రాయ్‌గఢ్: మన దేశ డీఎన్‌ఏలోనే ప్రేమ ఉందని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ మాత్రం దేశంలో విద్వేషం వ్యాప్తి చేస్తున్నాయని దుయ్యబట్టారు. ఆయన భారత్ జోడో న్యాయ్ యాత్ర రెండు రోజుల విరామం తర్వాత ఆదివారం ఛత్తీస్‌గఢ్‌లో మొదలైంది. రాయ్‌గఢ్ ర్యాలీలో రాహుల్ మాట్లాడారు.
‘‘భారత్‌లో భిన్న మతాలు, భిన్న సంప్రదాయాల ప్రజలు పరస్పరం ప్రేమతో శాంతియుతంగా జీవిస్తున్నారు. కానీ బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ విద్వేష రాజకీయాల వల్ల ప్రతి ప్రాంతంలో విద్వేషం, హింస పెరిగిపో తున్నాయి. భాష ఆధారంగా కొందరు, రాష్ట్రాన్ని బట్టి ఇంకొందరు ఇతరులను ద్వేషిస్తామంటున్నారు’’ అని ఆవేదన వెలిబుచ్చారు. విద్వేషం, హింసకు తావులేని హిందుస్తాన్‌ను భవిష్యత్ తరానికి అందించడమే కాంగ్రెస్ లక్ష్యమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment