అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణం | Sakshi
Sakshi News home page

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణం

Published Sat, Jan 21 2017 7:08 AM

అగ్రరాజ్యం అమెరికాకు 45వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు. అంతకుముందు ఉపాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసి మైక్ పెన్స్ బాధ్యతలు స్వీకరించారు. అమెరికా చట్టసభలకు నెలవైన క్యాపిటల్‌ భవనం(వాషింగ్టన్‌ డీసీ) మెట్లపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేత అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జాన్‌ రాబర్ట్స్ ప్రమాణం చేయించారు. డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారోత్సవానికి ఆయన భార్య మిలానియా, కూతురు ఇవాంకా ట్రంప్, కొడుకు జూనియర్ ట్రంప్ హాజరయ్యారు. రెండు బైబిళ్లపై(ఒకటి తన తల్లి బహుకరించింది, రెండోది 150 ఏళ్ల కిందట అబ్రహాం లింకన్‌ ప్రమాణం చేసింది) చేతులు ఉంచి ప్రమాణం చేశారు. ఈ బైబిళ్లలో కేవలం 35 పదాలు మాత్రమే ఉంటాయి.