జైల్లో కుదుటగానే కేజ్రీవాల్‌ ఆరోగ్యం: ఢిల్లీ ఎయిమ్స్‌ | Sakshi
Sakshi News home page

జైల్లో కుదుటగానే కేజ్రీవాల్‌ ఆరోగ్యం: ఢిల్లీ ఎయిమ్స్‌

Published Sat, Apr 27 2024 4:51 PM

Arvind Kejriwal Healthy Asked to Continue Insulin By Medical board

ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో అరెస్టై తీహార్‌ జైల్లో ఉన్న సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆరోగ్యం ప్రస్తుతం కుదుటగానే ఉన్నట్లు తెలుస్తోంది. టైప్‌-2 డయాబేటిస్‌తో బాధపడుతున్న కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు అయిదుగురు డాక్టర్లతో కూడిన వైద్య బృందం ఆయనకు రెండు యూనిట్ల ఇన్సులిన్‌ అందిస్తోంది. ఈ మేరకు ఎయిమ్స్‌కు చెందిన అయిదుగురు వైద్యుల బృందం శనివారం కేజ్రీవాల్‌తో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.  దాదాపు అరగంట పాటు ఆరోగ్య పరిస్థితిపై ఆరాతీశారు. 

ప్రస్తుతం కేజ్రీవాల్‌ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు ధ్రువీకరించినట్లు తెలుస్తోంది. ఈమేరకు జాతీయ మీడియా కథనాలు వెల్లడించింది. కేజ్రీవాల్‌ ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నందున, ఆయన  ఉపయోగిస్తున్న మందులనే కొనసాగించాలని మెడికల్‌ బోర్డు సూచించిం.ది మెడిసిన్‌లో ఎలాంటి మార్పులు చేయాల్సిన అవసరం లేదు పేర్కొంది. దీంతో పాటు ఆయనకు రెండు యూనిట్ల ఇన్సులిన్‌ డోసును కొనసాగించాలని తెలిపింది’ అని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. వారం తర్వాత ఈ బృందం సీఎంను మరోసారి పరీక్షించనున్నట్లు పేర్కొన్నాయి.

కాగా ఆయన షుగర్‌ లెవల్స్‌ 320కు పెరగడంతో గతవారం తీహార్‌ జైల్లో తొలి ఇన్సులిన్‌ అందించారు. తన వ్యక్తిగత వైద్యుడితో రోజూ వీడియో మాధ్యమంలో సంప్రదించే అవకాశాన్ని కల్పించాలంటూ కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ కోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. ఆరోగ్య కారణాల కింద బెయిల్‌ పొందేందుకే చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండే స్వీట్స్‌, మామిడిపండ్లు, ఆలూపూరీ వంటి ఆహార పదార్దాలు తీసుకుంటున్నారని దర్యాప్తు సంస్థ ఆరోపించింది. దీనిపై వాదనలు విన్న న్యాయస్థానం.. కేజ్రీవాల్‌ అభ్యర్థనను తోసిపుచ్చింది.

అయితే టైప్ 2 డయాబెటిక్ పేషెండ్‌ అయిన కేజ్రీవాల్‌కు క్రమం తప్పకుండా ఇన్సులిన్‌ అవసరమా?, ఇతర ఆరోగ్య సమస్యలేమైనా ఉన్నాయా? అని నిర్ణయించేందుకు ఎయిమ్స్‌ వైద్యులతో కూడిన కమిటీని ఏర్పాటుచేయాల్సిందిగా ఆదేశించింది. ఇంట్లో వండిన ఆహారాన్ని కూడా కోర్టు అనుమతించింది. అయితే అది ఖచ్చితంగా డాక్టర్ సూచించిన డైట్ చార్ట్‌కు కట్టుబడి ఉండాలని పేర్కొంది. 

Advertisement
Advertisement