India vs Afghanistan 3rd T20I: ఆడుతూ పాడుతూ... | Sakshi
Sakshi News home page

India vs Afghanistan 3rd T20I: ఆడుతూ పాడుతూ...

Published Mon, Jan 15 2024 5:30 AM

India vs Afghanistan 3rd T20I held on 15 january 2024 at Bengaluru - Sakshi

ఇండోర్‌: ముందుగా బౌలింగ్‌లో, ఆ తర్వాత బ్యాటింగ్‌లో చెలరేగిన భారత్‌ స్వదేశంలో మరో ద్వైపాక్షిక టి20 సిరీస్‌ను సొంతం చేసుకుంది. 2019 నుంచి సొంతగడ్డపై టి20 సిరీస్‌లలో ఓటమిలేని భారత్‌ అదే జోరును అఫ్గానిస్తాన్‌పై కూడా కొనసాగించింది. మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా అఫ్గానిస్తాన్‌తో ఆదివారం జరిగిన రెండో మ్యాచ్‌లో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే 2–0తో సిరీస్‌ను దక్కించుకుంది. చివరిదైన మూడో టి20 మ్యాచ్‌ బుధవారం బెంగళూరులో జరుగుతుంది.  

టాస్‌ గెలిచిన భారత కెపె్టన్‌ రోహిత్‌ శర్మ ఫీల్డింగ్‌ ఎంచుకోగా... మొదట బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్తాన్‌ సరిగ్గా 20 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌటైంది. గుల్బదిన్‌ (35 బంతుల్లో 57; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో అర్‌‡్షదీప్‌ సింగ్‌ 3 వికెట్లు తీయగా... ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అక్షర్‌ పటేల్, రవి బిష్ణోయ్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

173 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ కేవలం 15.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించి గెలిచింది. యశస్వి జైస్వాల్‌ (34 బంతుల్లో 68; 5 ఫోర్లు, 6 సిక్స్‌లు), శివమ్‌ దూబే (32 బంతుల్లో 63 నాటౌట్‌; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) అఫ్గాన్‌ బౌలర్ల భరతం పట్టి అర్ధ సెంచరీలు సాధించారు. కెపె్టన్‌ రోహిత్‌ శర్మ (0) వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ‘డకౌట్‌’కాగా... 14 నెలల తర్వాత మళ్లీ టి20 మ్యాచ్‌ ఆడిన కోహ్లి (16 బంతుల్లో 29; 5 ఫోర్లు) క్రీజులో ఉన్నంతసేపు దూకుడుగా ఆడాడు.

స్కోరు వివరాలు
అఫ్గానిస్తాన్‌ ఇన్నింగ్స్‌: గుర్బాజ్‌ (సి) దూబే (బి) రవి బిష్ణోయ్‌ 14; ఇబ్రహీమ్‌ (బి) అక్షర్‌ పటేల్‌ 8; గుల్బదిన్‌ (సి) రోహిత్‌ శర్మ (బి) అక్షర్‌ పటేల్‌ 57; అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌ (బి) శివమ్‌ దూబే 2; మొహమ్మద్‌ నబీ (సి) రింకూ సింగ్‌ (బి) రవి బిష్ణోయ్‌ 14; నజీబుల్లా (బి) అర్‌‡్షదీప్‌ 23; కరీమ్‌ (సి) అక్షర్‌ పటేల్‌ (బి) అర్‌‡్షదీప్‌ 20; ముజీబ్‌ (రనౌట్‌) 21; నూర్‌ అహ్మద్‌ (సి) కోహ్లి (బి) అర్‌‡్షదీప్‌ 1; నవీన్‌ ఉల్‌ హఖ్‌ (నాటౌట్‌) 1; ఫరూఖీ (రనౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో ఆలౌట్‌) 172.
వికెట్ల పతనం: 1–20, 2–53, 3–60, 4–91, 5–104, 6–134, 7–164, 8–170, 9–171, 10–172.
బౌలింగ్‌: అర్‌‡్షదీప్‌ సింగ్‌ 4–0–32–3, ముకేశ్‌ కుమార్‌ 2–0–21–0, రవి బిష్ణోయ్‌ 4–0–39–2, అక్షర్‌ పటేల్‌ 4–0–17–2, శివమ్‌ దూబే 3–0–36–1, వాషింగ్టన్‌ సుందర్‌ 3–0–23–0.

భారత్‌ ఇన్నింగ్స్‌: యశస్వి జైస్వాల్‌ (సి) గుర్బాజ్‌ (బి) కరీమ్‌ 68; రోహిత్‌ శర్మ (బి) ఫరూఖీ 0; విరాట్‌ కోహ్లి (సి) ఇబ్రహీమ్‌ (బి) నవీన్‌ 29; శివమ్‌ దూబే (నాటౌట్‌) 63; జితేశ్‌ శర్మ (సి) నబీ (బి) కరీమ్‌ 0; రింకూ సింగ్‌ (నాటౌట్‌) 9; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (15.4 ఓవర్లలో 4 వికెట్లకు) 173.
వికెట్ల పతనం: 1–5, 2–62, 3–154, 4–156.
బౌలింగ్‌:
ఫరూఖీ 3.4–0–28–1, ముజీబ్‌ ఉర్‌ రెహ్మాన్‌ 2–0–32–0, నవీన్‌ ఉల్‌ హఖ్‌ 3–0–33–1, నూర్‌ అహ్మద్‌ 3–0–35–0, నబీ 2–0–30–0, కరీమ్‌ 2–0–13–2.

150: అంతర్జాతీయ టి20ల్లో 150 మ్యాచ్‌లు ఆడిన తొలి ప్లేయర్‌గా రోహిత్‌ శర్మ గుర్తింపు పొందాడు.
12: అంతర్జాతీయ టి20ల్లో భారత్‌ తరఫున అత్యధికంగా 12 సార్లు ‘డకౌట్‌’ అయిన ప్లేయర్‌ రోహిత్‌ శర్మ. కేఎల్‌ రాహుల్‌ (5) రెండో స్థానంలో ఉన్నాడు.
15: స్వదేశంలో జరిగిన గత 15 ద్వైపాక్షిక టి20 సిరీస్‌లలో భారత్‌ అజేయంగా నిలిచింది. 2019 నుంచి భారత జట్టు 13  టి20 సిరీస్‌లను నెగ్గి, రెండింటిని ‘డ్రా’గా ముగించింది.

Advertisement
Advertisement