌పై సినీ ఇండస్ట్రీ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో కలత చెందిన ఆయన ‘మా’  ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను మీడియాకు విడుదల చేశారు. అయితే తన రాజీనామాకు ‘మా’ అధ్యక్షుడు నరేశ్‌ కారణమని, ‘మా’ కొత్త కార్యవర్గం ఎన్నికైనప్పట్నుంచి అతడి తీరు అస్సలు బాగోలేదని, అంతేకాకుండా అతడితో తమకు పొసగడంలేదని అందుకే రాజీనామా చేస్తున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement