-
నన్ను క్షమించగలవా?
ప్రకాశ్‌రాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రంగ మార్తాండ’. నటుడు బ్రహ్మానందం కీలక పాత్రలో నటించారు. కాలిపు మధు, ఎస్. వెంకట్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 10న విడుదలవుతోంది. బ్రహ్మానందం పుట్టినరోజు (ఫిబ్రవరి 1) సందర్భంగా ‘రంగ మార్తాండ’ నుంచి బ్రహ్మానందం గ్లింప్స్ రిలీజ్ చేశారు. ‘‘ధగ ధగ్గాయ రాజమకుట సువర్ణ మణిగణ రాజరాజేశ్వరా, సుయోధన సౌర్వభౌమ.. శరాఘతాలతో ఛిద్రమై.. ఊపిరి ఆవిరై దిగంతాల సరిహద్దులు చెరిగిపోతున్న వేళ.. అఖండ భారత సామ్రాజ్యాన్ని కురుక్షేత్ర సంగ్రామంలో కానుకగా ఇస్తానని శుష్క వాగ్దానాలు వల్లెవేసిన ఈ దౌర్భాగ్యుడికి కడసారి దర్శనం కల్పిస్తున్నావా? నా దైవ స్వరూపమా.. నన్ను క్షమించగలవా?’’ అంటూ భావోద్వేగంతో బ్రహ్మానందం చెప్పే డైలాగ్స్‌తో గ్లింప్స్ సాగుతుంది. రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక నటించిన ఈ చిత్రానికి సంగీతం: ఇళయరాజా. -
ఐశ్వర్య డైరెక్షన్లో అతిథి పాత్రలో తలైవా
తమిళ సినిమా: రజనీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో కొత్త చిత్రం రాబోతోంది. ఈ మేరకు శనివారం చెన్నైలో పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో 2012లో ధనుష్, శృతిహాసన్ జంటగా 3 చిత్రం, నటుడు గౌతమ్ కార్తీక్ హీరోగా 2015లో వై రాజా వై అనే మరో చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. చాలా గ్యాప్ తర్వాత తాజాగా ఆమె సినీ కెప్టెన్ బాధ్యతలు చేపట్టడానికి సిద్ధమయ్యారు.. ఈ చిత్రంలో సపర్ స్టార్ రజనీకాంత్ అతిథి పాత్రలో నటించనున్నారు. ఈయన ఇంతకుముందు తన రెండవ కూతురు సౌందర్య రజనీకాంత్ దర్శకత్వంలో కోచ్చడయాన్ అనే యానిమేషన్ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు పెద్ద కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధమయ్యారు. ఈ క్రేజీ చిత్రానికి లాల్ సలాం అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఈ చిత్రం టైటిల్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. తనయ దర్శకత్వంలో తలైవా అంట ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నటుడు అధర్వ హీరోగా నటించనున్నట్లు ప్రచారం జరిగింది. కొన్ని కారణాల వల్ల ఆయన ఇందులో నటించడం లేదు. తాజాగా నటుడు విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. దీనికి ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని, విష్ణు రంగసామి ఛాయాగ్రహణాన్ని అందిస్తున్నట్టు లైకా సంస్థ నిర్వాహకుడు తమిళ్ కుమరన్ తెలిపారు. #LalSalaam 🫡 to everyone out there! We are extremely delighted to announce our next project, with the one & only Superstar 🌟 @rajinikanth in a special appearance! Directed by @ash_rajinikanth 🎬 Starring @TheVishnuVishal & @vikranth_offl in the leads 🏏 Music by @arrahman 🎶 pic.twitter.com/aYlxiXHodZ — Lyca Productions (@LycaProductions) November 5, 2022 -
బాలీవుడ్‌కి స్పెషల్‌గా...
కథానాయిక అయిన పదేళ్లకు అమలా పాల్ ఇప్పుడు హిందీ తెరకు పరిచయం కానున్నారు. అది కూడా స్పెషల్‌గా... అంటే స్పెషల్ రోల్లో అన్నమాట. అజయ్ దేవగన్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న ‘భోలా’లోనే ఆమె ప్రత్యేక పాత్ర చేయనున్నారు. కార్తీ హీరోగా నటించిన హిట్ తమిళ మూవీ ‘ఖైదీ’కి ‘భోలా’ హిందీ రీమేక్. ఈ చిత్రంలో ఓ కీలక పాత్రను టబు చేస్తున్నారు. తాజాగా అమలా పాల్ని ఎంపిక చేసిన విషయాన్ని చిత్రబృందం బుధవారం ప్రకటించింది. ఇప్పటికే కొంత భాగం చిత్రీకరణ పూర్తయింది. డిసెంబర్లో ఆరంభం కానున్న ఈ చిత్రం కొత్త షెడ్యూల్లో అమలా పాల్ పాల్గొంటారు. -
ఈ సినిమా నాకు చాలా స్పెషల్: శ్రద్ధా దాస్
బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రద్దాదాస్ తాజాగా నటించిన చిత్రం 'అర్థం'. 'మాయ' అనే సైకియాట్రిస్ట్ (మానసిక వైద్య నిపుణురాలు) చుట్టూ తిరిగే కథతో రూపొందించారు. మినర్వా పిక్చర్స్ బ్యానర్‌పై శ్రద్దాదాస్ ప్రధాన పాత్రలో 'దేవి', 'పెదరాయుడు' చిత్రాలతో బాలనటుడిగా గుర్తింపు తెచ్చుకున్న మాస్టర్ మహేంద్రన్, అమని, అజయ్, ఈటీవీ ప్రభాకర్, జబర్దస్త్ రోషిణి, లోబో, నందా దురైరాజ్, సాహితి నటించారు. ఇంతకు ముందు అనేక చిత్రాలకు ఎడిటర్‌గా, వీఎఫ్ఎక్స్ నిపుణుడిగా పని చేసి గుర్తింపు తెచ్చుకున్న మణికాంత్ తెల్లగూటి దర్శకత్వంలో డిఫరెంట్ సైకలాజికల్ థ్రిల్లర్‌గా ఈ మూవీని తెరకెక్కించారు. ఈ సినిమాను తమిళం, తెలుగు భాషల్లో రాధిక శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. అలాగే మళయాళ, కన్నడ భాషల్లోకి డబ్ చేసి విడుదల చేయనున్నారు. సెప్టెంబర్ చివరి వారంలో విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ మూవీ టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ సందర్భంగా శ్రద్దా దాస్ మాట్లాడుతూ.. 'ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలన్నిటికంటే ఈ సినిమా నాకు స్పెషల్. ఇలాంటి హార్రర్ మూవీలకు వీఎఫ్ఎక్స్ ఇంపార్టెంట్. డీవోపీ పవన్ గారు నన్ను చాలా అందంగా చూపించారు. దర్శకుడు మణికాంత్ గారు, నిర్మాతలు చక్కని కథను సెలెక్ట్ చేసుకొని ఈ సినిమాను చాలా చక్కగా తెరకేక్కించారు.ఈ మూవీలో గ్లామర్ రోల్లో సైకియాట్రిస్ట్‌గా నటించాను. ఇందులోని నా పాత్ర చాలా కు స్పెషల్ గా ఉంటుంది.. ఇలాంటి మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాలో, మంచి టీంతో నటించడం చాలా హ్యాపీగా ఉంది' అని పేర్కొంది. ''మా నాన్న ఒక సినిమా ఆపరేటర్. నేను ఈ రోజు ఈ స్టేజ్ పై ఉండడానికి మా నాన్నే ఇన్స్పిరేషన్. 'అర్థం' అంటే ఏమిటి అనుకుంటున్నారు . కుటుంబ విలువలను కాపాడే, మహిళా సాధికారతను పెంపొందించే సరికొత్త కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాలో మానవ సంబంధాలు గురించి ప్రతి ఒక్కరి రిలేషన్ గురించి ఇందులో చూపించాం. నిర్మాతకు సినిమా అంటే ఎంతో పిచ్చి. అర్జున్ రెడ్డికి బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చిన హర్షవర్ధన్ రామేశ్ గారు ఈ సినిమాకు మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఇప్పటివరకు చేసిన సినిమాలన్నిటికంటే శ్రద్దా దాస్ కు ఈ సినిమా మంచి టర్నింగ్ అవుతుంది'' అని డైరెక్టర్ మణికాంత్ తెల్లగూటి తెలిపారు. -
బిగ్ సర్ప్రైజ్, ఆచార్యలో అనుష్క స్పెషల్ రోల్!
