ఒట్టావా: కెనడా రాజధాని నగరం ఒట్టావాలో భారత సంతతి వ్యాపారవేత్త ఇంటిపై దాడి జరిగింది. వ్యాపారవేత్త ఇంటిపై దుండగులు పలు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ దాడికి పాల్పడింది పరారీలో ఉన్న గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ అలియాస్ సతిందర్‌జిత్ సింగ్ గ్రూపునకు చెందిన మనుషులుగా అనుమానిస్తున్నారు.
మాస్కులు ధరించిన వ్యక్తులు వ్యాపారవేత్త ఇంటిలోకి కాల్పులు జరుపుతున్న వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. భారత్, కెనడాలో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌గా పేరున్న లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో గోల్డీ బ్రార్ గ్యాంగ్‌కు సంబంధాలున్నాయి. అయితే వ్యాపారవేత్త ఇంటిపై కాల్పులకు పాల్పడింది తామేనని ఇప్పటివరకు గోల్డీ బ్రార్ గ్యాంగ్ ఎలాంటి ప్రకటన చేయలేదు.
భయపెట్టి బలవంతపు వసూళ్లకు(ఎక్స్టార్షన్) పాల్పడేందుకే వ్యాపారవేత్త ఇంటిపై కాల్పులు జరిపినట్లు పోలీసులు భావిస్తున్నారు. కెనడాలో గ్యాంగ్స్టర్లు ఎక్స్‌టార్షన్‌కు పాల్పడటం ప్రస్తుతం సాధారణంగా మారిపోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment