No Headline | - | Sakshi
Sakshi News home page

No Headline

Published Wed, May 15 2024 6:05 AM | Last Updated on Wed, May 15 2024 6:05 AM

-

మూడేళ్లలో నలుగురు హాస్టళ్ల డైరెక్టర్లు విధులు!

కేయూ వీసీ రమేశ్‌ 2021 మే 23న బాధ్యతలు స్వీకరించా రు. ఈనెల 21న మూడేళ్లు పదవీ కాలం పూర్తికాబోతుంది. రమేశ్‌ బాధ్యతలు స్వీకరించేనాటికే హాస్టళ్ల డైరెక్టర్‌గా జువాలజీ విభాగం అసోసియేట్‌ ప్రొఫెసర్‌ ఎం ఇస్తారి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017సెప్టెంబర్‌ నుంచి 20 22 ఫిబ్రవరి వరకు కొనసాగారు. పలు కారణాలతో ఆ యన పదవికి రాజీనామా చేయగా 2022 మార్చిలో కంప్యూటర్‌ సైన్స్‌ విభాగం ప్రొఫెసర్‌ మంజులను నియమించారు. 2023 జూలై 4వరకు కొనసాగుతుండగానే ఆమె స్థానంలో జువాలజీ విభాగం ప్రొఫెసర్‌ వై వెంకయ్యను 2023 జూలై 5న నియమించారు. అనంతరం ఆయన స్థా నంలో 2024 జనవరిలో పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ విభాగం ప్రొఫెసర్‌ శ్రీనివాస్‌రావును నియమించారు. నాలుగు నెలలు 5రోజులకే రాజీనామా చేయగా ఆయన స్థానంలో ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్‌ సమ్మయ్యను నియమించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement