-
విజయ్ను కలిసి షణ్ముక ప్రియ, ‘లైగర్’ ఓ పాట పాడే అవకాశం
హీరో విజయ్ దేవరకొండ తాజా చిత్రం ‘లైగర్’. పాన్ ఇండియా ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ఈ మూవీలో ఇండియన్ ఐడల్ 12 కంటెస్టెంట్ షణ్ముక ప్రియకు పాట పాడే అవకాశం కల్పించాడు. తన గాత్రంతో సంగీత ప్రియుల్ని అలరిస్తూ..ఇండియన్ ఐడల్ సీజన్ 12లో మెరిసింది షణ్ముఖ ప్రియ. ఇటీవల షో నిర్వహకుల విజ్ఞప్తి మేరకు లైవ్‌లో జూమ్ ద్వారా షణ్ముకతో మాట్లాడిన విజయ్ గెలిచినా, ఓడినా అవకాశం ఇస్తానని మాట ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు విజయ్ తన హామీని నిలబెట్టుకున్నాడు. ఇండియన్ ఐడల్ 12 సీజన్లో షణ్ముక టాప్ 6 కంటెస్టెంట్స్‌లో ఒకరుగా నిలిచి ఫైనల్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. కానీ షణ్ముక ట్రోఫి మాత్రం గెలుచుకోలేకపోయింది. అయితే ఇటీవల ఈ షో ముగియడంతో తన స్వస్థలం విశాఖపట్నం చేరుకుంది. చదవండి: నేను పాడితే లోకమే ఆడదా.. ఉర్రూతలూగించిన షణ్ముఖప్రియ ఇక ఇటీవల వైజాగ్ చేరుకున్న షణ్ముక సోమవారం విజయ్ను కలిసింది. తన తల్లితో కలిసి హైదరాబాద్‌లో విజయ్ ఇంటికి వెళ్లింది. ఈ క్రమంలో విజయ్ ఆమెతో తనిష్క్ బాఘ్చి మ్యూజిక్ కంపోజిషన్‌లో ప్రియ పాట పాడించాడు. అయితే తుది మిక్సింగ్ అయిపోయిన తర్వాత పాటను వినాలని షణ్ముఖకు చెప్పాడు. ఆ తర్వాత విజయ్ దేవరకొండ తల్లి షణ్ముకను శాలువతో సత్కరించి చీరలు, ఇతర బహుమతులు అందజేసింది. రొమాంటిక్ స్పోర్ట్స్ యాక్షన్ సినిమాగా వస్తున్న ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్, పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై ఛార్మి నిర్మిస్తోంది. బాలీవుడ్ నటి అనన్య పాండే హీరోయిన్గా నటిస్తోంది. చదవండి: ఎంగేజ్మెంట్ వీడియో షేర్ చేసిన ముక్కు అవినాష్ -
షణ్ముఖప్రియ సుస్వరాల జల్లులో తడిసి ముద్దాయిన వైజాగ్
-
నేను పాడితే లోకమే ఆడదా.. ఉర్రూతలూగించిన షణ్ముఖప్రియ
సాక్షి,విశాఖపట్నం(మద్దిలపాలెం): ఇండియన్ ఐడల్–12 ఫైనలిస్ట్ షణ్ముఖప్రియ రాగాలాపనతో.. విశాఖ సాగరతీరం ఉవ్వెత్తున ఎగిసిపడింది. ఆమె సుస్వరాల జల్లులో నగరం తడిసి ముద్దయింది. రాక్ సింగర్‌గా తనదైన శైలిలో ఇండియన్ ఐడల్ వేదికపై ఉర్రూతలూగించిన షణ్ముఖప్రియ.. విశాఖ సంగీత ప్రియులను తన గానంతో మైమరిపించింది. ఇండియన్ ఐడల్ ముగిసిన తర్వాత తొలిసారిగా ఆదివారం విశాఖ వచ్చిన ఆమెకు నగర ప్రజల నుంచి అపూర్వ స్వాగతం లభించింది. ఈ సందర్భంగా గుర్రపు బగ్గీపై ఊరేగించారు. అనంతరం సిరిపురంలోని ఫోర్ పాయింట్ హోటల్లో ఆతీ్మయ అభినందన సభ నిర్వహించారు. విబాస్ మూవీస్ ఆధ్వర్యంలో వీరుమామా నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో షణ్ముఖప్రియకు నగర మేయర్ గొలగాని హరివెంకటకుమారి విశ్వగాన ప్రియ పురస్కారం ప్రదానం చేశారు. యంగ్ రాక్‌స్టార్ ఆఫ్ ఇండియాగా వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం కల్పిస్తూ.. గిరిజన కార్పొరేషన్ చైర్పర్సన్ శోభా స్వాతిరాణి చేతులమీదుగా ధ్రువీకరణపత్రం అందజేశారు. వి.విజయకుమార్ ఆమెకు రూ.10లక్షలు విలువ చేసే ప్లాట్ పత్రాలను బహూకరించారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ అతి చిన్న వయసులో షణ్ముఖప్రియ ఇండియన్ ఐడల్ వేదికగా విశాఖ నగర ఖ్యాతిని ఇనుమడింపజేసిందని కొనియాడారు. రాష్ట్ర విద్యా మౌలిక వసతుల, సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ మళ్ల విజయప్రసాద్ మాట్లాడుతూ సంగీత సామ్రాజ్యాన్ని శాసించే స్థాయికి షణ్ముఖప్రియ ఎదిగిందని సంతోషం వ్యక్తం చేశారు. ఆమె తల్లిదండ్రులు రత్నమాల, శ్రీనివాస్ మాట్లాడుతూ సొంతగడ్డపై అపూర్వ స్వాగ తం లభించడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా తన గానంతో షణ్ముఖప్రియ సంగీత ప్రియులను ఓలలాడించింది. తెలుగు, హిందీ, ఇంగ్లిష్ పాటలను ఆలపించి, అలరించింది. కార్యక్రమంలో మంత్రి రాజశేఖర్, విశాఖ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు, రంజిత్, రోటరీ దొర బాబు, రత్నరాజు, వినీతలు పాల్గొన్నారు. చదవండి: జూనియర్ ఎన్టీఆర్‌కు 9 సెంటిమెంట్ నిజమేనా? -
షణ్ముఖ ప్రియకు విశ్వ గాన ప్రియ బిరుదు
సాక్షి,విశాఖ పట్నం: ఇండియన్ ఐడల్ ఫైనలిస్ట్ షణ్ముఖ ప్రియకు ఈ నెల 5వ తేదీన విశ్వ గాన ప్రియ బిరుదుతో పాటు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో యంగస్ట్ సింగర్ ఆఫ్ ఇండియా అవార్డును అందజేస్తున్నట్టు నిర్వహకుడు వీరుమామ తెలిపారు. నగరంలోని ఓ హోటల్లో శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వేడుకులకు రాష్ట్ర మంత్రులు ముత్తంశెట్టి శ్రీనివాస రావు, ఎస్.అప్పలరాజు, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, మేయర్ హరివెంకట కుమారి, జీవీ తదితరు పాల్గొంటారన్నారు ఆరోజు సాయంత్రం 5 గంటలకు హోటల్ ఫోర్ పాయింట్లో ఈ వేడుకను నిర్వహించనున్నట్టు తెలిపారు. విజయ కుమార్ మాట్లాడుతూ షణ్ముఖ ప్రియకు తమ సంస్థ నుంచి పది లక్షలు విలువైన 108 గజాలు స్థలం బహుమతిగా ఇస్తున్నట్లు తెలిపారు. వేడుకులకు సంబంధించిన పాస్‌ల కోసం 99129 99949 నంబరుకు సంప్రదించాలన్నారు. చదవండి: బాక్సింగ్ రింగ్‌లోకి..విజయ్ దేవరకొండ -
హైదరాబాద్: ఇండియన్ ఐడల్ గాయకులతో సంగీత కార్యక్రమం
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ ఐడిల్లో విజేతగా నిలిచిన పవన్‌దీప్ రాజన్, అదే విధంగా తెలుగమ్మాయి షణ్ముక ప్రియతోపాటు మరో ఇద్దరు గాయకులతో హైదరాబాద్‌లో తొలిసారిగా ప్రత్యక్ష సంగత కార్యక్రమాన్ని నిర్వహించేందుకు 11.2, మెటలాయిడ్ ప్రొడక్షన్స్ ఈవెంట్ ఆర్గనైజ్డ్ సంస్థలు సిద్ధమయ్యాయి. కోవిడ్ నేపథ్యంలో దాదాపు 18నెలల సుదీర్ఘ విరామం తరువాత ప్రత్యక్ష సంగీత కచేరిలకు ఇదే తొలి వేదిక కానుంది. ఈ సందర్భంగా మెటలోయిడ్ ప్రొడక్షన్ ప్రతినిధి ప్రీతిష్ కోలాటి మాట్లాడుతూ.. ఇది రెండో దశ సంగీత వేదికగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతిభావంతులైన కళాకారులను ప్రేక్షకుల ముందుకు తీసుకచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. ‘ఇందులో భాగంగానే కేరళకు చెందిన తైక్కుడం బ్రిడ్జ్, మసాలా కాఫీ, ఇండియన్ ఐడిల్ షోలో ఫైనలిస్టులను ఈ వేదికపైకి తీసుకొస్తున్నాం. తైక్కుడం బ్రిడ్జ్ కళాకారుల ఆధ్వర్యంలో సెప్టెంబర్ 2న, ఇండియన్ ఐడల్ విజేత పవన్‌దీప్ రాజన్‌తో సెప్టెంబరు 3న హార్ట్‌కప్‌లో ప్రదర్శన నిర్వహించేందుకు సిద్దమవుతున్నాం. ఈ సిరీస్‌లో దేశంలోని అత్యుత్తమమైన సంగీతకారులతోపాటు గాయకులు పాలుపంచుకొని అబిమానులను ఉర్రూతలుగించనున్నారు. సెప్టెంబర్ 2 - తైకుద్దం బ్రిడ్జ్ మ్యూజిక్ బ్యాండ్ (ప్రిజం, గచ్చిబౌలి) వద్ద సెప్టెంబర్ 3 - ఇండియన్ ఐడల్ పవన్ దీప్ రాజన్ (హార్ట్ కప్ కాఫీ, గచ్చిబౌలి) సెప్టెంబర్ 23 - మసాలా కాఫీ మ్యూజిక్ బ్యాండ్ (ప్రిజం, గచ్చిబౌలి) వద్ద అక్టోబర్ 1 - ఇండియన్ ఐడల్ షణ్ముఖ ప్రియ (గ్రీజ్ మంకీ క్లబ్, జూబ్లీహిల్స్) అక్టోబర్ 2 - చిన్మయి + కాప్రిసియో అక్టోబర్ 9 - స్టాక్కాటో కాంటెంపోరే క్లాసిక్ బ్యాండ్ అక్టోబర్ 15 - శోభన (రవీంద్ర భారతి) వద్ద అక్టోబర్ 23 - ఇండియన్ ఐడల్ టాప్ 5 (హార్ట్ కప్ కాఫీ) వద్ద
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్‌స్టాప్‌గా...
- ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్‌బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement