సంప్రదాయ పద్ధతులతో...
హనుమాన్ జయంతిని పురస్కరించుకుని కుంటాలలో కుస్తీ పోటీలు నిర్వహిస్తారు. మహాదేవుని ఆలయం వద్ద సంప్రదాయ పద్ధతులతో జెండాలను ప్రదర్శించి ఊరేగిస్తాం. అంబలి నైవేద్యంగా సమర్పించి విజేతను సన్మానిస్తాం. గ్రామస్తుల సహకారంతో అన్నదానం ఏర్పాటు చేస్తాం.
– జంగం మధు,
మహాదేవుని ఆలయ అర్చకుడు
ఆనవాయితీ
కొనసాగిస్తున్నాం
నా చిన్ననాటి నుంచి గ్రామంలో కుస్తీపోటీలు నిర్వహిస్తున్నారు. అదే ఆనవాయితీని ఇప్పటికీ కొనసాగిస్తున్నాం. మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి మల్లయోధులు పోటీల్లో పాల్గొంటారు. అందరి సహకారంతో పోటీలు నిర్వహిస్తున్నాం.
– సక్రపు చిన్నన్న, గ్రామపెద్ద, కుంటాల
కుంటాల: గ్రామంలోని యువకులు ఆటల్లో పోటీతత్వాన్ని అలవర్చుకోవాలన్న ఉద్దేశంతో కుంటాలలో 80 ఏళ్లుగా గ్రామస్తుల ఆధ్వర్యంలో కుస్తీ పోటీలు నిర్వహిస్తున్నారు. హనుమాన్ జయంతి, మహాదేవుని పౌర్ణమిని పురస్కరించుకుని సుమారు 80 ఏళ్లుగా అంతర్రాష్ట్ర కుస్తీ పోటీలు నిర్వహిస్తున్నారు. పౌర్ణమికి ఒకరోజు ముందు మహాదేవుని ఆలయం వద్ద జెండాలను ప్రతిష్టిస్తారు. మరుసటి రోజు గ్రామస్తులు, మల్లయోధులు, ఆలయ అర్చకుల సమక్షంలో భాజా భజంత్రీలతో జెండాలను ఊరేగిస్తారు. అనంతరం కుస్తీ పోటీలను ప్రారంభిస్తారు.
రేపటి నుంచి పోటీలు
కుంటాలలో బుధవారం నుంచి అంతర్రాష్ట్ర కుస్తీ పోటీలు నిర్వహించనున్నారు. మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి మల్లయోధులు పెద్దసంఖ్యలో పోటీల్లో పాల్గొని తలపడతారు. విజేతకు గ్రామస్తులు వెండి కడియం, నగదు బహుమతిగా అందజేస్తారు. విజేతలను ఘనంగా సన్మానించి భాజా భజంత్రీలతో ఊరేగింపుగా మహాదేవుని ఆలయం వరకు తీసుకెళ్తారు. మహాదేవునికి అంబలి, నైవేద్యం సమర్పించిన అనంతరం భోజనం ఏర్పాటు చేస్తారు.
నేడు బండరాయి ఎత్తే పోటీలు
హనుమాన్ జయంతి సందర్భంగా మంగళవారం రాత్రి వెయిట్ లిఫ్టింగ్ పోటీల మాదిరిగానే కుంటాలలో బండరాయి ఎత్తే పోటీలు నిర్వహిస్తారు. సుమారు 135 కిలోలు, 65 కిలోల బండరాయి పోటీల్లో యువకులు ఉత్సాహంగా పాల్గొంటారు. బండరాయిని ఎత్తి తమ బల ప్రదర్శన నిరూపించుకుంటారు.
కుస్తీ పోటీలో తలపడుతున్న మల్లయోధులు (ఫైల్)
80 ఏళ్లుగా కుస్తీ పోటీలు
రసవత్తరంగా బండరాయి పోటీలు
ఆనవాయితీని కొనసాగిస్తున్న కుంటాల వాసులు
Comments
Please login to add a commentAdd a comment