ఉత్తరాంధ్రపై ఉత్తమాటలెందుకు?  | Sakshi
Sakshi News home page

ఉత్తరాంధ్రపై ఉత్తమాటలెందుకు? 

Published Sun, Feb 25 2024 5:50 AM

Jalayagnam started during the reign of YSR - Sakshi

సాక్షి ప్రతినిధి, విజయనగరం  :  నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం, 14 ఏళ్ల ముఖ్యమంత్రి పదవీకాలం ఉన్నా చంద్రబాబు ఏనాడూ ఉత్తరాంధ్రలో సాగునీటి ప్రాజెక్టు­లపై దృష్టి పెట్టలేదు. ఇప్పుడున్న ప్రాజెక్టుల్లో అధిక శాతం దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి చేపట్టిన జలయజ్ఞం ఫలాలే. ఆయన అకాల మరణం తర్వాత మూడో దఫా అధికారం చేపట్టిన చంద్రబాబు.. ఆ ప్రాజెక్టుల పూర్తిపై చిత్తశుద్ధి చూపిం­­చలేదు. మొక్కుబడిగా నిధులు కేటాయించడమే తప్ప క్షేత్రస్థాయిలో ఎక్కడి పనులు అక్కడే అన్నట్లుగా ఉన్నాయి.

తన తండ్రి ఆశయాల మేరకు జలయజ్ఞం పూర్తిచేయాలన్న లక్ష్యంతో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి రాగానే వీటిపై దృష్టి సారించారు. అయితే, కరోనాతో రెండేళ్లు వృధా అయ్యాయి. ఇక భూసేకరణలో ఇబ్బందులు, న్యాయ­వివాదాలు తలెత్తినా వాటన్నింటినీ అధిగ­మిస్తూ ప్రాజెక్టులను పూర్తిచేయాలనే లక్ష్యంతో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. వీటన్నింటినీ విస్మరించి ‘ఈనాడు’లో రామోజీరావు ఎప్పటి­లాగే విషంకక్కారు.

ఉత్తరాంధ్రలో సాగునీటి ప్రాజె­క్టులు ఈ దుస్థితిలో చిక్కుకుపోవడానికి చంద్రబాబు నిర్లక్ష్య పాలనే కారణమన్న విషయాన్ని మరుగున­పరచడానికి ఆయన నానాపాట్లు పడ్డారు. ‘ఉత్తరాంధ్రంటే ఉత్తదనుకుంటివా?’ శీర్షికతో శుక్ర­వారం అవాస్తవాలను వండివార్చారు. ఇష్టారాజ్యంగా దగాకోరు రాతలు రాశారు. కానీ, వాస్తవాలు అందుకు భిన్నంగా ఉన్నాయి. ప్రాజెక్టుల వారీగా ఈనాడు క్షుద్ర రాతలపై ‘ఫ్యాక్ట్‌చెక్‌’ ఏమిటంటే..

మడ్డువలస 
విజయనగరం జిల్లా వంగర మండలం మడ్డువలస వద్ద సువర్ణముఖి నదిపై నిర్మించిన ప్రాజెక్టు ప్యాకేజీ–1 పనులను డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలోనే రూ.130.60 కోట్ల వ్యయంతో పూర్తిచేయించారు. తద్వారా 24,877 ఎకరాల మేర భూములు సస్యశ్యామ­లంగా మారాయి. మళ్లీ వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో ప్యాకేజీ పనుల కోసం రూ.26.90 కోట్లను మంజూరు చేశారు. ఇందుకు అవసరమైన భూసేకరణ పనులు జరుగుతున్నాయి. 

వంశధార
శ్రీకాకుళం జిల్లా వంశధార ప్రాజెక్టు పనుల పూర్తికి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం రూ. 2,407.79 కోట్లను మంజూరు చేసింది. ఇప్పటికే 95 శాతం పనులు పూర్తయ్యాయి. రానున్న జూన్‌కల్లా పూర్తిచేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. వంశధార ప్రాజెక్టు రెండో దశ పనుల కోసం 2004 నుంచి 2019 వరకూ అంటే 15 ఏళ్లలో రూ.1,614.82 కోట్లు ఖర్చుచేయగా, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం 2019 నుంచి నేటివరకూ అంటే నాలుగేళ్ల 10 నెలల కాలంలో రూ.400.40 కోట్లు ఖర్చుచేసింది.

అయినప్పటికీ ఒడిశా అభ్యంతరాలతో నేరడి బ్యా­రేజీ నిర్మాణంలో జాప్యం తప్పట్లేదు. ప్రాజెక్టు­ను సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో గొట్టా బ్యారేజీ కుడికాలువపై ఎత్తిపోతల పథకం నిర్మించి హిరమండలం రిజర్వాయరులో 12 టీఎంసీల వరకూ నీటిని నింపాలనే భగీరథ ప్రయత్నానికి ప్రభు­త్వం నడుంబిగించింది. 2022 సెప్టెంబర్‌ 14న రూ.176.35 కోట్ల నిధులను మంజూరుచేసింది. ప్రస్తుతం పనులు పురోగతిలో ఉన్నాయి. వచ్చే అక్టోబరు నాటికి ఇవి పూర్తికానున్నాయి. 