Anushka Shetty Playing Special Role In Acharya: మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా నటించిన చిత్రం ‘ఆచార్య’. తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి చేస్తున్న ఈచిత్రంపై ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. ఇక పలు వాయిదాల అనంతరం ఈ చిత్రం ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఇంకా విడుదలకు రెండు రోజుల ఉండగా ప్రేక్షకులకు బిగ్ సర్ప్రైజ్ ఇస్తూ ఓ ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది. ఇందులో హీరోయిన్గా చేసిన కాజల్‌ను తొలిగించిన విషయం తెలిసిందే. చదవండి: హిందీ భాషపై సంచలన వ్యాఖ్యలు, అజయ్, సుదీప్ మధ్య ట్వీట్ల వార్ దీనికి బదులుగా ఓ సీన్ కోసం స్టార్ హీరోయిన్ అనుష్కను తీసుకున్నట్లు నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. కాస్తా గ్లామర్ టచ్ కోసం చిత్రం బృందం ఓ అతిథి పాత్రకు అనుష్క శెట్టిని స్పంద్రించినట్లు తెలుస్తోంది. ఇందులో అనుష్క ఓ స్పెషల్ సాంగ్ లేదా ముఖ్య పాత్రలో కనిపించనుందని ఫిలీం దునియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే మూడేళ్లుగా అనుష్క వెండితెరకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. తన రీఎంట్రీ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఆమె ఫ్యాన్స్. ఈ నేపథ్యంలో అనుష్క అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చేందుకు చిత్రం బృందం ఈ విషయాన్ని సీక్రెట్‌గా ఉంచిందట. చదవండి: నేరుగా ఓటీటీలో విడుదల కానున్న నాని సినిమా!, ఎక్కడంటే.. ఇదే నిజమైతే ఆచార్య చూసేందుకు థియేటర్‌కు వచ్చిన స్వీట్ ఫ్యాన్స్‌కు ఇది పెద్ద సర్ప్రైజ్ అనే చెప్పాలి. మరి దీనిపై క్లారిటీ రావాలంటే ఏప్రిల్ 29 తేదీవరకు వేచి చూడాలి. కాగా ఆచార్య మూవీ ప్రమోషన్ భాగంగా ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న డైరెక్టర్ కొరటాల ఈ మూవీ నుంచి కాజల్‌ను తీసేశామని స్పష్టత ఇచ్చిన సంగతి తెలిసిందే. ‘‘ఆచార్య’పాత్రకు లవ్ ఇంట్రస్ట్ ఉంటే బాగుంటుందా? లేదా? అనే డౌట్ వచ్చింది. అదే సమయంలో కరోనా లాక్డౌన్ వచ్చింది. అప్పుడు బాగా ఆలోచించాను. నక్సలిజం సిద్ధాంతాలు ఉన్న వ్యక్తికి లవ్ ఇంట్రస్ట్ పెడితే బాగోదని ఉద్దేశించి ఆమెను తొలగించాం’’ అని తెలిపాడు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4311451212.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } });
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్‌రావు
కేకేఆర్‌తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్‌రౌండ్ షో.. పంజాబ్‌ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్‌లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
తప్పక చదవండి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్‌కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్‌తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్‌గా..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement