చదువులతల్లి పట్ల దారుణం: చైల్డ్‌ లైన్‌ ఫిర్యాదుతో వెలుగులోకి! | Class 12 Molestation Survivor Allegedly Barred From Taking Board Examination In Ajmer, Details Inside - Sakshi
Sakshi News home page

చదువులతల్లి పట్ల దారుణం: చైల్డ్‌ లైన్‌ ఫిర్యాదుతో వెలుగులోకి!

Published Fri, Apr 5 2024 2:32 PM

 Class 12 molestation Survivor Allegedly Barred From Taking Board Examination in Ajmer - Sakshi

అత్యాచార బాధితురాలి పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన కలకలం రేపింది. సామూహిక అత్యాచారానికి గురైన బాలికను 12వ తరగతి పరీక్ష రాయకుండా అడ్డుకున్నారు. రాజస్థాన్‌లో అజ్మీర్‌లో ఒకప్రైవేట్‌ పాఠశాలలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. బాధితురాలు చైల్డ్ హెల్ప్‌లైన్నంబర్‌కు ఫోన్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

12 బోర్డు పరీక్షలకు  తనను హాజరుకానివ్వలేదంటూ అజ్మీర్‌లోని ప్రైవేట్ పాఠశాల  విద్యార్థిని  ఆరోపించింది.  గత ఏడాది  సామూహిక అత్యాచారానికి గురయ్యావు కాబట్టి, పరీక్షకు హాజరైతే వాతావరణం చెడిపోతుందని పాఠశాల అధికారులు చెప్పారని విద్యార్థిని తన ఫిర్యాదులో పేర్కొంది. అడ్మిట్ కార్డ్ ఇవ్వ లేదని బాధితురాలు తెలిపింది. అడ్మిట్ కార్డు తీసుకోవడానికి వెళ్లినప్పుడు, అధికారులు ఇకపై పాఠశాల విద్యార్థిని కాదని తెలిపారు. అయితే దీనిపై మరో టీచర్‌ను సం‍ప్రదించగా, ఆమె చైల్డ్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయమని సూచించింది.  అయితే బాధిత విద్యార్థిని గత నాలుగు నెలలుగా పాఠశాలకు రాకపోవడంతో ఆమెను పరీక్షకు అనుమతించడం లేదని పాఠశాల అధికారులు వాదించారు.

అయితే ఆమె స్కూలుకు హాజరుకావడాన్ని ఇతర విద్యార్థుల తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో తనను లోపలికి రానీయకుండా నిషేధించారని ఇంటి నుండే చదువుకోవాలని సూచించిందని అందుకే ఇంట్లో  ఉండే పరీక్షలకు ప్రిపేర్‌ అయినట్టు అంజలీ శర్మతో వాపోయింది. విద్యార్థిని ఫిర్యాదు మేరకు అజ్మీర్ చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ (సిడబ్ల్యుసి) కేసు నమోదు చేసింది, విచారణ తర్వాత అవసరమైన చర్యలు తీసుకుంటామని సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్ అంజలి శర్మ వెల్లడించారు. శిశు సంక్షేమ శాఖ కూడా కేసు నమోదు చేసింది.

10వ తరగతి పరీక్షలలో 97 శాతం స్కోర్ సాధించిన బాధితురాలు ఇపుడు కూడామంచి మార్కులు  తెచ్చుకుంటానని ధీమా వ్యక్తం చేసింది. కానీ  పాఠశాల నిర్లక్ష్యం వల్ల ఏడాది సమయం వృథా అవుతుందేమోనని భయపడుతోంది.

కాగా గతేడాది అక్టోబర్‌లో విద్యార్థినిపై ఆమె మామ, మరో ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు.దీనిపై విచారణ నడుస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాలికా విద్య, మహిళల భద్రత గురించి ఎంత మాట్లాడు తున్నా, ఎంత ప్రచారం కల్పిస్తున్నా పరిస్థితిలో మార్పు రావడం లేదనీ,  మరీ ముఖ్యంగా విద్య నేర్పే పాఠశాల్లో ఇలాంటి దారుణం ఏమిటి అనే  విమర్శలకు తావిస్తోంది.

Advertisement
Advertisement