మహేంద్రతనయ
శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రేగులపాడు వద్ద మహేంద్రతనయ నదిపై ఆఫ్‌షోర్‌ ప్రాజెక్టు నిర్మా­ణానికి మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో నాంది పలికారు. తర్వాత వచ్చిన చంద్రబాబు దీన్ని పూర్తిచేయడంపై చిత్తశుద్ధి చూపించలేదు. విపరీత­మైన జాప్యంతో ఆ పనులను వైఎస్‌ జగన్‌మోహన్‌­రెడ్డి ప్రభుత్వం రద్దుచేసి, సవరించిన అంచనాలతో రూ.852.45 కోట్లతో 2022 సెప్టెంబరు 14న పరిపాలన ఆమోదాన్ని ఇచ్చింది. ప్రస్తుతం పనులు పురోగతిలో ఉన్నాయి.

జంఝావతి
పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం రాజ్యలక్ష్మీపురం వద్ద 1976లో నిర్మాణ పనులను ప్రారంభించినా అంతర్రాష్ట్ర సమస్యతో జంఝావతి ప్రాజెక్టు పనులు అర్ధంతరంగా ఆగిపోయాయి. చంద్రబాబు తన పాలనలో ఏరోజు కూడా దాన్ని పూర్తిచే­యడంపై దృష్టి పెట్టలేదు. వైఎస్‌ రాజశేఖర­రెడ్డి హయాంలో ఆసియాలోనే మొట్టమొదటి రబ్బర్‌ డ్యాంను అక్కడ నిర్మించి జాతికి అంకితం చేశారు. రెండో ప్యాకేజీ కింద కాలువ అభివృద్ధి పనులను ప్రస్తుతం రూ.3.26 కోట్లతో చేపడుతున్నారు. 

తారకరామతీర్థ సాగర్‌
ఈ ప్రాజెక్టుతో ముంపునకు గురయ్యే విజయ­నగరం జిల్లాలోని కోరాడపేట, ఏటీ అగ్రహారం, పడాల­పేట గ్రామాల వారికి పునరావాస పనులు ప్రస్తుతం పురోగతి సాధించాయి. కొన్నేళ్లుగా సారిపల్లి గ్రామ ప్రజలు ఎదురుచూస్తున్న రూ.77 కోట్ల పునరావాస ప్యాకేజీకి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అను­మ­తులిచ్చింది. ప్రాజెక్టు నిర్మాణానికి 2006 నుంచి 2019 వరకూ రూ.166.80 కోట్లు.. భూసే­కరణకు రూ.57.06 కోట్లు ఖర్చుచేశారు.

వైఎస్‌ జగన్‌ ప్రభు­త్వం 2019 నుంచి ఇప్పటివరకూ రూ.­56.56 కోట్ల­ను నిర్మాణ పనులకు, భూసేకరణకు రూ.25.33 కోట్లను ఖర్చుచేసింది. 2025 మార్చి నాటికి ఈ ప్రాజె­క్టును పూర్తిచేసి విజయనగరం పట్టణ ప్రజలకు సమృద్ధిగా తాగునీరు, భోగాపురం అంతర్జాతీయ విమా­నాశ్రయం అవసరాలకు సరిపడా నీటి సరఫరా చేయాలనే లక్ష్యంతో ప్రభు­త్వం పనులు చేయిస్తోంది.

తోటపల్లి 
ఉత్తరాంధ్రలో విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో 1,31,221 ఎకరాల ఆయకట్టుతో పాటు అదనంగా మరో 11,221 ఎకరాలను స్థిరీకరించేందుకు ఉద్దేశించిన తోటపల్లి బ్యారేజ్‌ ప్రాజెక్టు నిర్మాణానికి వైఎస్‌ రాజశేఖరరెడ్డి తన హయాంలో పూర్తిస్థాయిలో నిధులు సమ­కూర్చారు.

ఆయన మరణానంతరం చంద్రబాబు కేవలం ప్రారంభోత్సవం చేశారు. కనీసం పిల్ల కాలువల నిర్మాణాన్ని సైతం గాలికి వదిలేశారు. ఆ మిగులు పనులను ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం చేపట్టింది. రూ.­123.21 కోట్లు మంజూరు చేసి పరిపాలనామో­దాన్ని ఇచ్చింది. నేటి వరకూ 64.59 కోట్లను వెచ్చించారు. 2025 మార్చి నాటికి పూర్తిచేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 

గజపతినగరం బ్రాంచ్‌ కెనాల్‌  
తోటపల్లి కుడి ప్రధాన కాలువ నుంచి గజపతి­నగరం బ్రాంచ్‌ కెనాల్, డిస్ట్రిబ్యూటరీ కెనాల్‌ నిర్మాణానికి వైఎస్‌ రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేశారు. తర్వాత వచ్చిన ప్రభుత్వాల చిన్నచూపు ఫలితంగా పనులు పడకేశాయి. వీటిన్నింటినీ రద్దుచేసిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం 2022 ఏప్రిల్‌ 22న తాజా అంచనాలతో రూ.137.80 కోట్లతో మిగులు పనులు చేపట్టేందుకు పరిపాలనా అనుమతులిచ్చింది. ప్రసుత్తం భూసే­కరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

Advertisement
Advertisement