వలసల నిషేధంపై పట్టువదలని ట్రంప్‌ | Sakshi
Sakshi News home page

వలసల నిషేధంపై పట్టువదలని ట్రంప్‌

Published Sun, Feb 12 2017 6:49 AM

కోర్టుల్లో వరుసగా షాక్‌లు తగులుతున్నా... నిషేధపు ఉత్తర్వులపై మాత్రం వెనక్కి తగ్గనంటున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌. స్వల్ప మార్పులతో వచ్చే వారం కొత్త ఉత్తర్వులు జారీ చేస్తానని శనివారం ఆయన స్పష్టం చేశారు. ఏడు ముస్లిం దేశాల పౌరుల రాకను నిషేధిస్తూ జారీచేసిన ఉత్తర్వుల్ని కోర్టులు రద్దు చేసిన నేపథ్యంలో ఎలాగైనా పంతం నెగ్గించుకునే లక్ష్యంతో ట్రంప్‌ ముందడుగు వేస్తున్నారు. ‘ఈ యుద్ధంలో మేం గెలుస్తాం. అందుకు కొంత సమయం పట్టినా మాదే విజయం. ఇందుకోసం ఇతర ప్రత్యామ్నాయాల్ని కూడా పరిశీలిస్తున్నాం... అందులో ఒకటి కొత్త ఉత్తర్వులు జారీచేయడం’అని ట్రంప్‌ పేర్కొన్నారు.